Movies

మెరుపు తీగల రెచ్చిపోయిన మీరాజాస్మిన్

మెరుపు తీగల రెచ్చిపోయిన మీరాజాస్మిన్

మొన్నటికి మొన్న ఒక హాట్ ఫోటోతో సోషల్ మీడియాలో సడన్‌గా దర్శనమిచ్చింది మీరా జాస్మిన్. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైన ఈ ముద్దుగుమ్మ చాలా రోజుల తర్వాత మళ్లీ కనిపించింది. ఒకప్పటిలా బొద్దుగా కాకుండా మెరుపుతీగలా మేకోవర్ అయింది మీరా జాస్మిన్‌. ఈమెను చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. అమ్మో మీరా జాస్మిన్ ఇలా మారిపోయింది ఏంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు.2003లో శివాజీ హీరోగా వచ్చిన అమ్మాయి బాగుంది సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది మీరా జాస్మిన్. ఆ సినిమా చూసిన తర్వాత నిజంగానే అమ్మాయి బాగుంది అంటూ ఆమెకు వరుస అవకాశాలు ఇచ్చారు. రెండో సినిమాకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గుడుంబా శంకర్ సినిమాలో అవకాశం అందుకుంది. ఆ తర్వాత రవితేజ భద్ర సినిమాలో హీరోయిన్‌గా నటించింది. తర్వాత బాలకృష్ణ మహారథి సినిమాల్లో నటించింది మీరా. కెరీర్ మొదట్లోనే వరుసగా స్టార్ హీరోల సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న మీరా జాస్మిన్.. అంతే వేగంగా మాయమైపోయింది. గోరింటాకు సినిమాలో రాజశేఖర్ చెల్లెలిగా నటించిన మీరా జాస్మిన్‌.. ఆ తర్వాత ఎక్కువ సినిమాలు చేయలేదు. తెలుగు కంటే తమిళ, కన్నడ మలయాళ ఇండస్ట్రీలో ఎక్కువగా ఫోకస్ చేసింది మీరా జాస్మిన్. అక్కడే ఎక్కువ సినిమాలు చేసింది. 2014లో పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు బ్రేకిచ్చింది ఈ భామ. అయితే పెళ్లైన ఎనిమిదేళ్ల
తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది.

39 ఏళ్ల వయసులో కుర్ర హీరోయిన్లలకు పోటీ ఇస్తూ అదిరిపోయే ఫోటోషూట్ చేసింది మీరా జాస్మిన్. ఇవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు చాలా సాంప్రదాయంగా కనిపించిన మీరా జాస్మిన్ ఇప్పుడు ఇలా రెచ్చిపోవడానికి కారణం ఏంటి అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు. అందులో నాలుగు పదుల వయసులో ఆమె క్లీవేజ్ షో చేయడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ మధ్య తెలుగులో ఒక హీరో తన సినిమాలో అవకాశం ఇవ్వాలి అంటే.. కచ్చితంగా ఒక ఫోటో షూట్ చేయించుకోవాలి అని ఈమెకు కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. అందుకే మీరా తన రీ ఎంట్రీ కోసం ఇలా హాట్ ఫొటోస్ వైపు అడుగులు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ట్రెడిషనల్ బ్యూటీ ఇలా రెచ్చిపోతుంటే షాక్ అయిపోయి చూస్తున్నారు ఆడియన్స్.