DailyDose

జగన్ తో చిరు భేటి – TNI తాజా వార్తలు – 07/02/2022

జగన్ తో చిరు భేటి – TNI తాజా వార్తలు – 07/02/2022

*ఈనెల 10న జగన్ తో మరోసారి భేటీ కానున్న మెగాస్టార్ చిరంజీవి.

*అస్వస్థతకు గురైన వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్ర బోస్. రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలింపు.

*చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ స్ట్రాటజీ మీటింగ్‌. సజ్జల ఉద్యోగుల్ని బెదిరించారు.పెంచిన సిమెంటు ధరలు తగ్గించాలి.హైకోర్టు తీర్పు రిజర్వులో ఉన్నప్పుడు రాజధాని భూములు తనఖా పెట్టడం చట్ట విరుద్ధం కాదా? -చంద్రబాబు

*ఈ నెల 16న బీజేపీలో యువ తెలంగాణ పార్టీ విలీనం. బండి సంజయ్ సమక్షంలో పార్టీని విలీనం చేయనున్న జిట్టా బాలకృష్ణారెడ్డి, రాణిరుద్రమ.

*వచ్చే నెల 4న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. ఈ బడ్జెట్ సమావేశాలోనే కొత్త రాజధాని ఏర్పాటు, కొత్త జిల్లాల పై ప్రత్యేక బిల్లు.

* హైకోర్టుకు ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ హాజరయ్యారు. రోడ్డు కాంట్రాక్టర్‌కు బిల్ ఇవ్వని కేసులో ఆయన హాజరైయ్యారు. కోర్టు ఆదేశాలిచ్చినా బిల్ ఎందుకు చెల్లించడం లేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. కోర్టు ధిక్కారం పిటిషన్ వేసిన తర్వాత డబ్బులు చెల్లించడంపై ఆరా తీసింది. ఏళ్ల తరబడి బిల్లులు ఎందుకు పెండింగ్ పెడుతున్నారని హైకోర్టు పేర్కొంది.

* ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో కంపెనీని భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) అమ్మకానికి పెడుతోంది. ఆంఽధ్రా ఫెర్రో అల్లాయ్స్‌ నుంచి రావాల్సిన రూ.26.73 కోట్ల బకాయిలు రాబట్టుకునేందుకు గాను కంపెనీని విక్రయించాలని నిర్ణయించింది. ఆస్తుల పునర్‌ వ్యవస్థీకరణ కంపెనీలు (ఏఆర్‌సీ), బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలు, ఆర్థిక సంస్థలు ఈ ఆస్తుల కోసం పోటీపడవచ్చని తెలిపింది. వచ్చే నెల 4వ తేదీన వేలం ద్వారా ఆంధ్రా ఫెర్రో అల్లాయ్స్‌ ఆస్తులు ‘స్విస్‌ ఛాలెంజ్‌’ పద్దతిలో వికయ్రించనున్నట్టు తెలిపింది. ఆంధ్రా ఫెర్రో అల్లాయ్స్‌తో పాటు మరో ఐదు కంపెనీలను ఎస్‌బీఐ ఈ వేలం ద్వారా విక్రయించనుంది. ఈ ఆరు కంపెనీల నుంచి ఎస్‌బీఐకి మొత్తం కోట్ల బకాయిలు రావాల్సి ఉంది.

* అస్సాం రాష్ట్ర ప్ర‌భుత్వం అన్ని కోవిడ్‌-19 ఆంక్ష‌ల‌ను ఎత్తివేసింది. ఫిబ్ర‌వ‌రి 15వ తేదీ నుంచి రాష్ట్రంలో ఎటువంటి ఆంక్ష‌లు ఉండ‌వ‌ని సీఎం హిమంత బిశ్వ‌శ‌ర్మ తెలిపారు. క‌ర్ఫ్యూను ఎత్తివేస్తున్నామ‌ని, ఇక నుంచి సాధార‌ణ జీవ‌న ప‌రిస్థితులు ఉంటాయ‌ని ఆయ‌న చెప్పారు. గ‌డిచిన రెండు వారాల నుంచి రాష్ట్రంలో కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గిన‌ట్లు ఆయ‌న తెలిపారు. అయితే మాస్క్‌లు, శానిటైజ‌ర్లను మాత్రం త‌ప్ప‌నిస‌రి చేయ‌నున్నారు. నైట్ క‌ర్ఫ్యూను ఇక విధించ‌బోమ‌న్నారు. షాపింగ్ మాల్స్‌, సినిమా హాళ్ల‌ను పూర్తి కెపాసిటీతో తెర‌వ‌నున్నారు. డ‌బుల్ వ్యాక్సిన్ తీసుకుని ఉంటే, పెండ్లిళ్ల‌కు కూడా ఆంక్ష‌ల‌ను ఎత్తివేయ‌వ‌చ్చు అన్నారు. స్కూల్ ఎగ్జామ్స్‌తో పాటు మ‌జౌలీ అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు సీఎం తెలిపారు.

* పీఆర్‌సీ సాధన సమితి నాయకులు ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందానికి వ్యతిరేకంగా నేటి నుంచి ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు ఆందోళనను నిర్వహించారు. ఫిట్‌మెంట్‌ పెంపు లేకుండానే ఒప్పందం ఎలా చేసుకున్నారని ఆరోపిస్తూ రాష్ట్రంలోని 12 ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పడ్డ ఫ్యాప్టో నిరసనలకు పిలుపునిచ్చింది. ఈరోజు ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలిపారు. పలు జిల్లాలో ఒప్పంద పత్రాలను దహనం చేశారు.

* మెరుగైన పీఆర్సీ కోసం ఉపాధ్యాయులు ఉద్యమబాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ… వారం రోజులపాటు నల్లబ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేస్తామన్నారు. కలిసి వచ్చే ఉద్యోగులతో ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళతామని తెలిపారు. ఈనెల న కలెక్టర్లకు వినతిపత్రం అందజేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. తమ డిమాండ్స్హక్కులు సాధించుకుంటామని ఉపాధ్యాయులు స్పష్టం చేశారు.

* కరోనా మహమ్మారి ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే సినీ పరిశ్రమలో ఎంతోమంది కరోనాతో ఇబ్బందిపడ్డారు. ఎక్కువశాతం కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారు. తాజాగా సహజనటి జయసుధ కరోనా బారినపడ్డారు. కాస్త విరామం కోసం ఆమె ఈ మధ్యన విదేశాలకు వెళ్లారామె. ప్రస్తుతం కరోనా బారిన పడ్డారని తెలిసింది. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్‌లో ఉన్నారు. వైద్యుల సూచన మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

* ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దును నిరసిస్తూ టీడీసీ నేత పరిటాల శ్రీరామ్ చేపట్టిన నిరాహార దీక్షా ప్రాంగణం వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. దీక్షా ప్రాంగణం వద్దకు పోలీసులు చేరుకున్నారు. దీంతో పోలీసులు, టీడీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ నేతలు రోడ్డుకు అడ్డంగా బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. దీక్షకు పోలీసులు సహకరించాలని టీడీపీ నేతలు వేడుకుంటున్నారు.

*దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులుభారతదేశం యొక్క రోజువారీ కేసులు 1 లక్ష కంటే తక్కువ నమోదు
దేశంలో గత 24 గంటల్లో 83,876 తాజా COVID19 కేసులు నమోదుగడచిన 24 గంటల్లో 1,99,054 రికవరీలు మరియు 895 మరణాలు నమోదుదేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 11,08,938దేశంలో ఇప్పటి వరకు సంభవించినమరణాల సంఖ్య: 5,02,874దేశవ్యాప్తంగా తగ్గిన కరోనా రోజువారీ పాజివిటీ రేటు: 7.25%దేశంలో ఇప్పటి వరకు ఇచ్చిన మొత్తం టీకాలు: 1,69,63,80,755.

* అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం జరిగిన విరాళాల సేకరణలో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందని, అదే స్ఫూర్తితో సూక్ష్మ విరాళాల సేకరణలోనూ ముందు నిలవాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు.

*హైదరాబాద్‌ రాష్ట్రంలోని ఎంబీబీఎస్, బీడీఎస్‌ వైద్య విద్య కోర్సుల్లో యాజమాన్య కోటాలో ప్రవేశాలకుగాను ఆన్‌లైన్‌ దరఖాస్తుల నమోదుకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్లకు నమోదు చేసుకోవాలన్నారు. యాజమాన్య కోటాలో సీట్ల భర్తీకి అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఈ నెల 6వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నారు.

*రామానుజాచార్యులు గొప్ప విప్లవకారుడని జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆయన ముచ్చింతల్‌లోని సమతామూర్తి విగ్రహాన్ని ఆదివారం సందర్శించారు. విగ్రహం చుట్టూ ఉన్న 108 దివ్యదేశాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి విశేషాలను తెలుసుకున్నారు. పవన్‌ కల్యాణ్‌ను చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. పవన్‌ కల్యాణ్‌తో పాటు మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌కు చినజీయర్‌స్వామి మంగళాశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. భవిష్యత్‌లో రామానుజాచార్యుల స్ఫూర్తిని ముందుకు తీసుకు వెళ్లేందుకు కృషి చేస్తానని చెప్పారు.

*లక్షన్నర కడితే దుబాయిలో ఉద్యోగం, మంచి జీతం అన్నాడు. మన ఊరి వాడే కదా.. అని నమ్మిన 15 మంది యువకులు అప్పుచేసి మరీ రూ.2.25 కోట్లు చేతిలో పెడితే నట్టేట ముంచాడు.

*రాష్ట్ర ప్రభుత్వం చర్చల పేరుతో సమ్మె విరమణ చేయించుకుని పైచేయి సాధించింది. ఈ ఒప్పందం నాయకులకు చ్చినా ఉద్యోగుల ఆశలు అడియాశలు అయ్యాయి. రాష్ట్ర పీఆర్సీల చరిత్రలో జగన్‌రెడ్డిది పంగనామాల పీఆర్‌సీ. ఈ పీఆర్సీలో ఉద్యోగులకు జరిగిన నష్టం… ఎన్ని పీఆర్‌సీలు వచ్చినా రికవరీ కాదు’’ అని ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు విమర్శించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ స్పందిస్తూ ‘‘మంత్రుల సబ్‌కమిటీ పేరుతో పెద్ద నాటకమే నడిచింది. ప్రభుత్వానికి మేలు జరిగింది తప్ప ఉద్యోగులకు పెనునష్టమే. 23 శాతం పీఆర్‌సీలో మార్పు కోసం మంత్రుల కమిటీ అంగీకరించకపోవడం అప్రజాస్వామికం.

*ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో పీఆర్సీ సాధన సమితి విఫలమైన నేపథ్యంలో.. ప్రస్తుత జేఏసీ నుంచి విడిపోయి కొత్త జేఏసీని ఏర్పాటుచేసి పోరాటాన్ని కొనసాగించాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాఫ్టో) నిర్ణయించింది.

* పెళ్లి బృందానికి ప్రమాదం అత్యంత బాధాకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు. బళ్లారిలో బిడ్డకు కన్యాదానం చేసి స్వగ్రామానికి కారులో వెళుతున్న బీజేపీ నాయకులు కోకా వెంకటప్పనాయుడుతో పాటు ఆయన కుటుంబ సభ్యులుబంధువులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం దురదృష్టకరమని పవన్ పేర్కొన్నారు. ఒకే కుటుంబంలోని ఐదుగురు మరణించడం మరింత బాధాకరమన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని పవన్ ప్రకటించారు.