ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు’, ‘వసంతం’, ‘దొంగోడు’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కళ్యాణి కావేరి. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండి, నటన ప్రాధాన్యమున్న పాత్రలనే ఎంచుకుంటూ సినీరంగంలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ‘శేషు’ సినిమాతో ఈమె తెలుగు ఇండస్ట్రీలోకి అరంగ్రేటం చేసింది. కళ్యాణి చేసింది తక్కువ సినిమాలే అయిన తన అందం, అభినయంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈమె తాజాగా మెగాఫోన్ కూడా పట్టింది.యాత్ర సినిమాలో చివరిగా నటించిన కావేరి ప్రస్తుతం ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తుంది. చేతన్ శ్రీను హీరోగా పరిచయం కాబోతున్న ఈ చిత్రాన్ని కళ్యాణి స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రూపొందుతుంది. లవ్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే సినిమా షూటింగ్ పూర్తి చేసి ఈ ఏడాది సమ్మర్లో విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తుందట.