NRI-NRT

క్రీడాకారులకు దుస్తులు పంపిణీ చేసిన ఎన్నారై తెరాస

NRI TRS Bahrain Donates Sporting Clothes To Rural Players

కేసీఆర్ జన్మదినం సందర్భంగా వాలీబాల్‌ క్రీడాకారులకు NRI TRS Bahrain విభాగం ఆధ్వరంలో క్రీడాకారులకు దుస్తులు పంపిణీ చేశారు. వేములవాడ నియోజకవర్గం, రుద్రంగి మండలంలో శనివారం నుంచి జరిగే రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలకు హాజరవుతున్న జగిత్యాల జిల్లా కథలపూర్ మండలం ఊటుపల్లి గ్రామ క్రీడాకారులకు ఎన్నారై టిఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ ఆధ్వర్యంలో దుస్తులను ఉపాధ్యక్షుడు బొలిశెట్టి వెంకటేష్ అందజేశారు. గ్రామీణ ప్రాంతంలో ప్రతిభగల క్రీడాకారులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు వారిని వెలికి తీయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని వెంకటేష్ అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు మానసిక ఉల్లాసంగా ఉండేందుకు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలపై దృష్టి సారించాలని, చెడువ్యాసనాలకు అలవాటు పడకుండా క్రమశిక్షణతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఅర్ఎస్ నాయకులు గజ్జెల స్వామి, గణేష్, రమేష్, మహేందర్, దేవయ్య, రాజేశం, వాలీబాల్‌ టీం కెప్టెన్ ప్రవీణ్, సాగర్, నవీన్, ప్రశాంత్, జీవన్, శేఖర్, వినయ్, లక్ష్మీనరసయ్య, రమణ తదితరులు పాల్గొన్నారు.