Politics

సొంత పార్టీ నేత వసూళ్ల దందాను బయటపెట్టిన వైకాపా ఎమ్మెల్యే! – TNI రాజకీయ వార్తలు

సొంత పార్టీ నేత వసూళ్ల దందాను బయటపెట్టిన వైకాపా ఎమ్మెల్యే! – TNI రాజకీయ వార్తలు

* నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి.. విడవలూరు మండలంలో ఓ వైకాపా నేత వసూళ్ల దందాను స్వయంగా బయటపెట్టారు. ప్రభుత్వ భూములకు పట్టాలిప్పిస్తానంటూ తన పేరు చెప్పి.. డబ్బులు వసూళ్లు చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. సదరు వ్యక్తిని ప్రభుత్వ కార్యాలయాల గడప తొక్కనీయొద్దని..అధికారులకు ఎమ్మెల్యే స్పష్టం చేశారు.సొంత పార్టీ నేత వసూళ్ల దందాను బయటపెట్టిన వైకాపా ఎమ్మెల్యే !నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలో ఓ వైకాపా నేత వసూళ్ల దందాను.. స్వయంగా ఆ పార్టీ ఎమ్మెల్యే బయటపెట్టారు. పొన్నపూడి గ్రామంలో వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి.. స్థానిక వైకాపా నేత తీరుపై (పేరు వెల్లడించలేదు) ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పేరు చెప్పి.. డబ్బులు వసూళ్లు చేయమేంటని ధ్వజమెత్తారు.సదరు వ్యక్తిని ప్రభుత్వ కార్యాలయాల గడప తొక్కనీయొద్దని.. అధికారులకు స్పష్టం చేశారు. ఇకనైనా ఆ వ్యక్తి తీరు మార్చుకోకపోతే.. పార్టీ నుంచి బహిష్కరిస్తామని ప్రసన్నకుమార్‌రెడ్డి హెచ్చరించారు.భూములకు పట్టాలంటూ నా పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నారు. విడవలూరు మండలంలో వసూళ్లు సాగుతున్నాయి. ప్రతిపక్ష నాయకులు, రైతుల వద్ద రూ.లక్షలు వసూలు చేశారు. చాలాసార్లు మందలించినా తీరు మార్చుకోలేదు. నాకు, పార్టీకి చెడ్డపేరు తెస్తే క్షమించను. తీరు మార్చుకోకుంటే పార్టీ నుంచి బహిష్కరిస్తాం.

* దళితులంతా ప్రభుత్వంపై తిరగబడాలి: ఎమ్మెల్యే భవానీ
రాష్ట్రంలోని దళితులంతా ప్రభుత్వంపై తిరగబడాలని టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ పిలపునిచ్చారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ జగన్ దళితుల ద్రోహిగా మారారన్నారు. దళితులపై దాడులుత్యాచారాలు జరుగుతున్నా జగన్ స్పందించటం లేదని ఆమె ఆరోపించారు. వచ్చే ఎన్నికలలో దళితుల ద్రోహి జగన్‌ను ఓడించాలని ఆమె అన్నారు.

* తండాలను గ్రామ పంచాయితీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్ దే: ఎర్రబెల్లి తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి ప్రజల వద్దకు పాలనను చేర్చిన ఏకైక ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని పంచాయతీరాజ్, గ్రామీణ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.శనివారం మధ్యాహ్నం తొర్రూరు డివిజన్ కేంద్రంలోని బంజారా నగర్ దుబ్బ తండాలో 5వార్డ్ కౌన్సిలర్ సునీత జెసింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 283 జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న తర్వాత పండుగలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని, 3వేల తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసుకున్నామని, ప్రతి సంవత్సరానికి 5 లక్షల చొప్పున తండాల అభివృద్ధికి కేటాయించడం జరుగుతుందని, బంజారాల అభివృద్ధి కొరకు ప్రత్యేక నిధులు భూ కేటాయింపు చేయడం జరిగిందని రానున్న రోజుల్లో గుడి నిర్మాణం చేసుకోవాలని సంబంధించిన నిధులు మంజూరు చేస్తానని మంత్రి తెలిపారు

* భీమ్లానాయక్‌పై ప్రభుత్వ తీరు ఆశ్చర్యాన్ని కలిగించింది: నాదెండ్ల మనోహార్ భీమ్లానాయక్ సినిమా విడుదల సందర్బంగా ఏపీ ప్రభుత్వ తీరుపై జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహార్ తీవ్రవిమర్శలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినిమా విడుదల సమయంలో ఏపీ ప్రభుత్వ తీరు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. పవన్ కల్యాణ్ సినిమా విడుదలైన థియేటర్లలో ప్రభుత్వ సిబ్బందిని నియమించడం బాధాకరమన్నారు. సినిమాకు వచ్చేవారిని భయబ్రాంతులకు గురిచేసేందుకు ఉద్యోగులను థియేటర్ల వద్ద ఉంచారని మండిపడ్డారు. సీఎం జగన్మోహాన్‌రెడ్డి ఇలాంటి పరిపాలన అందిస్తారని ఎవరూ ఊహించలేదన్నారు. ఆత్మాభిమానంకు, అహాంకారానికి జరిగిన పోరాటామే భీమ్లానాయక్ సినిమా ఇతివృత్తమన్నారు.చివరకు ఆత్మాభిమానమే విజయం సాధిస్తోందన్నారు. సీఎం జగన్మోహాన్‌రెడ్డి కేవలం అహాంకారంతోనే ఇలా వ్యవహారించారని దుయ్యబట్టారు. కర్ప్యూలాంటి వాతావరణం తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కిందన్నారు. కక్ష పూరితంగా, చిన్నమనస్తత్వంతో సామాన్యూలను ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. తన ఆలోచన మేరకే పనిచేయాలని నియంతలా సీఎం జగన్ వ్యవహారిస్తున్నారని నాదెండ్ల మనోహార్ ఆగ్రహం వ్యక్తం చేశారు

* జగన్ పాలనలో దళితులపై పెరిగిన దాడులు: ఎంఎస్ రాజు
జగన్ పాలనలో దళితులపై దాడులు పెరిగాయని ఏపీ ఏస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు అన్నారు. శనివారం రాజమండ్రిలో జరిగిన దళిత ప్రతిఘటన సదస్సు లో ఆయన పాల్గొని మాట్లాడారు. బాధితులపైనే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారన్నారు. పులివెందులలో జగన్ ఇంటికి సమీపంలోనే దళిత మహిళపై అత్యాచారం జరిగినా పోలీసులు పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో దళితులకు 20 లక్షల ఎకరాల భూములను పంపిణీ చేస్తే ముఖ్యమంత్రి జగన్ దళితులకు చెందిన 11 వేల ఎకరాల భూములను లాక్కున్నారని మండిపడ్డారు.ఎన్నికల్లో ప్యానుకు ఓటివేసిన వాళ్లు అదే ప్యానుకు ఉరివేసుకుంటున్నారన్నారు. ఎస్సీ నిదులు దారిమళ్లుతున్న మంత్రి విశ్వరూప్ మాట్లాడకపోవటం దుర్మార్గమని చెప్పారు. రాజమండ్రిలో దళిత మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగితే ప్రశ్నించలేని స్థితిలో మంత్రి తానేటి వనిత ఉన్నారని మండిపడ్డారు.40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును కన్నీరుపెట్టించిన వారిని లోకేశ్ రక్తకన్నీరు పెట్టిస్తారని ఎంఎస్ రాజు చెప్పారు.

* దళిత సమస్యలపై నిరంతర పోరాటం: హర్షకుమార్ దళిత సమస్యలపై నిరంతర పోరాటం చేస్తున్నామని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తుని రైల్ కేసులు ఎత్తేయాలని ప్రభుత్వంపై పోరాడితే ఆ కేసులు తొలగించారన్నారు. అలాగే దళిత యువత పైన ఉన్న కేసులను ఎందుకు ఎత్తేయడం లేదని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రపతి చెప్పిన తర్వాత కూడా శిరోముండనం కేస్ పైన ఎందుకు చర్య తీసుకోవడం లేదని సీఎం జగన్‌ని హర్షకుమార్ ప్రశ్నించారు. తనను 48 రోజులు జైల్‌లో పెట్టారన్నారు. అంబేద్కర్ విదేశీ విద్య టీడీపీ ప్రభుత్వంలో అమలయిందన్నారు. ఉక్రెయిన్‌లో ఉన్న పిల్లలకు విదేశీ విద్యకు ఇచ్చే ఫీజులు ఇవ్వకపోతే వారికి సర్టిఫికెట్ ఇవ్వరన్నారు. సర్టిఫికెట్లు లేకుండా ఏపీ విద్యార్థులు ఇక్కడకు రాలేరన్నారు. ఉక్రెయిన్‌‌లో జరుగుతున్న యుద్ధంలో అక్కడ చదువుతున్న ఏపీ విద్యార్థులు చనిపోతే జగన్ సమాధానం చెప్పాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు

* ఉపాధి నిధులను వైసీపీ ఎమ్మెల్యేలు దోచుకున్నారు: అమర్నాథ్‌రెడ్డి జగనన్న కాలనీల పేరుతో రూ.7 వేలకోట్ల ఉపాధిహామీ నిధులను వైసీపీ ఎమ్మెల్యేలు దోచుకున్నారని టీడీపీ నేత అమర్నాథ్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా ఇంకా టీడీపీపైనే బురదజల్లితే ఎలా పెద్దిరెడ్డి? అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఉపాధి హామీ పనుల్లో అవినీతి జరిగితే అధికారంలో ఉన్న మీరెందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని నిలదీశారు. తన అసమర్థత, వైసీపీ ప్రభుత్వ అవినీతిని కప్పిపుచ్చడానికే మంత్రి పెద్దిరెడ్డి టీడీపీ అవినీతి చేసిందంటున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వ ఉపాధి హామీ పనుల్లో అవినీతి జరగకపోతే తక్షణమే రిటైర్డ్ జడ్జితో సీఎం జగన్‌రెడ్డి విచారణకు ఆదేశించాలని అమర్నాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు

* ప్రతీ అంశాన్ని రాజకీయం చేయడం లోకేష్‌కు అలవాటు: ఏపీ మంత్రి పేర్ని నాని
ఇటీవల విడుదలైన సినిమా సహా ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారంటూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్‌పై ఏపీ సమచార, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. థియేటర్లలో సినిమా టిక్కెట్ల ధరలను నిర్ణయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో 35ను విడుదల చేసిందని, ఏరియా, ఏసీ, నాన్ ఏసీ, మల్టీప్లెక్స్ తదితరాల ఆధారంగా ధరలను నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.

* రాష్ట్రంలో మరిన్ని రాజకీయ హత్యలు జరగొచ్చు: సీపీఐ నేత నారాయణ
రాష్ట్రంలో మరిన్ని రాజకీయ హత్యలు జరగొచ్చని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. వివేకా హత్యకేసు దర్యాప్తు చేస్తున్న… సీబీఐ అధికారుల మీదే రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెడుతోందని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వ నిర్వాకంతో… సినిమాలు కూడా భయంభయంగా చూడాల్సి వస్తోందని నారాయణ అన్నారు. రాష్ట్రంలో మరిన్ని రాజకీయ హత్యలు జరిగే అవకాశం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. వివేకా హత్యకేసు దర్యాప్తు చేస్తున్న… సీబీఐ అధికారుల మీదే రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెడుతోందని ఆరోపించారు. తమ సినిమాలకు రాయితీ, ఇతరత్రా స్వార్థం కోసమే చిరంజీవి సీఎం జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్లి కాళ్లు, చేతులు పట్టుకున్నారని అన్నారు. అగ్ర కథానాయకుడైన చిరంజీవి.. సినిమా టికెట్ల గొడవపై ప్రభుత్వంతో మాట్లాడటానికి ఇతర సంఘాలను తీసుకెళ్లాలనే ఆలోచన చేయలేదన్నారు.

* సాధించాలనే తపన తగ్గలేదు: చంద్రబాబు
పని చేయాలి.. సాధించాలనే తపన నాలో ఇంకా తగ్గలేదన్నారు చంద్రబాబు. తన 44 ఏళ్ల రాజకీయ జీవితంలోని గత స్మృతులను.. పార్టీ నేతల సమక్షంలో గుర్తు చేసుకున్నారు. ఒక సందర్బంలో రాజకీయాలు మానేసి.. వ్యాపారం వైపు వెళ్లాలనుకున్నానని.. కానీ అప్పటి పరిస్థితుల ప్రభావంతో రాజకీయాల్లోనే ఉండాల్సి వచ్చిందన్నారు. ఎన్టీఆర్‌, వాజ్‌పేయీ లాంటి మహా నేతలతో కలిసి పనిచేశానన్న బాబు.. వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు నా మాటకు ఎంతో విలువిచ్చేవారు… బాబు చెబితే అది కరెక్ట్‌ అనేవారు అని వెల్లడించారు.తెదేపా అధినేత చంద్రబాబునాయుడు గత స్మృతులను నెమరవేసుకున్నారు. 44 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 25న చంద్రబాబు తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అప్పట్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన చంద్రబాబు..తన ప్రత్యర్ధి కొంగర పట్టాభిరామ చౌదరిపై గెలుపొందారు. ప్రజాప్రతినిధిగా 44 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయనకు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయ జీవితంలో ముఖ్యమైన సందర్భం ఏది అని పార్టీ నేతలు చంద్రబాబును ప్రశ్నించగా..అలా అని ప్రత్యేకంగా ఏదీ చెప్పలేను. పని చేయాలి..సాధించాలనే తపన మాత్రం ఇప్పటికీ తగ్గలేదని ఆయన సమాధానమిచ్చారు. పలువురు నేతలు అధినేత ప్రస్థానంపై పాత విషయాలు గుర్తు చేయగా..తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంపై చంద్రబాబు మాట్లాడారు.‘నాడు విశ్వవిద్యాలయ విద్యార్థులుగా గ్రామాలకు వెళితే ఎంతో ఆదరణ ఉండేది. నేను యూనివర్సిటీ లీడర్‌గా ఎదిగి తర్వాత అసెంబ్లీకి పోటీ చేశా. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నాకు మంత్రి పదవి కావాలని అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డిని అడిగితే…ఏంటి ఇంత దూకుడుగా ఉన్నావ్‌.. తొలిసారి ఎమ్మెల్యేవి..అప్పుడే మంత్రి పదవి కావాలా అని ప్రశ్నించారు. ఆ తర్వాత అంజయ్య మంత్రివర్గంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా అవకాశం వచ్చింది. ఓ సందర్భంలో పూర్తిగా వ్యాపారం వైపు వెళ్లాలనే ఆలోచన కూడా చేశా. అయితే అప్పటి పరిస్థితుల కారణంగా రాజకీయాల్లోనే కొనసాగా. నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న సమయంలో ఎన్టీఆర్‌ని కలిశా. అప్పుడు ఆయన ఓ షూటింగ్‌లో వరుడు వేషంతో ఉన్నారు’ అని నేతలకు వివరించారు

* కేసీఆర్ హిందువు కాదా? ముస్లిం ఆ.. క్రిస్టియన్ ఆ..: Vijayashanthi
కేసీఆర్ ధర్మానికి విరుద్ధంగా వెళ్తున్నారని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. రాజన్న ఆలయానికి ఏటా ఇస్తానన్న వంద కోట్ల నిధుల హామీపై బీజేపీ చేపట్టిన దీక్షలో విజయశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేత మాట్లాడుతూ ఏటా రాజన్న ఆలయానికి వంద కోట్లు ఇస్తామని కేసీఆర్ మాట తప్పారని మండిపడ్డారు. కేసీఆర్ రాక్షసుడు.. దేవాలయం అభివృద్ధి కావడం ఇష్టం లేదన్నారు. వేములవాడ ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. సారు జర్మనీలో కూర్చున్నారని యెద్దేవా చేశారు. ‘‘కేసీఆర్ హిందువు కాదా? కేసీఆర్ ఏమైనా ముస్లిం ఆ క్రిస్టియన్ ఆ…. హిందుగాళ్ళు బొందుగాళ్ళు అనడానికి నీకు నోరెలా వచ్చింది’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రజలతో పాటే దేవుళ్ళనూ మోసం చేస్తున్నారన్నారు. శివుడు మూడో కన్ను తెరుస్తారని.. కేసీఆర్‌ను భస్మం చేస్తాడని విజయశాంతి వ్యాఖ్యలు చేశారు

* స్వార్థం కోసమే చిరంజీవి ఏపీ సీఎం జగన్‌ను కలిశారు : సీపీఐ కార్యదర్శి
మెగాస్టార్‌ చిరంజీవి తన స్వార్థం కోసమే ఏపీ సీఎం జగన్‌ను కలిసి సినిమా రాయితీలు మాట్లాడుకున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని, సినిమాలను భయంగా వీక్షించవలసి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమపై ఆదారపడ్డ వారందరినీ తన తోవలోకి తీసుకొచ్చేందుకు లేని సమస్యలను సృష్టిస్తుందని ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు

*స్వయానా జగన్ కుటుంబం నుంచి ఇలాంటి హత్యా సంస్కృతా?: నారాయణ
వివేకా హత్యలో వాస్తవాలు బయటికి వచ్చాయని సీపీఐ నారాయణ పేర్కొన్నారు. స్వయానా సీఎం జగన్ కుటుంబం నుంచి ఇలాంటి హత్య సంస్కృతి వచ్చిందా? అని నివ్వెరబోయారు. వివేకా హత్యపై జగన్ ఫ్యామిలీ నైతిక బాధ్యత వహించాలన్నారు. బిగ్‌బాస్‌కు వ్యతిరేకంగా డిజిటల్ ప్రచారం చేస్తున్నామని నారాయణ వెల్లడించారు. బిగ్‌బాస్ హౌస్ బ్రోతల్ హౌస్‌గా మారిందని మరోసారి వ్యాఖ్యానించారు. లైసెన్స్ పొందిన వ్యభిచార గృహం నిర్వహించడానికి షో నిర్వహిస్తున్నారంటూ సీపీఐ నారాయణ విమర్శించారు

*పనికి రాని మంత్రి పేర్నినాని: గాదె వెంకటేశ్వరరావు
జనసేన పార్టీ, కార్యకర్తలు చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు చేయలేదని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరావు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… పనికి రాని మంత్రి పేర్నినాని అని వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీపై ఆధారరహితమైన వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. వైసీపీ నేతలే ‘‘భీమ్లా నాయక్’’ సినిమా టిక్కెట్లు బ్లాక్‌లో అమ్ముకున్నారని ఆరోపించారు. ‘‘పేర్ని నానికి సిగ్గుందా… ప్రభుత్వం ‘‘భ్లీమా నాయక్’’ సినిమాపై సర్క్యూలర్ విడుదల చేయడం సిగ్గు చేటు… యూరియా ఇవ్వలేరు. ధాన్యం కొనుగోలు చేయరు. రైతుల సమస్యలు పరిష్కరించరు… కానీ ‘‘భీమ్లా నాయక్’’ టికెట్స్ అమ్మకాలను మాత్రం కంట్రోలు చేస్తారు’’ అంటూ గాదె వెంటకేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు

*పోలవరం ప్రాజక్టును ఎప్పుడు పూర్తి చేస్తారు?: Sailajath
రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజక్ట్‌ను ఎప్పుడు పూర్తి చేస్తారని ఏపీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ ప్రశ్నించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు పార్లమెంటులో ఇచ్చిన హామీలలో ఒక్కదాన్ని కూడా మోదీ ప్రభుత్వం సక్రమంగా అమలు చేయలేదని మండిపడ్డారు. ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం, కడప ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ రైల్వే జోన్, దుగ్గరాజపట్నం పోర్టు, అంశాలలో మాట తప్పారన్నారు. కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్, వైజాగ్–చెన్నై పారిశ్రామిక కారిడార్, 2014–15 ఆర్థిక సంవత్సరపు నిధుల లోటు భర్తీ, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజి ఇలా ఏ ఒక్క హామీ పూర్తిగా అమలు చేయలేదని ఆయన విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే 90 శాతం నిధులు అంటే దాదాపు రూ.50 వేల కోట్లను కేంద్రమే భరించాలన్నారు. కనీసం సాధారణ రాష్ట్రాలకు ఇచ్చే విధంగానూ ఇవ్వకుండా, ప్రత్యేక హోదా రాష్ట్రాలకు ఇచ్చే విధంగానూ ఇవ్వలేదని మండిపడ్డారు. చట్టం ప్రకారం 100 శాతాన్ని తానే భరించాల్సిన పోలవరం ఖర్చులో కేవలం రూ.20,398 కోట్లు మాత్రమే భరిస్తామని ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వడం ఏమిటని నిలదీశారు. ఎప్పుడో 2018లో పూర్తి కావాల్సిన పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో తెలియదన్నారు. హోదా కోసం పోరాడలేక జగన్ రెడ్డి చతికలపడ్డారని శైలజానాథ్ వ్యాఖ్యలు చేశారు

*జగన్రెడ్డి బతుకంతా అబద్ధాల మయమే: అచ్చెన్న
జగన్రెడ్డి బతుకంతా అబద్ధాల మయమేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. జగన్రెడ్డి రెండున్నరేళ్ల పాలనలో బాధింపబడని వర్గమంటూ ఏదీ లేదన్నారని ఆరోపించారు. సింహాలుగా తమ చరిత్ర తాము చెప్పుకోకపోతే… గుంట నక్కలు చెప్పే కట్టుకథలే వాస్తవాలుగా చలామణి అవుతాయని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. టీడీపీ చేసిన సంక్షేమాన్ని కూడా జగన్రెడ్డి నిసిగ్గుగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. చిరుద్యోగుల జీతాలపై కూడా సీఎం స్థాయిలో అబద్ధాలు ఆడుతున్నారన్నారు. చివరికి ఉద్యోగుల పీఆర్సీ విషయంలోనూ బూకటపు కథనాలతో తప్పుదారి పట్టిస్తున్నారన్నారు.

* జగన్… హామీలను అమలు చేయి: రామకృష్ణ
ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న కమ్యూనిస్టు పార్టీలపై విమర్శలు మాని, ప్రజలకిచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హితవు పలికారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలను అమలుపరచకుండా సీఎం జగన్ మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది, ఆశావర్కర్లు, అంగన్వాడీలు, విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, వ్యవసాయ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు.

*అద్భుతంగా అమరుల స్మారక చిహ్నం: ప్రశాంత్రెడ్డి
హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ ఒడ్డున అమరుల త్యాగాలు ప్రతిబింబించే విధంగా అమరుల స్మారక చిహ్నం నిర్మాణం అవుతోందని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. ఈ నిర్మాణం అద్భుతమైన కట్టడంగా నిలుస్తుందన్నారు. అమరుల స్మారక చిహ్నం నిర్మాణ పనులను మంత్రి శుక్రవారం పరిశీలించారు. నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

*డిసెంబరునాటికి ఎక్స్ప్రెస్వే నిర్మాణం: గడ్కరీ
ఈ ఏడాది డిసెంబరునాటికి ఇండోర్-హైదరాబాద్ ఎక్స్ప్రెస్వే నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ ఎక్స్ప్రెస్వే నిర్మాణం మధ్య భారతదేశాన్ని దక్షిణాదితో కలుపుతుందని చెప్పారు. దాదాపు రూ.5,722 కోట్ల వ్యయంతో మాల్వా ప్రాంతంలో 11 రోడ్లకు శంకుస్థాపన చేసిన సందర్భంగా గడ్కరీ మాట్లాడారు.

*జల్ హై తో.. జీవన్ హై.. : ఉప రాష్ట్రపతి వెంకయ్య
జల్ హై తో జీవన్ హై (నీరు ఉంటేనే జీవనం ఉంటుంది) అని భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. రాజేంద్రనగర్లోని జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్(ఎన్ఐఆర్డీపీఆర్) సంస్థ ఆధ్వర్యంలో కేంద్ర జలశక్తి, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖలు, యూనిసెఫ్, ఇతర సంస్థల భాగస్వామ్యంతో మూడు రోజుల పాటు నిర్వహించనున్న వాటర్, శానిటైజేషన్ అండ్ హైజీన్(వాష్) కాన్క్లేవ్ – 2022ను వర్చువల్గా బుధవారం ప్రారంభించారు. పంచాయతీల స్థాయిలో స్వచ్ఛమైన తాగునీరు, పారిశుధ్యం, స్వచ్ఛత అంశంపై ఈ సదస్సులో చర్చించనున్నారు. ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, బాల్యం నుంచే చిన్నారుల్లో ఆరోగ్యకరమైన అలవాట్లు పెంపొందేలా అంగన్వాడీలు, ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు