NRI-NRT

భారత్, ఉక్రెయిన్ మధ్య ఫ్లైట్స్పై ఆంక్షలు ఎత్తివేత

భారత్, ఉక్రెయిన్ మధ్య ఫ్లైట్స్పై ఆంక్షలు ఎత్తివేత

భారత్, ఉక్రెయిన్ మధ్య విమానాల్లో ఎయిర్ బబుల్ ఆంక్షలను ఎత్తివేసినట్లు భారత పౌర విమానయాన శాఖ ప్రకటించింది. ఆ దేశం వెళ్లే విమానాల పరిమితి, సీటింగ్ విషయంలోనూ గతంలో విధించిన ఆంక్షలు తీసేసినట్లు వెల్లడించింది. అధిక సంఖ్యలో విమానాలు, చార్టెడ్ ఫ్లైట్లు నడపవచ్చని ఆదేశాలు జారీ చేసింది. డిమాండ్ పెరగడంతో.. వీలైనన్ని విమానాలు నడపాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. విదేశీ వ్యవహారాల శాఖ సమన్వయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఉక్రెయిన్ నుంచి భారత్ కు వీలైనన్ని విమానాలు అందుబాటులో లేవని.. భారత రాయబార కార్యాలయానికి అనేక వినతులు వచ్చినట్లు పేర్కొన్నారు అధికారులు. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తలు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అయితే ఆ రెండు దేశాల మధ్య దౌత్య పరంగా జరిగిన చర్చలు సానుకూల ఫలితాలను ఇవ్వడంతో రష్యా సైన్యాన్ని వెనక్కి తీసుకుంది. ఉక్రెయిన్ సరిహద్దు నుంచి తమ సైన్యాన్ని తరలిస్తున్నట్లు తెలిపింది. దీంతో ఉక్రెయిన్ లో ఉద్రిక్తతలు సద్దుమనగడంతో భారత్ విధించిన ఆంక్షలు ఎత్తేసింది.