తిరువూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఆ నియోజకవర్గ పరిధిలోని టీడీపీ శ్రేణులు భారీగా తరలి వచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీ కేశినేని నాని హాజరయ్యారు. మాజీ మంత్రి జవహర్, నెట్టం రఘురాం, దేవినేని ఉమ, తంగిరాల సౌమ్య తదితరులు సైతం కార్యక్రమానికి హాజరయ్యారు. టీడీపీ నేతలకు స్థానిక బైపాస్ రోడ్లో గల అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో కార్యకర్తలను మాజీ మంత్రి జవహర్ ఉత్సాహ పరిచారు. అనంతరం ఎంపీ కేశినేని నాని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం తిరువూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయాన్ని కేశినేని నాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జవహర్, ఉమ, రఘురాం, తంగిరాల సౌమ్య, దేవదత్, స్వామిదాస్ తదితరులు పాల్గొన్నారు.