DailyDose

చిత్తూరులో ప్రమాదం నలుగురు మృతి – TNI నేటి నేర వార్తలు

చిత్తూరులో ప్రమాదం నలుగురు మృతి –  TNI నేటి నేర వార్తలు

*చంద్రగిరి మండలం, ఐతేపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై సిమెంట్ లోడ్‌తో వెళుతున్న లారీని వెనుక నుంచి కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. మృతులు విశాఖ వాసులుగా పోలీసులు గుర్తించారు. తిరుపతి నుంచి చిత్తూరులోని గోల్డెన్ టెంపుల్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యంగానే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. కారులోనే మృతదేహాలు చిక్కుకుపోవడంతో చంద్రగిరి ఎమ్మార్వోతోపాటు పోలీసు అధికారులు సంఘటన ప్రదేశానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

* కృష్ణాజిల్లా గుడివాడ ..బ్యూటీషియన్ ముసుగులో గంజాయి దందా గుడ్లవల్లేరుకు చెందిన హలీమున్నీసా బేగం అరెస్ట్. బ్యూటీషియన్ గా పని చేస్తూ చాటుమాటుగా గంజాయి విక్రయం.భర్తతో విడిపోయి సాదిక్ అనే ప్రియుడితో బ్యూటీషియన్ సహజీవనం. సాదిక్ ఇటీవల గంజాయి కేసులో అరెస్టయి విజయవాడ జైలుకి తరలింపు.హలీమున్నీసా నివాసంలో తనిఖీలు చెయ్యగ 550గ్రాముల గంజాయి స్వాధీనం కేసు నమోదు చేసిన గుడ్లవల్లేరు పోలీసులు.

*ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా చీరాల మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఇంటర్‌ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. వీరిలో ఒకరిని మెరైన్‌ పోలీసులు రక్షించారు. వాడరేవు-రామాపురం దారిలో ఉన్న సముద్రంలో స్నానానికి ముగ్గురు దిగారు. ప్రమాదవశాత్తు వారు నీట మునిగారు. వారిలో ఒకరిని మెరైన్‌ పోలీసులు కాపాడగా మరో ఇద్దరు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఇంకొల్లుకు చెందిన వెంకటమారుతి, షేక్‌అఫ్రిది ఉన్నట్లు గుర్తించారు. విద్యార్థులు వేటపాలెం బండ్ల బాపయ్య కళాశాల విద్యార్థులుగా గుర్తించారు.

*టిప్పర్ లారీ ఢీకొని మహిళ మృతి
పెనమలూరు నిజయోవర్గం కంకిపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గంగూరు స్పిన్నింగ్ మిల్లు వద్ద వేగంగా దూసుకువచ్చిన టిప్పర్ లారీ మహిళను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. టిప్పర్ డ్రైవర్ వాహనాన్ని వదిలి పరారయ్యాడు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలు మల్లేశ్వరిగా (31)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

*పశ్చిమబెంగాల్‌లోని దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్‌లో శుక్రవారం మధ్యాహ్నం దుర్ఘటన చోటుచేసుకుంది. గ్యాస్ లీక్ కావడంతో కనీసం ముగ్గురు మృతి చెందారుపలువురు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. వీరి పరిస్థితి నెలకడగా ఉందని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారంస్టీల్‌ ప్లాంట్‌లోని వాక్యమ్ ఆక్సిజన్ యూనిట్ లోపల చిక్కుకుని ముగ్గురు కార్మికులు దుర్మరణంపాలయ్యారు. వారిని బయటకు తీసుకువచ్చి ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ప్లాంట్‌లో సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
*అనంతపురం జిల్లా లోలూరు కూడలి వద్ద ఓ రెస్టారెంట్లో వంట మాస్టర్గా పనిచేస్తున్న వ్యక్తిని.. తోటి కార్మికులు రాయితో కొట్టి దారుణంగా హతమార్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం లోలూరు కూడలి వద్ద దారుణ హత్య జరిగింది. ఓ రెస్టారెంట్‌ వంట మాస్టర్‌ను తోటి కార్మికులు రాయితో కొట్టి చంపారు. తాగి గొడవపడి హత్య చేసినట్లు సమాచారం. మృతుడు గుంతకల్లుకు చెందిన అల్లా బకాష్‌గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు

* విరుదునగర్‌ జిల్లా రాజపాళయం వద్ద పొలంలో దాచి వుంచిన లక్షలాది రూపాయల విలువ చేసే రెండు ఏనుగు దంతాలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.రాజపాళయం పుల్లుపత్తి ప్రాంతంలో ఉన్న పంటపొలంలో ఏనుగు దంతాలను దాచి వుంచినట్లు అటవీ శాఖ అధికారులకు రహస్య సమాచారం అందింది. అటవీశాఖ అధికారులు ఆ పొలంలో తనిఖీలు చేసినప్పుడు ఓ చోట దాచి వుంచిన రెండు ఏనుగు దంతాలు లభ్యమయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి ఆ పొలంలో బసచేస్తున్న ముత్తురాజ్‌ అనే వ్యక్తిని అరెస్టు చేశారు

* దాచేపల్లిలో ఎయిర్ పిస్టల్ కలిగి ఉన్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ మద్యం వ్యాపారంలో నరసింహారావు, శ్రీకాంత్ అనే వ్యక్తుల మధ్య విబేధాలు వచ్చాయి. గతంలో తనను ఎక్సైజ్ అధికారులు పట్టుకోవటానికి నరసింహారావే కారణం అని అనుమానించి శ్రీకాంత్ కక్ష పెంచుకున్నాడు. నాలుగు రోజులు క్రితం తన ఇద్దరు స్నేహితులతో కలిసి నరసింహారావుపై శ్రీకాంత్ దాడికి పాల్పడ్డాడు. స్థానికులు ప్రతిఘటించడంతో ఎయిర్ పిస్టల్‌తో కాల్పులు జరిపి శ్రీకాంత్ పారిపోయాడు. నరసింహారావు ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీకాంత్‌తో పాటు అతని స్నేహితులు రవీంద్ర, వెంకటేశ్వర్లును అరెస్టు చేశారు. ఎయిర్ పిస్టల్, తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ‌

*మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు ఇంట్లో చోరీ
మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు ఇంట్లో దుండగులు చోరీకి తెగబడ్డారు. ఉంగుటూరు మండలం అమదాలపల్లిలో ఘటన చోటు చేసుకుంది. గత రాత్రి ఎవరు లేని సమయంలో తలుపులు పగులగొట్టి ఇంట్లో ప్రవేశించిన దుండగులు…‌‌ లక్షన్నర నగదు, కొంత బంగారు ఆభరణాలను అపహరించారు. చోరీ ఘటనపై దాసరి బాలవర్ధనరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

* నారావారిపల్లెలో టీడీపీ అధినేత చంద్రబాబుకు చెందిన భూమి కబ్జాకు యత్నం – సర్వే నెంబర్ 222/5లోని 38 సెంట్లు ఆక్రమించేందుకు యత్నం – చంద్రబాబు స్థలంలో రాతి కూసాలు నాటుతున్న కబ్జాదారులు – 1989లో 87 సెంట్లు రిజిస్టర్ భూమి కొనుగోలు చేసిన ఖర్జూరనాయుడు – 87 సెంట్లలో ఆస్పత్రి, కల్యాణ మండపానికి కొంత భూమి వితరణగా ఇచ్చిన చంద్రబాబు – చంద్రబాబుకు చెందిన 38 సెంట్ల భూమిలో ఫెన్సింగ్ వేస్తున్న కబ్జాదారులు

*కృష్ణా జిల్లా, పెనమలూరు నియోజకవర్గం, గంగూరులో ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి. గుంటూరు జిల్లా వినుకొండ కి చెందిన మల్లీశ్వరి(30) అనే మహిళా ని అధిక వేగంతో లారీ వెక్కడంతో మృతి . కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్న పోలీసులు.

*ఆర్థిక ఇబ్బందులతో భర్త ఆత్మహత్య చేసుకోగా భర్తలేని జీవితం ఎందుకుని భార్య కూడా ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ సంఘటన చేసుకుంది. శ్రీకాకుళంలో జిల్లాలోని సంతబొమ్మాళి మండలం కుక్కలవానిపేటలో ఆర్థిక సమస్యలతో కేశవ అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మృతిని తట్టుకోలేక భార్య గొంతుకోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

*ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రగిరి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని ఐతేపల్లి గ్రామం మామండూరు జాతీయరహదారిపై లారీని , కారు ఢీకొంది. ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ, మరో వ్యక్తి కారులో ఉన్నారు.విశాఖపట్నం నుంచి కాణిపాకం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు విశాఖ వాసులుగా గుర్తించారు. ఘటనలో తీవ్రంగా గాయపడ్డ కారు డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు.

* కర్నూలుజిల్లాలోని పంచలింగాల సెబ్ చెక్‌పోస్ట్ వద్ద ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున సెబ్ చెక్‌పోస్ట్ మీదికి ఓ కారు అదుపుతప్పి దూసుకొచ్చింది. కారు హైదరాబాద్ నుండి కర్నూల్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ మద్యం మత్తు కారణంగా కారు డివైడర్‌లకు గుద్దుకొని ఆపై సిబ్బందిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుకు కాలు విరగగామరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

*బీరు సీసా పేల‌డంతో ఆర్టీసీ డ్రైవ‌ర్‌కు తీవ్ర‌గా‌యా‌ల‌య్యాయి. ఈ ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రం‌లోని ఆర్టీసీ బస్టాప్‌ వద్ద గురు‌వారం సాయంత్రం చోటు‌చే‌సు‌కొ‌న్నది. ఆర్టీసీ డ్రైవర్‌ భక్తు‌లను తాడ్వా‌యికి తర‌లిం‌చిన తరు‌వాత బస్సును బస్టా‌ప్‌లో నిలి‌పాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న దుకా‌ణంలో బీరు కొను‌గోలు చేసి బొడ్లో పెట్టు‌కొని వెళ్తున్న క్రమంలో బాటిల్‌ పేలింది. ఈ ప్రమా‌దంలో సదరు డ్రైవర్‌ పొట్ట భాగంలో తీవ్ర గాయం కాగా కడు‌పు‌లోని పేగులు బయ‌టకు వచ్చి‌నట్టు తెలి‌సింది. సహ‌చర డ్రైవర్లు వెంటనే అత‌డిని 108 వాహ‌నంలో హైద‌రా‌బా‌ద్‌కు తర‌లిం‌చారు.

*ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా చీరాల మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఇంటర్‌ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. వీరిలో ఒకరిని మెరైన్‌ పోలీసులు రక్షించారు. వాడరేవు-రామాపురం దారిలో ఉన్న సముద్రంలో స్నానానికి ముగ్గురు దిగారు. ప్రమాదవశాత్తు వారు నీట మునిగారు. వారిలో ఒకరిని మెరైన్‌ పోలీసులు కాపాడగా మరో ఇద్దరు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఇంకొల్లుకు చెందిన వెంకటమారుతి, షేక్‌అఫ్రిది ఉన్నట్లు గుర్తించారు. విద్యార్థులు వేటపాలెం బండ్ల బాపయ్య కళాశాల విద్యార్థులుగా గుర్తించారు.

