Movies

డీజే భామ అంత డిమాండ్ చేస్తోందా..?

Auto Draft

డీజే టిల్లు సినిమాతో సాలీడ్ హిట్ అందుకున్న కుర్ర భామ నేహా శెట్టి ఇప్పుడు రెమ్యునరేషన్ బాగా పెంచేసిందని టాక్ వినిపిస్తోంది. సాధారణంగా హీరోయిన్ మొదటి రెండు సినిమాలకే నిర్మాతలు ఇచ్చిన రెమ్యునరేషన్ తీసుకుంటారు. రెండు సక్సెస్‌లు గనక వస్తే మాత్రం వాళ్ళు డిమాండ్ చేసినంత నిర్మాతలు ఇవ్వాల్సిందే అనేట్టుగా ఉంటుంది వ్యవహారం. కెరీర్ ప్రారంభంలో వరుసగా ఫ్లాప్స్ చూసిన పూజా హెగ్డే ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్‌గా భారీ రెమ్యునరేషన్ అందుకుంటోంది. అలాగే, ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న రష్మిక మందన్న ..ఆ తర్వాత గీత గోవిందం భారీ హిట్ సాధించడంతో అంతకంతా తన రెమ్యునరేషన్ పెంచుతూ వస్తోంది.

ఇక ఎలాంటి గ్లామర్ రోల్స్, ఎక్స్‌ఫోజింగ్ చేయకుండానే తన పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటూ కొన్ని కథలకు సాయి పల్లవి తప్ప మరెవరూ సూటవరు అనేట్టుగా క్రేజ్ తెచ్చుకున్న ఫిదా బ్యూటీ సాయి పల్లవి కూడా ఇప్పుడు తన రెమ్యునరేషన్ బాగానే పెంచినట్టు సోషల్ మీడియాలో వాస్తలు వస్తున్నాయి. నేచురల్ పర్ఫార్మర్‌గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి ఇటీవల వరుసగా లవ్ స్టోరి, శ్యామ్ సింగ రాయ్ చిత్రాలతో మంచి సక్సెస్‌లను అందుకుంది. దాంతో ఆచీతూచి సినిమాలను ఎంచుకోవడమే కాదు..తను డిమాండ్ చేసినంత రెమ్యునరేషన్ ఇస్తేనే కొన్ని ఖచ్చితమైన నియమాల ప్రకారం ప్రాజెక్ట్‌కు ఓకే చెప్తుంది. ఇలాంటి క్రేజీ హీరోయిన్స్ మధ్యలో ఇండస్ట్రీకి పరిచయమైన యంగ్ బ్యూటీ నేహ శెట్టి.. ఒక్క సక్సెస్‌తో అటకెక్కి కూర్చుందని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది.డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. తన కొడుకు ఆకాష్‌ను హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన సినిమా మెహబూబా. ఈ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైంది నెహా శెట్టి. తన మొదటి సినిమా ఫ్లాపయినా కూడా డీజే టిల్లు సినిమాలో అవకాశం అందుకుంది. ఇటీవల వచ్చిన ఈ సినిమాతో సాలీడ్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. యూత్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబడుతూ దూసుకుపోతోంది. ఇందులో నేహా తన అందచందాలతో బాగా అకాట్టుకోవడమే కాదు, కొన్ని లిమిటేషన్స్ దాటి మరీ కుర్రాళ్ళకు హీటు పుట్టించింది. డీజే టిల్లు సినిమాతో ఈ యంగ్ బ్యూటీ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. దాంతో ఇప్పుడు మేకర్స్ తమ సినిమాల కోసం డేట్స్ అడిగితే, రెమ్యునరేషన్ భారీగా చెప్పి భయపెడుతుందని ప్రచారం జరుగుతోంది. ఒక్కటంటే ఒక్క సినిమాకే ఇలా మేకర్స్‌ను భయపెడితే ఇక అమ్మడికి అవకాశాలు వస్తాయా..? అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారట.