హాలీవుడ్లో కూడా గుర్తింపు తెచ్చుకోవాలనే కోరికతో ఉన్న ప్రియాంక కు మరో హాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశం వెదుక్కుంటూ వచ్చింది. ఈ చిత్రంలో ఆమె ఆంటోనీ మాక్కీ సరసన నటించనున్నారు. హాలీవుడ్‌కు చెందిన ఓ వెబ్ సైట్ ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే ప్రియాంక కానీ ఆంటోనీ ఈ విషయాన్ని ఇంతవరకూ ధ్రువపరచలేదు. ప్రియాంక ఈ మధ్యే ‘సిటడెల్’ థ్రిల్లర్ సిరీస్ షూటింగ్ పూర్తి చేశారు. అలాగే ‘టెక్స్ట్ ఫర్ యు’ లో కూడా నటించారు. అమెజాన్ స్టూడియోస్ తో కలసి ‘ద లైఫ్ ఆఫ్ మా ఆనంద్ షీలా’ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక బాలీవుడ్ చిత్రాల విషయానికి వస్తే అలియా భట్, కట్రీనా కైఫ్‌తో కలిసి ‘జీ లే జరా’ చిత్రంలో నటిస్తున్నారు ప్రియాంక.