*Punjab సీఎం ఛన్నీపై పాట్నా పోలీసులకు ఫిర్యాదు
పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ పాట్నా నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఉత్తరప్రదేశ్, బీహార్‌లకు చెందిన భయ్యాల గురించి అవమానకరమైన వ్యాఖ్య చేసినందుకు పాట్నాలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.భారతీయ జనతా యువమోర్చా జాతీయ ఉపాధ్యక్షుడు మనీష్ కుమార్ సింగ్ కదమ్ కువాన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీకి చెందిన వ్యక్తుల గురించి పంజాబ్ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు తన మనోభావాలను దెబ్బతీశాయని, దీంతో ఫిర్యాదు చేయడానికి తనను ప్రేరేపించారని యువ బీజేపీ నాయకుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

*పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం, జగన్నాధపురం గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. నిన్న జరిగిన ఉరుసు ఉత్సవంలో ఇద్దరు యువకుల మధ్య గొడవ జరిగింది. ఘర్షణ సమయంలో ఓ సామాజిక వర్గ యువకుడి మెడలో బంగారు గొలుసు మాయమైంది. అక్కడితో వివాదం రాజకీయ మలుపు తిరిగింది. గత నెలలో గ్రామంలో రంగా విగ్రహం ఆవిష్కరణ జరిగింది. అయితే అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు మరో సామాజిక వర్గం ప్రయత్నించింది. ఇందుకు స్థానికులు అంగీకరించకపోవడంతో ఆ సామాజిక వర్గం నేతలు ఆందోళనకు దిగారు. కమ్యూనిటీ హాలు వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో భారీగా పోలీసులు మోహరించారు

*పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ అమ్మాయి జిల్లాకు చెందిన ఓ అబ్బాయితో ఫేస్బుక్ ద్వారా ప్రేమలో పడింది. వీరి వ్యవహారాన్ని ఇంట్లో ఒప్పుకోకపోవడంతో అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేసింది. పట్టణ సీఐ తేజమూర్తి తెలిపిన వివరాల మేరకు.. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం కురుకూరు గ్రామానికి చెందిన సుజినకు ఏడాది క్రితం కణేకల్లు మండలం పూలచెర్లకు చెందిన నగేష్తో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇద్దరూ కొంతకాలం కల్లూరులోని ఓ సెల్ షో రూంలో పనిచేశారు. కొన్ని రోజులకే ఇద్దరూ ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు

*వివాహ వేడుక ఏకంగా 13 మంది ప్రాణాలను బలితీసుకుంది. ఉత్తరప్రదేశ్లోని కుషినగర్ జిల్లాలోని నెబువా నౌరంగియా గ్రామంలో ఈ విషాద ఘటన బుధవారం రాత్రి జరిగింది.

*చాగలమర్రి మండలంలోని మద్దూ రు గ్రామం నుంచి కడప జిల్లా వైపు అక్రమంగా తరలిస్తున్న 13 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్ఐ రమణయ్య గురువారం తెలిపారు. మద్దూరు మెట్ట సమీపంలో బోలేరో వాహనంలో రేషన్ బియ్యం తరలిస్తుండగా తనిఖీ చేసి అందులో 13 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నామని అన్నారు. దువ్వూరు మండలం కానగూడురు గ్రామానికి చెందిన సుధాకర్, పెద్దబాకరపేటకు చెందిన మహేంద్రారెడ్డిలను అదుపులోకి తీసుకొని పట్టుబడిన వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు

*తిరుమలాయపాలెం మండలంలోని కాకరవాయి, ఏలువారిగూడెం గామాలలో రెండు ఇళ్లలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీలకు పాల్పడ్డారు. సుమారు 20 తులాల బంగారంతోపాటు 30 తులాల వెండిని దొంగలు ఎత్తుకెళ్ళారు. కాకరవాయి గ్రామానికి చెందిన బీరెడ్డి నారాయణ ఇంట్లో ఎవరులేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి 15 తులాల బంగారం, 30 తులాల వెండి, 30వేలను దొంగలు ఎత్తుకెళ్ళారు. ఏలువారి గూడేనికి చెందిన తాటి ఉపేంద్ర ఇంటి తాళం పగులగొట్టి 6 తులాల బంగారం, రూ.3వేలు ఎత్తుకెళ్ళారు. కాగా ఘటనాస్థలాన్ని రూరల్సీఐ సత్యనారాయణరెడ్డి, కూసుమంచి ఎస్సై వై.నందీప్ సందర్శించి వివరాలు సేకరించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.

*తిరుమలాయపాలెం మండలంలోని కాకరవాయి, ఏలువారిగూడెం గామాలలో రెండు ఇళ్లలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీలకు పాల్పడ్డారు. సుమారు 20 తులాల బంగారంతోపాటు 30 తులాల వెండిని దొంగలు ఎత్తుకెళ్ళారు. కాకరవాయి గ్రామానికి చెందిన బీరెడ్డి నారాయణ ఇంట్లో ఎవరులేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి 15 తులాల బంగారం, 30 తులాల వెండి, 30వేలను దొంగలు ఎత్తుకెళ్ళారు. ఏలువారి గూడేనికి చెందిన తాటి ఉపేంద్ర ఇంటి తాళం పగులగొట్టి 6 తులాల బంగారం, రూ.3వేలు ఎత్తుకెళ్ళారు. కాగా ఘటనాస్థలాన్ని రూరల్సీఐ సత్యనారాయణరెడ్డి, కూసుమంచి ఎస్సై వై.నందీప్ సందర్శించి వివరాలు సేకరించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.

*చెన్నూరు మండలంలోని కొండపేట గ్రామానికి చెందిన జ్యోతి (26) అనే వివాహిత గురువారం తన ఇంటిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలి భర్త రంగనాయకులు స్థానికంగా బేల్దారి పనులు చేసుకుని జీవించేవాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా ఉదయం బేల్దారి పనులకు వెళ్లిన భర్త తాను ఇంటికి రావడం లేదని చెప్పేందుకు ఫోన్ చేయగా భార్య నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పక్కింటి వారికి ఫోన్ చేసి చెప్పాడు. వారు ఇంటికి వెళ్లి చూడగా అప్పటికే ఆమె వికతజీవిగా పడి ఉండడంతో ఆమె భర్తకు చెప్పారు. విషయం తెలుసుకున్న ఇన్చార్జ్ ఎస్ఐ తులసీనాగప్రసాద్ సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని రిమ్స్కు తరలించారు. కాగా ఆమె ఇద్దరు కుమారులైన రాజేష్, శ్రీకర్లు తల్లి చుట్టూ తిరుగుతూ చనిపోయిన విషయం తెలియక ఉండడంతో స్థానికులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు

*చెన్నూరు మండలంలోని కొండపేట గ్రామానికి చెందిన జ్యోతి (26) అనే వివాహిత గురువారం తన ఇంటిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలి భర్త రంగనాయకులు స్థానికంగా బేల్దారి పనులు చేసుకుని జీవించేవాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా ఉదయం బేల్దారి పనులకు వెళ్లిన భర్త తాను ఇంటికి రావడం లేదని చెప్పేందుకు ఫోన్ చేయగా భార్య నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పక్కింటి వారికి ఫోన్ చేసి చెప్పాడు. వారు ఇంటికి వెళ్లి చూడగా అప్పటికే ఆమె వికతజీవిగా పడి ఉండడంతో ఆమె భర్తకు చెప్పారు. విషయం తెలుసుకున్న ఇన్చార్జ్ ఎస్ఐ తులసీనాగప్రసాద్ సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని రిమ్స్కు తరలించారు. కాగా ఆమె ఇద్దరు కుమారులైన రాజేష్, శ్రీకర్లు తల్లి చుట్టూ తిరుగుతూ చనిపోయిన విషయం తెలియక ఉండడంతో స్థానికులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు