Business

సోమవారం నుంచి తాజా గోల్డ్‌ బాండ్లు – TNI వాణిజ్యం

సోమవారం నుంచి తాజా గోల్డ్‌ బాండ్లు – TNI  వాణిజ్యం

* తేలని వివాదం.. బిగ్‌బజార్‌ని స్వాధీనం చేసుకోనున్న రిలయన్స్‌
దేశంలోనే అతి పెద్ద వివాస్పద డీల్స్‌లో ఒకటిగా నిలిచింది ఫ్యూచర్‌ గ్రూప్‌ అమ్మకం. ఫ్యూచర్‌ గ్రూపులో అమెజాన్‌ పెట్టుబడులు ఉండగా.. దాన్ని రిలయన్స్‌ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించింది. ఈ నిర్ణయం వివాస్పదం కావడంతో ఢిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టు, సింగపూర్‌ ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌లలో ఈ కేసుపై విచారణ కొనసాగుతున్నాయి.రిలయన్స్‌ సంస్థ 2.3 బిలియన్‌ డాలర్లకు ఫ్యూచర్‌ కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. అమెజాన్‌ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ డీల్‌ మధ్యలో ఆగిపోయింది. ఈ వివాదం తలెత్తె సమయానికి దేశవ్యాప్తంగా ఫ్యూచర్‌ గ్రూప్‌కి 1700 అవుట్‌లెట్స్‌ ఉన్నాయి. సుదీర్ఘ విచారణ జరిగినా కేసు ఓ కొలిక్కి రాలేదు.ఇంతలో ఫ్యూచర్‌ గ్రూప్‌ ఆధీనంలో ఉన్న అవుట్‌లెట్స్‌ లీజు అగ్రిమెంట్లు ముగుస్తున్నాయి. తమకు లీజు బకాయిలు చెల్లించాలంటూ భవనాల యజమానుల నుంచి ఒత్తిడి వస్తోంది. అంతేకాదు రెండేళ్లుగా ఫ్యూచర్‌ ఆధీనంలో ఉన్న బిగ్‌బజార్‌ తదితర అవుట్‌లెట్ల వ్యాపారం మందగించింది. ఉద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. కోర్టులో వివాదం నడుస్తున్నప్పటికీ ఫ్యూచర్‌ ఆధీనంలోని 1700 అవుట్‌లెట్లలో ఓ 200 అవుట్‌లెట్లను రిలయన్స్‌ స్వాధీనం చేసుకునే ఆలోచనలో ఉంది. వాటిని పాత పేరుతో లేదా రిలయన్స్‌ బ్రాండ్‌ కిందకు తీసుకువచ్చి వ్యాపారం పునరుద్ధరించే లక్ష్యంతో ఉంది. ఇప్పటికే ఎంపిక చేసిన రిటైల్‌ అవుట్‌లెట్లలో పని చేస్తున్న ఉద్యోగులకు సమాచారం అందించారు.
* సావరిన్‌ గోల్డ్‌ బాండ్ల స్కీమ్‌ సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. ఐదు రోజుల పాటు (ఫిబ్రవరి 28 నుంచి మార్చి 4వ తేదీ) అమల్లో ఉండే ఈ బాండ్‌ స్కీమ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) సిరీస్‌లో పదవది. గ్రాము ధర రూ.5,109 అని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) శుక్రవారం జారీ చేసిన ప్రకటన పేర్కొంది. ఆన్‌లైన్‌లో కొనుగోలుకు గ్రాముకు రూ.50 డిస్కౌంట్‌ లభిస్తుంది. అంటే ఈ సందర్భంలో గ్రాము ధర రూ.5,059గా ఉంటుందన్నమాట. జనవరి 10 నుంచి 14వ తేదీ వరకూ అమలయిన తొమ్మిదివ సిరీస్‌ జారీ ధర గ్రాముకు రూ.4,786 కావడం గమనార్హం.
*దేశీయంగా ఎలకా్ట్రనిక్ చిప్, డిస్ప్లే తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు పలు కంపెనీలు రెడీ అవుతున్నాయి. సుమారు రూ.1,53,750 కోట్ల (2,050 కోట్ల డాలర్లు) పెట్టుబడితో ఈ ప్లాంట్లను నెలకొల్పేందుకు ఐదు కంపెనీలు ముందుకు వచ్చినట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. వేదాంత ఫాక్స్కాన్ భాగస్వామ్య సంస్థ, ఐజీఎ్సఎస్ వెంచర్స్, ఐఎ్సఎంసీ 130.6 కోట్ల డాలర్ల (రూ.1.02 లక్షల కోట్లు) పెట్టుబడితో ఎలకా్ట్రనిక్ చిప్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాయని తెలిపింది. అంతేకాకుండా రూ.76,000 కోట్లతో కూడిన సెమీకాన్ ఇండియా కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు రూ.42,000 కోట్ల మేర పెట్టుబడుల మద్దతును ఈ కంపెనీలు కోరుతున్నాయని పేర్కొంది
*ఆర్థికంగా దివాలా తీసిన ల్యాంకో గ్రూప్నకు ఉత్తరప్రదేశ్లోని అన్పరలో ఉన్న 1,200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ను కొనుగోలు చేసేందుకు మూడు కంపెనీలు బిడ్లు సమర్పించాయి. ఈ జాబితా లో హైదరాబాద్కు చెందిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్), ఐల్యాబ్స్ గ్రూప్తో పాటు ఢిల్లీకి చెందిన హిందుస్తాన్ పవర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (హెచ్పీపీఎల్) ఉన్నాయి.
*ఈ ఏడాది ఆగస్టు 15 నాటికల్లా దేశంలో 5జీ టెలికాం సేవలు ప్రారంభించాలని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) ఆసక్తితో ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని స్పెక్ట్రమ్ వేలానికి సంబందించిన విధి విధానాలపై ట్రాయ్ తన సిపారసులు వెంటనే పంపాలని ప్రభుత్వం కోరింది. 5జీ సేవల కోసం వేలం వేయాల్సిన స్పెక్ట్రమ్ బ్యాండ్, ధర వంటి విషయాలపై వచ్చే నెలాఖరులోగా ట్రాయ్ సిఫారసులు అందజేయాలని టెలికాం శాఖ (డాట్) కోరింది. ట్రాయ్ నుంచి సిఫారసులు అందితే మే లేదా జూన్ కల్లా 5జీ స్పెక్ట్రమ్ వేలం పూర్తి చేయాలని డాట్ భావిస్తోంది.
*ఎన్ఎస్ఈ కో-లొకేషన్ కేసులో దర్యాప్తును సీబీఐ మరింత విస్తృతం చేసింది. ఈ కేసులో ఎన్ఎ్సఈ మాజీ గ్రూప్ ఆపరేటింగ్ అధికారి (జీఓఓ) ఆనంద్ సుబ్రమణియన్ను చెన్నైలో అరెస్టు చేసింది. మాజీ సీఈఓ చిత్ర రామకృష్ణ కీలక నిర్ణయాలు తీసుకోవడంలో కీలక పాత్ర పోషించిన గుర్తు తెలియని యోగి.. సుబ్రమణియన్ అన్న వార్తల నేపథ్యంలో సీబీఐ ఆయన్ను అరెస్టు చేయడం విశేషం. గత కొద్ది రోజుల్లో సీబీఐ అధికారులు.. ఆనంద్ను పలు మార్లు ప్రశ్నించారు. సరైన సమాధానాలు రాకపోవడంతో ఆయన్ని అరెస్టు చేసి ప్రశ్నించాలని సీబీఐ నిర్ణయించింది. ఈ కేసులో సీబీఐ ఇప్పటికే ఎన్ఎన్సీ మాజీ సీఈఓ చిత్ర రామకృష్ణ, మరో మాజీ సీఈఓ రవి నారాయణ్, ఇంకా పలువురు అధికారులను ప్రశ్నించింది
*జపాన్ బెంచ్మార్క్ నిక్కీ 225 మధ్యాహ్నం ట్రేడింగ్లో 1.9 శాతం పెరిగి, 26,450.84 కు చేరుకుంది. ఉక్రెయిన్పై దాడి చేసిన నేపధ్యంలో… రష్యాపై ప్రభుత్వాలు ఆంక్షలు విధించడంతో… ట్రేడింగ్ డే ముగిసే సమయానికి యూఎస్ స్టాక్లు కోలుకున్న తర్వాత… ఈ రోజు(ఫిబ్రవరి 25, శుక్రవారం) ఆసియా షేర్లు అధిక స్థాయిలో పెరిగాయి.
*నాగార్జునా ఆయిల్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ కోస్టల్ అయిల్ అండ్ గ్యాస్ ఇన్ఫ్రా లిమిటెడ్ను (సీఓజీఐఎల్) హల్దియా పెట్రోకెమికల్స్ లిక్విడేషన్ ప్రక్రియలో చేజిక్కించుకుంది. ఛటర్జీ గ్రూప్ (టీసీజీ) అనుబంధ సంస్థ హెచ్పీఎల్ సమర్పించిన లిక్విడేషన్ ప్లాన్ను ఎన్సీఎల్టీ అమరావతి బెంచి గత వారంలో ఆమోదించింది. కొనుగోలు కోసం రూ.37.5 కోట్లు చెల్లించేందుకు హెచ్పీఎల్ అంగీకరించింది. గత రెండేళ్ల కాలంలో దివాలా ప్రక్రియలో టీసీజీ గ్రూప్ చేజిక్కించుకున్న మూడో కంపెనీ ఇది. విశాఖపట్నంలో రిజిస్టర్ అయిన సీఓజీఐఎల్కు తమిళనాడులోని కడలూర్లో 322 ఎకరాల భూమి ఉంది. అది ఈ లిక్విడేషన్ ప్రక్రియలో హెచ్పీఎల్ చేతికి మారుతుంది.
*టాటా మోటార్స్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహన (ఎస్యూవీ) మోడళ్లలో కజిరంగా ఎడిషన్లను విడుదల చేసింది. ఈ ప్రత్యేక ఎడిషన్ల ధర శ్రేణి రూ.8.58 లక్షల నుంచి రూ.20.99 లక్షల స్థాయిలో ఉంది. ఈ విభాగంలో సఫారీ, హారియర్, నెక్సాన్, పంచ్ మోడళ్లను టాటా కంపెనీ విక్రయిస్తోంది. టాటా పంచ్ కజిరంగా ఎడిషన్ ధర రూ.8.58 లక్షలు. కాగా, టాటా నెక్సాన్ రూ.11.78 లక్షలు, టాటా హారియర్ రూ.20.4 లక్షలు, టాటా సఫారీ రూ.20.99 లక్షలకు లభించనున్నాయి. కజిరంగా ఎడిషన్లు ఆయా ఎస్యూవీ మోడళ్ల టాప్ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయని, బుధవారం నుంచే వీటి బుకింగ్ సౌకర్యాన్ని ప్రారంభిస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. అసోంలోని కజిరంగా జాతీయ పార్క్ ఒకే కొమ్ము కలిగిన ఖడ్గమృగాలకు ప్రసిద్ధి. అత్యంత చురుకైన, శక్తిమంతమైన ఈ ఖడ్గమృగాల్లాగా కజిరంగా ఎడిషన్ ఎస్యూవీలు ఏ రోడ్లపైనైనా దూసుకెళ్లగలవని టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహన విభాగ వైస్ ప్రెసిడెంట్ రాజన్ అంబా అన్నారు.