DailyDose

వివేకా హత్య కేసులో ఎంపీ ఆవినాష్ హస్తం: స్పీకర్ కు వైఎస్ సునీత లేఖ

Auto Draft

లోక్‍సభ స్పీకర్ ఓంబిర్లాకు వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి లేఖ రాశారు. వివేకా హత్య కేసులో ఎంపీ ఆవినాష్ రెడ్డి హస్తం ఉందని లేఖలో పేర్కొన్నారు. అవినాష్ రెడ్డి పాత్రపై విచారణ జరిపించాలని స్పీకర్‍ను కోరారు. సీబీఐకి తానిచ్చిన వాంగ్మూలాన్ని లేఖలో జతపరిచారు. సీబీఐకి నిందితులిచ్చిన వాంగ్మూలాలను కూడా స్పీకర్‍కు అందజేశారు.

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద హత్య కేసులో ఎంపీ అవినాష్‌ రెడ్డికి ముప్పెట ఉచ్చు బిగిస్తుంది. ఇప్పటికే పలువురు హత్యకు సంబంధిన పాత్రదారులు, సూత్రదారుల వివరాలను సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. కాగా ఈరోజు వైఎస్‌ వివేకానంద కుమార్తె సునీతారెడ్డి కూడా తన తండ్రి హత్య వెనుక ఎంపీ అవినాష్‌రెడ్డి హస్తముందని అతడి పాత్రపై విచారణ జరిపించాలని లోక్‍సభ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాశారు. సీబీఐకి తానిచ్చిన వాంగ్మూలంతో పాటు, నిందితులిచ్చిన వాంగ్మూలాలను కూడా స్పీకర్‍కు ఆమె అందజేశారు.

కాగా ఈరోజు ఆమె సీబీఐకి ఇచ్చిన వాగ్ములంలో పేర్కొన్నా వివరాలను సునీతారెడ్డి బయటపెట్టారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వైఎస్‌ జగన్‌ వివేకా హత్యను రాజకీయ సానుభూతి కోసం వాడుకున్నారని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. మా నాన్నను ఎవరు చంపారో అందరికీ తెలుసని ఆమె అన్నారు.నాన్న హత్యపై భారతి, జగన్ చాలా తేలిగ్గా తీసుకున్నారని, ఈ హత్య విషయంలో జగనన్న వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని పేర్కొన్నారు. హత్య గురించి అనుమానితుల పేర్లను జగనన్నకు చెబితే ‘వాళ్లను ఎందుకు అనుమానిస్తున్నావు.. నీ భర్తే హత్య చేయించాడేమో’ అని అన్యాయంగా మాట్లాడారని వెల్లడించారు.కేసు సీబీఐకి అప్పగిస్తే అవినాష్‍కు ఏమీకాదు.. బీజేపీలో చేరతాడు. ఇప్పటికే మాపై 11 కేసులున్నాయి.. మీది 12వది అవుతుందని అన్నారని’ ఆమె వివరించారు.