ఐటీ రంగంలో అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్‌కు గేట్‌వేగా ఉన్న మేడ్చల్, మల్కాజ్‌గిరి ప్రాంతంలో ‘ఐటీ గేట్‌వే పార్కు’ రావడం అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజున పార్కుకు శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషంగా ఉన్నదని చెప్పారు. మరిన్ని ఐటీ కంపెనీలు వచ్చేందుకు మంత్రి కేటీఆర్ విశేష కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం ఐటీ టవర్స్ ఏర్పాటుకు రిజిస్ట్రేషన్ చేసుకొన్నవారికి మంత్రి కేటీఆర్ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.