DailyDose

గానుగ నూనెలు మళ్ళీ వచ్చేశాయి.!

గానుగ నూనెలు మళ్ళీ వచ్చేశాయి.!

రిఫైన్డ్ ఆయిల్ మంచిదని ఒకరు … డబుల్ రిఫైన్డ్ వాడాలంట అని ఇంకొకరు …. ఒక్క రకం కాదు .. , రెండు మూడు రకాల్ని కలిపి వాడాలని ఇంకొందరు … అసలు ఇవేం కాదు .. , వర్జిన్ , ఎక్స్ట్రా వర్జిన్వి వాడితేనే మేలని మరికొందరు … ఇలా ఎవరికి తోచింది వారు చెప్పడం వినే ఉంటాం . ఇప్పుడు వాటన్నింటినీ సంప్రదాయ గానుగ నూనెలు ( కోల్డ్ ప్రెస్డ్యిల్స్ ) పక్కకు తోసేశాయి . ఆరోగ్యరక్షణకు తామే మేలంటున్నాయి .

**ఏనూనె వాడాలి ఎంత వాడాలీ వంటి లెక్కలు వేయడం పక్కనపెడితే .. అసలు నూనె లేకుండా వంట పూర్తి కావడం . కష్టమే . ఆహారంలో భాగమైన మానెలది . ఆరోగ్య పరిరక్షణలో కీలకపాత్ర పూర్వం వంటలకు గానుగ నూనెల్నే వాడేవారు . అనారోగ్యంతో ఉన్న వ్యక్తులకు బాలింతలకు ప్రత్యేకంగా గానుగ నూనె పదాల్ని చేసి పెట్టేవారు . నిజానికి స్వచ్ఛమైన ఆయిల్ అంటే రిఫైన్ చేయనిదే . కాలక్రమంలో , అనారోగ్య కారక పదార్థాలను తీసేస్తాం . అంటూ రిఫైన్డ్ ఆయిల్స్ మార్కెట్లోకి . రావడంతో గానుగ నూనెల వాడకం తగ్గింది . రిఫైన్డ్ ఆయిల్స్ అంటే శుద్ధి చేసిన నూనెలు కానీ ఈ తైలాల తయారీ కోసం పూర్తిగా గింజలనే వాడతారనే ‘ నమ్మకం లేదు . పెట్రోలియం బైప్రొడక్ట్ అయిన పాలిమర్ ఆయిల్ నుంచి కూడా ఈ రిఫైన్డ్ నూనెలు తయారు చేస్తారు . ఇవి కెమికల్ ట్రీట్మెంట్ తయారవుతాయి . వీటిల్లోనూ ఎన్నో రకాలు . ఎక్స్ ట్రా రిఫైన్డ్ , డబుల్ రిఫైన్డ్ , ట్రిపుల్ రిఫైన్డ్ . ఇలా పేరేదైనా మార్కెటింగ్ మ్యాజిక్కే తప్ప పోషకాలు శరీరానికి అందే అవకాశం తక్కువే . దీన్ని అనేక అధ్యయనాలు వెల్లడించాయి . దాంతో ప్రజలు తిరిగి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ బాట పడుతున్నారు . కరోనా కారణంగా కూడా మళ్లీ ఆరోగ్యం , పోషకాల పేరుతో సంప్రదాయ నూనెలకూ , రసాయన అవశేషాలు లేని సహజ ఆహారానికి ప్రాధాన్యం పెరిగింది . వెనకటి వంటకాలకు ఆదరణ లభిస్తోంది . చిరుధాన్యాలకు ప్రాధాన్యం ఇచ్చినా , మట్టి కుండల్లో తింటున్నా ఇదే కారణం . ఇప్పుడు గానుగ నూనెల వంతు.
k1
**ఎంటి కోల్డ్ ప్రెస్ట్ అయిల్స్..
పూర్వం చెక్క బానకు కాడెద్దుని కట్టినెమ్మదిగా తిప్పుతూ పల్లీలు , నువ్వులు , కుసుమలు , పొద్దుతిరుగుడు , ఆవాలు , కొబ్బరి , నువ్వులు … వంటివాటి నుంచి నూనెల్ని తీసేవారు . వాటినే వంటలకు ఉపయోగించేవారు . వీటినే ఇప్పుడు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటున్నారు . అతి తక్కువ ఉష్ణోగ్రత దగ్గర గింజల్ని ఒత్తిడికి గురి చేసి నూనెను ఉత్పత్తి చేయడం వల్ల వాటికి ఈ పేరొచ్చింది . అంటే , ఈ విధానంలో 49 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడి పుట్టకుండా నూనె తీస్తారు . ఇప్పుడు ఈ నూనెల తయారీకోసం ప్రత్యేకించి మెషీన్ లు వచ్చేశాయి . గానుగకు మల్లేనే వీటి తయారీలోనూ చెక్కును వినియోగిస్తారు అందుకే ఇలా తీసిన నూనెను చెక్క నూనెగానూ పిలుస్తున్నారు ఈ విధానంలో తీసే నూనెల్లో పోషకాలూ చెక్కు చెదరవు తయారీలో రసాయనాల్ని ఏ మాత్రం వాడరు . చక్కటి రుచి , వాసనా వీటి సొంతం . నిజానికి రిఫైన్డ్ ఆయిల్స్ పోలిస్తే గానుగ నూనెల ధర కాస్త ఎక్కువే లెక్కచేయడం లేదు . స్వచ్ఛమైన నూనెల కోసం కోల్డ్ ప్రెస్ట్ మెషీన్ల చుట్టూ తిరుగుతున్నారు కొందరు నూనె గింజల్ని కొని పట్టించుకుంటు న్నారు . ఇంకొందరు ఆన్లైన్లో మెషీన్లు తెప్పించ ఇళ్లలోనే నూనె తయారు చేసుకుంటున్నారు . మరికొందరు .

***ఎందుకీ ప్రాధాన్యం …
కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఆరోగ్యకరమైన కొవ్వులూ , ప్రొటీన్లూ పుష్కలంగా ఉంటాయి . విటమిన్ – ఇ , ఒమెగా -3 , ఒమెగా -6 ఫ్యాటీ యాసిడ్లు , బయోఫ్లేవనాయిడ్ల వంటివన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే . ఈ నూనెలు గుండె , మెదడు ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయని అధ్యయనాలెన్నో చెబుతున్నాయి . జుట్టూ , చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయని పోషకాహార నిపుణులు అంటున్నారు . అయితే , ఈ పోషకాలన్నీ శరీరానికి అందాలంటే మాత్రం వాటిని ఎక్కువగా వేడి చెయ్యకూడదు . అలా చేస్తే విషతుల్యంగా మారే ప్రమాదమూ ఉంది . ముఖ్యంగా వేపుళ్లకు గానుగ నూనెలను వాడకపోవడమే మంచిది . ఈ ఆయిల్స్ని ఎండ తగలని ప్రదేశంలో , ముదురు రంగు గాజు సీసాల్లో మాత్రమే భద్రపరచాలి . ఫ్రిజ్లో అయితే మూడు నెలల వరకు నిల్వ చేసి వాడుకోవచ్చు . ఏది ఏమైనా ఆరోగ్య పరిరక్షణకు ఈ నూనెల వాడకాన్ని స్వాగతించాల్సిందే .