బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న నటీమణుల్లో పరిణితీ చోప్రా ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలతో పాటు టీవీ షోకి జడ్జిగా వ్యవహరిస్తూ బిజీగా ఉంది. అయితే ఈ భామ ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు సూరజ్ బర్జాత్యా దర్శకత్వంలో.. ‘ఉంచయ్’ అనే మూవీలో నటిస్తోంది. ఆయన ఫిబ్రవరి 22న 58 పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పరిణితీ ఆ డైరెక్టర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది.పరిణీతి మాట్లాడుతూ.. ‘నేను ఇప్పటివరకు కలిసిన అత్యంత సున్నితమైన, అద్భుతమైన వ్యక్తుల్లో సూరజ్ సర్ ఒకరు. ఆయన ఎంతో తెలివైన, సృజనాత్మకమైన డైరెక్టర్. నాలాగా దర్శకులు చెప్పినట్లు చేసే నటులైతే ఆయన నుంచి చాలా నేర్చుకోవచ్చు. వారి నైపుణ్యానికి పదును పెట్టుకోవచ్చు.‘ఉంచై’ సెట్స్‌లో సూరజ్ జీతో కలిసి పని చేస్తుంటే మళ్లీ నాకు పాఠశాలకు వెళుతున్నట్లు అనిపించింది. ఎందుకంటే ఒకే సమయంలో చాలా నేర్చుకుంటున్నట్లు, అప్పుడే ఏం నేర్చుకోవట్లేదని ఫీల్ అయ్యాను. కానీ షూటింగ్ మరుసటి రోజు మాత్రం నాకు సృజనాత్మకంగా సంతృప్తిగా అనిపిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చింది.‘సినిమాల ద్వారా ప్రేక్షకులకి ఆనందాన్ని పంచిన సూరజ్ సర్ ఎంతో సంతోషంగా పుట్టిన రోజు జరుపుకోవాలని కోరుకుంటున్నా. తరతరాలుగా మన భారతీయ సంస్కృతిలో పాతుకుపోయిన ఎన్నో విలువలను ఆయన అందరికీ తెలియజేశారు. ఆయనలాంటి వ్యక్తి ఉండడం హిందీ సినిమా అదృష్టం’ అని తెలిపింది.