Movies

సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్న ‘ఖిలాడి’ భామ

సోషల్ మీడియాలో దుమ్ము  రేపుతున్న ‘ఖిలాడి’ భామ

ప్రస్తుతం డింపుల్ హయతి టాలీవుడ్‌ అందాల సంచలనం అయింది. బికినీ హీరోయిన్‌గా కుర్రకారు గుండెల్లో ముద్రపడిపోయింది. ఆమె నటిస్తున్న సినిమాల్లో అలాంటి దుస్తులను ధరించేందుకే అధిక ప్రాధాన్యం ఇస్తోంది. రీసెంట్ గా వచ్చిన రవితేజ ‘ఖిలాడి’ లో అయితే అమ్మడు ఏకంగా టూపీస్ బికినీలో కనిపించి కనువిందు చేసింది. తాజాగా అమ్మడు కనిపించీ కనిపించకుండా తీయించుకున్న ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ ఫొటోలను చూసిన కుర్రకారు ఖంగుతిని, తమకు తోచిన విధంగా కామెంట్స్‌ పోస్ట్‌ చేస్తున్నారు. కోలీవుడ్‌ దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ – హీరో ప్రభుదేవా కాంబినేషన్‌లో వచ్చిన ‘దేవి-2’ చిత్రం ద్వారా డింపుల్‌ తమిళ వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ధనుష్‌ హీరోగా నటించిన బాలీవుడ్‌ చిత్రం ‘ఆంత్రాంగి రే’, విశాల్‌ హీరోగా నటించి, ఇటీవల విడుదలైన ‘వీరమే వాగై సూడుమ్‌’లో నటించింది.ఇలా డింపుల్‌ హయాతీ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు స్పెషల్‌ సాంగ్‌లు కూడా చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె పోస్ట్‌ చేసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి.