Devotional

సమతా మూర్తిని చూడాలంటే టికెట్ కొనాల్సిందే!

సమతా మూర్తిని చూడాలంటే టికెట్ కొనాల్సిందే!

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ లోని శ్రీరామ నగరంలో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకున్న రామానుజుల సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం నిర్వహణకు భారీ కసరత్తు జరుగుతోంది. 216 అడుగుల విరాట్‌ మూర్తి, 120 కిలోల బరువున్న 54 అంగుళాల స్వర్ణమూర్తి, 108 వైష్ణవ ప్రధాన ఆలయాలు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ఈ ఆధ్యాత్మిక క్షేత్ర నిర్వహణకు భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు రూ.1200 కోట్ల భారీ వ్యయంతో ఈ క్షేత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ క్షేత్రాన్ని దర్శనానికి రుసుము పెడుతున్నారు.

అందిన సమాచారం ప్రకారం.. తొలుత పెద్దలకు రూ.500, చిన్నారులకు రూ.200 టికెట్ ధర పెట్టాలని నిర్వహకు భావించారు. కానీ ఆ రుసుము భక్తులకు భారమవుతుందేమో అనే భావనతో కమిటీ సభ్యలు సమావేశం అయ్యారు. చివరికి పెద్దలకు రూ.150, చిన్నారులకు రూ.75గా టికెట్ ధరను ఖరారు చేశారు. మంగళవారం రాత్రి జరిగిన సమావేశంలో ఈమేరకు నిర్ణయించారు. రామానుజాచార్యుల సమతామూర్తి విగ్రహానికి ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయనున్నారు. అప్పటి వరకు స్వర్ణమూర్తి సందర్శనకు అనుమతించరు.

భద్రతలో చర్యల్లో భాగంగా విగ్రహానికి 6 నుంచి 8 అడుగుల దూరంలో బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ను ఏర్పాటు చేయనున్నారు.ఈ ప్రాంతంలో రక్షణ సిబ్బంది 24 గంటలూ పహారాలో ఉంటారు. ఎన్నో ప్రత్యేకతలతో ఉన్న ఈ క్షేత్రానిరి నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు సందర్శనకు అనుమతిస్తారు. పనులు పూర్తయ్యాక ఉదయం, సాయంత్రం వేళల్లో అనుమతించనున్నారు. మరో కొన్ని రోజుల్లో పనులు పూర్తవుతాయని నిర్వాహకులు చెబుతున్నారు.