Business

రతన్ టాటాకు అవార్డు అందించిన అసోం సీఎం

రతన్ టాటాకు అవార్డు అందించిన అసోం సీఎం

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ బుధవారం ముంబైలో పారిశ్రామికవేత్త రతన్ టాటాకు రాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారం అసోం బైభవ్‌ను అందజేశారు. వ్యక్తిగత కారణాల వల్ల, జనవరి 24న గౌహతిలోని శ్రీమంత శంకరదేవ్ కళాక్షేత్రంలో జరిగిన అధికారిక అవార్డు వేడుకకు రతన్ టాటా హాజరు కాలేదు. దీంతో ఇవాళ రతన్ టాటాను కలిసి అవార్డు అందించారు సీఎం హిమంత బిస్వా శర్మ. రిశ్రామికవేత్త, పరోపకారి రతన్ టాటాకు ఈ అవార్డును ప్రదానం చేస్తున్నట్లు అసోం ప్రభుత్వం గత నెలలో ప్రకటించింది. అయితే అనారోగ్య కారణాల వల్ల అవార్డు అందుకోవడానికి అస్సాం వెళ్లలేకపోయారు. సీఎంకు రాసిన లేఖలో రతన్ టాటా అస్సాం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం శర్మను కలవాలని, కలిసి పని చేయాలని లేఖలో ఆయన ఆకాంక్షించారు. అస్సామీ ప్రజల శ్రేయస్సు కోసం శర్మ వ్యక్తిగత నిబద్ధతకు తాను ఆరాధిస్తున్నానని, ముఖ్యమంత్రి నుండి అవార్డును అందుకోవడం అసాధారణమైన గౌరవంగా భావిస్తున్నానని లేఖలో రతన్ టాటా పేర్కొన్నారు. ముఖ్యంగా, రాష్ట్రంలో క్యాన్సర్ చికిత్స సౌకర్యాలను మెరుగుపరిచే రంగంలో రతన్ టాటా చేసిన కృషికి అస్సాం బైభవ్ అవార్డు లభించింది.