Movies

నేనొక ఫైటర్‌ని… ఎప్పటికీ ఓడిపోను!

నేనొక ఫైటర్‌ని… ఎప్పటికీ ఓడిపోను!

నిధి అగర్వాల్‌ నక్కతోక తొక్కింది. వరుసగా మంచి అవకాశాల్ని అందుకుంటోంది. పవన్‌ కల్యాణ్‌ ‘హరి హర వీరమల్లు’లో తనే కథానాయిక. ఈ సినిమాపై చాలా అంచనాలు, ఆశలు ఉన్నాయి. తన కెరీర్‌లో ఇదో మేలిమి మలుపు అవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తపరుస్తోంది నిధి. ‘‘పవన్‌ లాంటి స్టార్‌తో నటించే అవకాశం రావడం అంటే మామూలు విషయం కాదు. అందుకోసం ఎంతో మంది స్టార్‌ హీరోయిన్లు ఎదురు చూస్తుంటారు. కెరీర్‌ ఆరంభించిన తొలి రోజుల్లోనే నాకు ఈ ఛాన్స్‌ వచ్చింది. ఈ విషయంలో నేను అదృష్టవంతురాలినే…’’ అంది. జయాపజయాల గురించి మాట్లాడుతూ ‘‘విజయం అంటే రకరకాలుగా నిర్వచిస్తుంటారు. అయితే నా దృష్టిలో విజయం అంటే ప్రస్తుతం ఉన్న క్షణాన్ని ఆస్వాదించడమే. జయాపజయాలకు నేను పెద్దగా విలువ ఇవ్వను. ఒకప్పుడు వాటి గురించి అతిగా ఆలోచించేదాన్ని. ఇప్పుడు అలా కాదు. నేను స్వతహాగా ఫైటర్‌ని. నాలాంటి వాళ్లకు పోరాటమే తెలుసు. ఓటమి తెలీదు’’ అంది..