NRI-NRT

అమెరికా నుండి హైదరాబాద్ కు గంజాయి దిగుమతి

అమెరికా నుండి హైదరాబాద్ కు గంజాయి దిగుమతి

*అమెరికా టు హైదరాబాద్ డార్క్నెట్లో ఆర్డర్.. ఇద్దరి అరెస్ట్
అమెరికా నుంచి హైదరాబాద్కు అత్యంత నాణ్యమైన గంజాయి దిగుమతి జరుగుతున్న వ్యవహారం తాజాగా బయటకు వచ్చింది. పరుపు పార్శిల్లోని 1.42 కిలోల గంజాయిని నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) హైదరాబాద్ విభాగం సోమవారం సీజ్ చేసింది. ఈ గంజాయిని ఆర్డర్ చేసిన ఇద్దరిని అరెస్ట్ చేసింది. డార్క్నెట్ ద్వారా హైగ్రేడ్ గంజాయిని హైదరాబాద్కు చెందిన ఇద్దరు యువకులు ఇటీవల ఆర్డర్ చేశారు. పక్కా సమాచారంతో సోదాలు చేసిన ఎన్సీబీ అధికారులు.. పరుపు పార్శిల్లోని కవర్లలో హైగ్రేడ్ గంజాయి ఉన్నట్లు గుర్తించారు. డెలివరీ అడ్రస్ ద్వారా ఇద్దరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. డార్క్ నెట్ ద్వారా గంజాయిని ఆర్డర్ చేసి.. అధిక ధరకు విక్రయించినట్లు వారు అంగీకరించారని ఎన్ఐఏ తెలిపింది.