Movies

సుధీర్‌ మిశ్రా డైరెక్షన్‌లో తాప్సీ..

సుధీర్‌ మిశ్రా డైరెక్షన్‌లో తాప్సీ..

హిందీలో చేతినిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్న తారల జాబితాలో తాప్సీ కచ్చితంగా ఉంటారు. ఇప్పటికే ఈ బ్యూటీ డైరీ దాదాపు నాలుగైదు సినిమాల కాల్షీట్స్‌తో నిండిపోయింది. ఈ కాల్షీట్స్‌ను కాస్త సర్దుబాటు చేసి ఓ ఆంథాలజీకి తాప్సీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.తాప్సీతో ‘ముల్క్‌’, ‘థప్పడ్‌’ చిత్రాలకు దర్శకత్వం వహించిన అనుభవ్‌ సిన్హా ఈ ఆంథాలజీకి ఓ నిర్మాత. హిందీలో ‘ధారావి, చమేలి, సీరియన్‌ మ్యాన్‌’ వంటి సినిమాలు తెరకెక్కించిన సుధీర్‌ మిశ్రా దర్శకుడు. కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్‌ వంటి అంశాల నేపథ్యంలో ఈ ఆంథాలజీ రూపుదిద్దుకోనుంది.