* జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎమ్‌డబ్ల్యు తన మినీ కూపర్ ఎలక్ట్రిక్ కారును మార్కెట్‌లోకి తీసుకొని వచ్చేందుకు సిద్దం అయ్యింది. గత ఏడాది డిసెంబర్ నెలలో బీఎమ్‌డబ్ల్యు ఐఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్యువిని లాంఛ్ చేసిన తర్వాత మినీ కూపర్ ఎస్ఈ త్రీ డోర్ ఎలక్ట్రిక్ కారును భారతదేశంలో లాంఛ్ చేయనుంది. ఈ మినీ కూపర్ ఎస్ఈ కారుని 2022 ఫిబ్రవరి 24న భారతదేశంలో విడుదల చేయనున్నారు. దీని కోసం ప్రీ బుకింగ్ కూడా ఓపెన్ చేశారు. మొదటి బ్యాచ్లో 30 యూనిట్ల కార్లు కూడా ఇప్పటికే అమ్ముడుపోయాయి.కొత్త మినీ కూపర్ ఎస్ఈని ప్రపంచవ్యాప్తంగా 2019లో ఆవిష్కరించారు.
* ప్రముఖ కంపెనీతో మారుతీ సుజుకీ కీలక ఒప్పందం..!
లీజింగ్ సబ్‌స్కిప్షన్ వేదిక క్విక్‌లీజ్‌తో వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. నెలవారీ చందా ప్రాతిపదికన క్విక్‌లీజ్ వేదికగా మారుతీ సుజుకీ వాహనాలను వినియోగదార్లు తీసుకోవడానికి ఈ భాగస్వామ్యం తోడ్పడుతుంది. సబ్‌స్క్రైబ్ పేరుతో మారుతీ సుజుకీ 2020 జూలై నుంచి సబ్‌స్క్రిప్షన్‌పైన వాహనాలను సమకూరుస్తోంది. వైట్ ప్లేట్ లేదా బ్లాక్ ప్లేట్ సబ్‌స్క్రిప్షన్‌ను ఎంచుకోవచ్చు. వాహనం కస్టమర్ పేరునే నమోదు అవుతుంది.హైదరాబాద్‌తో సహా 20 నగరాల్లో ఈ సౌకర్యం ఉంది. 12-60 నెలల కాలపరిమితితో వాహనాన్ని తీసుకోవచ్చు. కాల పరిమితి ముగిసిన తర్వాత వాహనాన్ని వెనక్కి ఇవ్వడం లేదా అప్‌గ్రేడ్‌కూ అవకాశం ఉంది. ఎటువంటి ముందస్తు చెల్లింపు అవసరం లేదు. బీమా, నిర్వహణ ఖర్చులు కలుపుకుని నెలవారీ రుసుము రూ.11,000 నుంచి ప్రారంభం. క్విక్‌లీజ్‌ను మహీంద్రా ఫైనాన్స్ ప్రమోట్ చేస్తోంది. చందాపై వాహనాలను కస్టమర్లకు చేర్చడానికి ఏఎల్‌డీ ఆటోమోటివ్, మైల్స్, ఓరిక్స్‌తో ఇప్పటికే మారుతీ సుజుకీ చేతులు కలిపింది
* జాతీయ అంతర్జాతీయ అంశాలు దేశీయ మార్కెట్‌లో ప్రభావం చూపాయి. దీంతో శుక్రవారం స్టాక్ మార్కెట్‌లు నష్టాల్ని చవిచూస్తున్నాయి. రష్యా – ఉక్రయిన్ మధ్య ఉద్రిక్తతలు గురువారం అమెరికన్ మార్కెట్‌లు నష్టాల బాట పట్టేలా చేశాయి. ఆ ప్రభావం ఆసియా మార్కెట్‌లపై పడడంతో శుక్రవారం 11.00గంటల సమయానికి దేశీయ మార్కెట్ లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 105 పాయింట్ల నష్టపోయి 57786 వద్ద, నిఫ్టీ 32 పాయింట్లు నష్టపోయి 17268 వద్ద ట్రేడ్ కొనసాగుతుంది.
*హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఏటీఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) డాక్టర్ పావులూరి సుబ్బారావు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అవార్డు అందుకున్నారు. 2022 సంవత్సరానికి సొసైటీ ఆఫ్ ఇండియన్ ఏరోస్పేస్ టెక్నాలజీస్ అండ్ ఇండస్ట్రీస్ (సియాటీ), బెంగళూరు ప్రకటించిన ఎక్స్లెన్స్ అవార్డు ఆయనకు లభించింది. కీలకమైన అంతరిక్ష, వైమానిక రంగాల్లో స్వదేశీ టెక్నాలజీని అభివృద్ధి చేసే సంస్థ లు, వ్యక్తులకు ఏటా ఈ అవార్డు ప్రదానం చేస్తారు. భారత వైమానిక దళానికి చెందిన ప్రధాన యుద్ద విమానాలకు అవసరమైన అధునాతన వీహెచ్ఎ్ఫ/యూహెచ్ఎఫ్ మాడ్యూల్స్. వీ/యూహెచ్ఎఫ్ రేడియోలను దేశీయంగా అభివృద్ధి చేయడంలో అనంత్ టెక్నాలజీస్ చేసిన కృషికి గుర్తింపుగా పావులూరి సుబ్బారావుకు ఈ ఎక్స్లెన్స్ అవార్డును ప్రధానం చేశారు. ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కే శివన్ చేతుల మీదుగా సుబ్బారావు ఈ అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సియాటీ ప్రెసిడెంట్ సీజీ కృష్ణదాస్ నాయర్, హెచ్ఏఎల్ సీఎండీ ఆర్ మాధవన్ పాల్గొన్నారు.
*తెలంగాణలో రూ.1000 కోట్ల పెట్టుబడి పెట్టాలని ఎంఆర్ఎఫ్ ఇండియా నిర్ణయించింది. గురువారం నాడు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావును ఎంఆర్ఎఫ్ ఇండియా వైస్ చైర్మన్, ఎండీ అరుణ్ మమ్మెన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లాలో కంపెనీ ప్లాంట్ను నిర్వహిస్తోందని, కార్యకలాపాల విస్తరణలో భాగంగా రూ.1,000 కోట్ల పెట్టుబడితో కొత్త అసెంబ్లీ లైన్ను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. కాగా కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎ్సఆర్)లో భాగంగా ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి రూ.4 కోట్లను అందించనున్నట్లు ఈ సందర్భంగా ఎంఆర్ఎఫ్ ప్రకటించింది. మరోవైపు అసోచామ్ ప్రతినిధుల బృందం కూడా మంత్రి కేటీఆర్ను కలుసుకుంది.
*వేదాంత్ ఫ్యాషన్స్ కంపెనీ షేర్లు బుధవారం మంచి లాభాలతో లిస్టయ్యాయి. రూ.866కి జారీ చేసిన ఈ షేర్లు బీఎ్సఈలో దాదాపు తొమ్మిది శాతం లాభంతో రూ.936 వద్ద లిస్టయ్యాయి. ఇంట్రా డేలో రూ.993కు చేరినా చివరికి 7.95 శాతం లాభంతో రూ.934.85 వద్ద ముగిశాయి. ఎన్ఎ్సఈలో మాత్రం 8.9 శాతం లాభంతో రూ.943.05 వద్ద ముగిశాయి
*దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం తిరిగి నీరసించింది. లాభాలతో ప్రారంభమైనా రోజంతా భారీ ఆటుపోట్లతో ట్రేడవుతూ చివరిలో ఏర్పడిన అమ్మకాల ఒత్తిడితో ఒక మోస్తరు నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 145.37 పాయింట్ల నష్టంతో 57,996.68 వద్ద, నిఫ్టీ 30.25 పాయింట్ల నష్టంతో 17,322.20 వద్ద ముగిశాయి.
*ఇంజనీరింగ్, తయారీ, డిజిటల్ టెక్నాలజీ సొల్యూషన్లు అందించే హైదరాబాద్ కంపెనీ సైయెంట్ 5జీ ప్రైవేట్ నెట్వర్క్ల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. దీనికి పరిశోధన భాగస్వామిగా ఐఐటీ హైదరాబాద్తో ఒప్పందం కుదుర్చుకుంది. వివిధ డిజిటల్ కేసుల వినియోగం, కాంపోనెంట్ల మధ్య పరస్పర వినియోగ సామర్థ్యంపై పరీక్షలు నిర్వహించేందుకు ఐఐటీ హైదరాబాద్ అభివృద్ధి చేసిన 5జీ కోర్ను ఉపయోగించుకునే అవకాశం కలుగుతుందని సైయెంట్ తెలిపింది.
*డాక్టర్ రెడ్డీస్ ఉత్పత్తులైన కాంబిహేల్, డాఫీల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు మాన్కైండ్ ఫార్మా బుధవారం ప్రకటించింది. వీటిలో కాంబిహేల్ తీవ్రమైన ఆస్త్మా కేసుల చికిత్సలో ఉపయోగించే ఔషధం కాగా డాఫీ శిశువుల మాయిశ్చరైజింగ్ బార్. ఉభయ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం దేశంలో ఈ రెండు ఔషధాల తయా రీ, మార్కెటింగ్, పంపిణీ హక్కులు మాన్కైండ్ ఫార్మా వశం అవుతాయి. మార్చి లోగా బ్రాండ్ల విలీనం, పరివర్తన ప్రక్రి య పూర్తవుతుందని భావిస్తున్నారు.
*చ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రాంగణ నియా మకాల ద్వారా 55,000కు పైగా ఫ్రెషర్లను నియమిం చుకోనున్నట్లు ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ తెలిపారు. నాస్కామ్ వార్షిక ఎన్టీఎల్ఎ్ఫ సదస్సులో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. టెక్నాలజీ రంగంలో ఇంజనీ రింగ్, సైన్స్ విద్యార్థులకు అపార అవకాశాలున్నాయన్న పరేఖ్.. ఈ ఉద్యోగాల్లో చేరేవారు స్వల్పకాలంలోనే కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు