ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన ‘రాజుగారి గది’ సిరీస్ సినిమాలు ఎంతగా విజయం సాధించాయో తెలిసిందే. మొదటి భాగంలో ఓంకార్ సోదరుడు అశ్విన్, ధన్య బాలకృష్ణన్ జంటగా నటించగా, రెండో భాగంలో అక్కినేని నాగార్జున, సమంత, సీరత్ కపూర్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పుడు ‘రాజుగారి గది 3’ కూడా రాబోతుంది. ఇందులో తమన్నా మేజర్ రోల్ పోషించనుంది. కథ మొత్తం తమన్నా చుట్టూ తిరుగుతుందట. మొదటి రెండు భాగాల్లో నటించిన ఆర్టిస్టులు ఇందులో కూడా కనిపిస్తారు. అయితే హీరోగా నాగార్జున నటిస్తున్నారా? లేక మరో నటుడు నటిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ఓంకార్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభించి మూడు నెలల్లో సినిమా పూర్తి చేస్తారని సమాచారం.
ఎన్ని గదులురా బాబు?
Related tags :