NRI-NRT

కెనడాలో రోడ్డున పడ్డ భారతీయ విద్యార్థులు

కెనడాలో రోడ్డున పడ్డ భారతీయ విద్యార్థులు

ఉన్నత విద్య కోసం కెనడా వెళ్లిన భారతీయ విద్యార్థులను అక్కడి మూడు ప్రైవేటు కళాశాలలు రోడ్డున పడేశాయి. గత నెలలో అకస్మాత్తుగా దివాలా ప్రకటన చేసిన సదరు కాలేజీలు విద్యార్థుల భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చాయి. మాంట్రియల్‌ నగరంలోని సీసీఎస్‌క్యూ కాలేజీ, ఎం కాలేజీ, సీడీఈ కాలేజీలు ఆర్థికంగా నష్టాల వల్ల్ల ఈ నిర్వాకం చేశాయి. ఈ మూడు కాలేజీల్లో కలిపి 2000 మంది భారతీయలు వివిధ కోర్సులు చదువుతున్నారు. వీటిలో పంజాబ్‌, హరియాణా రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కువుగా ఉన్నారు. అయితే, దివాలా ప్రకటనకు కొద్ది రోజుల ముందు సదరు కాలేజీలు విద్యార్థుల నుంచి లక్షల రూపాయాల్లో ఫీజలు వసూలు చేశాయి. డబ్బును పోగొట్టుకుని, చదువు ఆగిపోయి దిక్కుతోచని స్థితిలో నిలిచిన విద్యార్థులు బుధవారం టొరంటోలో ఆందోళనకు దిగారు.