*దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్టు హైదరాబాద్ కర్మన్ ఘాట్ దేవాలయం వద్ద భాజపా తలపెట్టిన ధర్నాకు అనుమతి లేకపోవడంతో నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆలయం వద్దకు చేరుకుంటున్న వారిని ఎక్కిడికక్కడ అడ్డుకున్నారు. కర్మన్ఘాట్ వైపు వెళ్తున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును ఎల్బీనగర్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ టీకేఆర్ కమాన్ వద్ద గోవుల అక్రమ తరలింపును అడ్డుకున్న కర్మన్ఘాట్ గోరక్షక సేవాసమితి సభ్యులపై తరలింపుదారులు దాడి చేయడాన్ని భాజపా నాయకులు తీవ్రంగా ఖండించారు. వారిపై దాడి చేయడమే కాకుండా.. అక్రమ కేసులు నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ నగరంలో ధర్నాకు దిగారు. హైదరాబాద్ కర్మన్ఘాట్ దేవాలయం వద్ద భాజపా తలపెట్టిన ధర్నాకు అనుమతి లేకపోవడం వల్ల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆలయం వద్దకు చేరుకుంటున్న వారిని ఎక్కడికక్కడ అరెస్టు చేెశారు. కర్మన్‌ఘాట్ వైపు వెళ్తున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును ఎల్బీ నగర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. హనుమాన్ ఆలయం వద్ద గోరక్షకులపై దాడి చేయడమే కాకుండా.. వారిపై అక్రమ కేసులు నమోదు చేయటాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. పోలీసులు చర్యలు చేపట్టారు
* మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు ఆఫీసులో చోరీ జరిగింది. దీనిపై మంచు విష్ణు, అతని మేనేజర్ సంజయ్ ఇద్దరూ వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిలింనగర్‌లో విష్ణు ఛాంబర్‌లో ఈ చోరీ జరిగినట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి విష్ణుకు సంబంధించిన హెయిర్ డ్రెస్సింగ్ ఎక్విప్‌మెంట్‌ను ఎవరో దొంగిలించారు.
* మహారాష్ట్ర రాజధాని ముంబైలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కంజూర్‌మార్గ్‌లోని ఎన్‌జీ రాయల్ పార్కు ఏరియాలోని ఓ 10 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. 9వ అంతస్తు నుంచి అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. మంటలను ఆర్పేందుకు 10 ఫైరింజన్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మిగతా అంతస్తుల్లో నివాసముంటున్న వారు భయంతో అపార్ట్‌మెంట్‌ను వదిలి బయటకు వస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
*భారీ డ్రగ్ రాకెట్ భగ్నం : రూ 56 కోట్ల విలువైన డ్రగ్స్ తో పట్టుబడిన విదేశీయుడు
జోహాన్స్‌బర్గ్ నుంచి ముంబైకి రూ 56 కోట్ల విలువైన 8 కిలోల హెరాయిన్‌ను తరలిస్తున్న దక్షిణాఫ్రికా జాతీయుడిని ముంబై ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడిని మీజ్ లిండోకులెగా గుర్తించారు. ఎయిర్‌పోర్ట్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడిని శనివారం కస్టమ్స్ విభాగం ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ సిబ్బంది అడ్డగించారు.జోహన్స్ బర్గ్ నుంచి కిగాలి మీదుగా రువాండా ఎయిర్ ఫ్లైట్ డబ్ల్యూబీ-500లో నిందితుడు ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. అతడి లగేజ్‌లో 8 కిలోల డ్రగ్స్‌ను అధికారులు గుర్తించారు. పరీక్షల్లో మత్తుపదార్ధం హెరాయిన్‌గా కనుగొన్నారు. రెండు ట్రాలీ బ్యాగులు, హాండ్ బ్యాగ్‌లో డ్రగ్స్ ను నిందితుడు తరలిస్తుండగా పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ రూ 56 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.జోహాన్స్ బర్గ్ నుంచి డ్రగ్స్ ను తరలించిన నిందితుడు వీటిని ముంబైలోని గుర్తుతెలియని వ్యక్తికి అప్పగించాల్సి ఉంది. ఇక మరో ఘటనలో డ్రగ్స్ కేసులో అరెస్టయి బెయిల్‌పై ఉన్న నైజీరియాకు చెందిన వ్యక్తి నవీ ముంబైలో రూ 22 లక్షల విలువైన డ్రగ్స్ ను తరలిస్తూ పట్టుబడ్డాడు. నిందితుడి నుంచి మత్తుపదార్ధాలను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశామని నవీ ముంబై పోలీస్ కమిషనర్ బిపిన్ కుమార్ సింగ్ చెప్పారు.
*మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈరోజు మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ మంటలను అదుపు చేసేందుకు 10 ఫైరింజన్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.. కంజూర్‌మార్గ్‌లోని ఎన్‌జీ రాయల్ పార్కు ఏరియాలోని ఓ 10 అంతస్తుల భవనంలో 9వ అంతస్తు నుంచి అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి.దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. మంటలను ఆర్పేందుకు 10 ఫైరింజన్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మిగతా అంతస్తుల్లో నివాసముంటున్న వారు భయంతో అపార్ట్‌మెంట్‌ను వదిలి బయటకు వస్తున్నారు. అయితే ఈ అగ్నిప్రమాదం ఎలా జరిగిందనేది తెలియరాలేదు.
*శ్రీకాళహస్తి పోలీస్ స్టేషన్‌లో ఓ మందుబాబు వీరంగం వేశాడు. పోలీసులనే హడలెత్తించాడు. శ్రీకాళహస్తి ఒకటవ పట్టణ పీఎస్‌లో ఈ సంఘటన జరిగింది. కుమారస్వామితిప్పా వీధికి చెందిన ప్రదీప్ రెడ్డి నిత్యం మద్యం తాగి అందరితో గొడవ పెట్టుకుంటున్నాడని స్థానికులు చెబుతున్నారు. అంకమ్మ ఆలయం పక్కనున్న ఓ వ్యాపారి తన నివాసం ముందు కారు నిలిపాడు. దారికి అడ్డంగా కారు ఎందుకు నిలిపావని వ్యాపారితో గొడవకు దిగాడు. బూతులు తిడుతూ కారు అద్దాలు ద్వంసం చేశాడు. దీంతో వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులను కూడా ప్రదీప్ రెడ్డి బూతులు తిట్టడంతో అందరూ ఆశ్చర్యపోయారు
*టంగుటూరు మండలంలో విషాదం చోటుచేసుకున్నది. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు శవాలై తేలారు. ఆదివారం నుంచి ఈ ముగ్గురు విద్యార్థులు కనిపించకుండా పోయారు. పొందూరు సమీపంలోని పొడవారిపాలెం వద్ద మూసీ వాగులో 12 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సున్న విద్యార్థుల మృతదేహాలను సోమవారం ఉదయం వెలికితీశారు.
* వ్యవసాయ సహకార బ్యాంకులో రూ.లక్షల మోసం కేసులో బ్యాంకు మహిళా కార్యదర్శిని పోలీసులు అరెస్టు చేశారు. తిరునెల్వేలి ఆజాద్ నగర్‌కు చెందిన అయిష్‌బాను (అనే మహిళ అంబాసముద్రం సమీపంలోని ఆలడియూరులోని వ్యవసాయ సహకార బ్యాంకులో కార్యదర్శిగా గత సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. అయితేఈ బ్యాంకు సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేసి బ్యాంకు ఖర్చులను భారీగా చూపించి రూ.లక్షల మేర స్వాహా చేశారు. ఈ విషయం ఆడిటింగ్‌లో తేలడంతో బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు బ్యాంకు కార్యదర్శిని పోలీసులు అరెస్టు చేశారు
* మెదక్ జిల్లాలోని తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి పోతరాజ్ పల్లిలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రెండు కార్లను పెట్రోల్ పోసి దహనం చేశారు. అడ్వకేట్ మూత్తిగళ్ల అశోక్, అతని తమ్ముడు ముత్తిగళ్ళ విజయేందర్ కార్లను అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో దుండగులు దగ్ధం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి దర్యాప్తు చేపట్టారు
* విజయవాడ నగర శివారు రామవర్పపాడు ఫ్లైఓవర్ సమీపంలో అద్దంకి మోహన్ కుమార్(చిన్న) అనే రౌడిషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఏఎస్‌నగర్‌కు చెందిన మోహన్ కుమార్ ఉడ్ పాలిష్ వర్క్ పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద రక్తపు మడుగులో మోహన్ కుమార్ మృతదేహం లభించింది. బ్లేడ్ బ్యాచ్‌తో కూడా రౌడీషీటర్‌కు సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. బ్లేడ్‌బ్యాచ్ సభ్యులు హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలిసిన వెంటనే గన్నవరం సీఐ శివాజీ సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
* పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం ప్రత్తిపాడులో దారుణం జరిగింది. గుడారంలో మంటలు చెలరేగి పల్లి రామకృష్ణ(అనే వృద్ధుడు సజీవదహనం అయ్యాడు. వృద్ధుడు అంగవైకల్యం వలన భిక్షాటన చేస్తూ వంతెన మెట్ల క్రింద గుడారం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నాడు. అంగవైకల్యం వల్ల మంటలు వ్యాపించినా కూడా బయటకు రాలేని పరిస్థితిలో వృద్ధుడు లోపలే ఉండిపోయిన వైనం ఆవేదనకు గురిచేస్తోంది. జెట్ కాయిల్ వలన మంటలు చెలరేగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
*వలిగొండ మండలం గోకారం గ్రామానికి చెందిన పంజాల సాయికుమార్ చారి(24), భూదాన్పోచంపల్లి మండలంలోని జలాల్పూర్ క్లస్టర్లో వ్యవసాయ విస్తరణాధికారి(ఏఈఓ) హోదాలో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నాడు. రోజూలాగే శనివారం సాయంత్రం 4గంటలకు తన విధులు ముగించుకుని స్వగ్రామానికి బయలుదేరాడు. అయితే.. ఇంటికి మాత్రం చేరలేదు. సాయి ఫోన్కు అతడి తల్లి ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయలేదు. ఈ క్రమంలో.. ఆదివారం ఉదయం 8 గంటలకు జిబ్లక్పల్లి వీఆర్ఏ వీఆర్ఏ వెంకటేశానికి గ్రామశివారులో ఓ చెట్ల పొదల్లో సాయి బైక్, పక్కనే అతడి మృతదేహం కనిపించాయి. ఆయన సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఆధార్ కార్డు ఆధారంగా సాయికుమార్ కుటుంబీకులకు సమాచారాన్ని అందించారు. మృతదేహం వద్ద క్రిమిసంహారక మందుల డబ్బా ఉండటంతో.. అతడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
*కొమరోలు మండలంలోని హసనాపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న గిద్దలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన అనంతపురం నుండి విజయవాడకు వెళ్తుండగా చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
*ఎటపాక మండలం మురుమూరు గ్రామంలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న గిరిజన విద్యార్థిని ఉరేసుకుని ఆత్యహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మడివి అశ్వినిశ్రీ(21)కి తల్లిదండ్రులు లేకపోవడంతో నాయినమ్మ దగ్గర ఉంటూ కూనవరంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. విద్యార్థిని నాయినమ్మ కూలీ పనికి వెళ్లడంతో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని ప్రేమ వ్యవహారంలో మనస్తాపం చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది. సీఐ గజేంద్రకుమార్, ఎస్ఐ పార్థసారథి సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థిని మృతిపై ఆరా తీశారు. విద్యార్థిని పెద్దనాన్న మడివి ప్రభాకర్ ఓ యువకుడిపై అనుమానం ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
*ఇచ్చోడలో అక్రమంగా గంజాయి రవాణా జరుగుతోందని సమాచారం మేరకు ఇచ్చోడ పోలీసులు తనిఖీలో 5కిలోల గంజాయి పట్టుబడింది. ఎస్సై ఉదయ్కుమార్ కథనం ప్రకారం.. శనివారం సాయంత్రం మండలంలోని జామిడి గ్రామం వద్ద సిరిసెల్మ నుంచి ఇచ్చోడ వైపు వస్తున్న ద్విచక్రవాహనాన్ని తనిఖీ చేయగా అందులో గంజాయి దొరకడంతో వాహనంపై ఉన్న ఇద్దరు పారిపోవడానికి ప్రయత్నించగా ఒకరిని పట్టుకున్నారు. 5కిలోల గంజాయి స్వాధీనం పర్చుకున్నారు. బజార్హత్నూర్ మండలంలోని ధర్మపురి గ్రామానికి చెందిన అర్కఈశ్వర్, అర్కహరీష్ సిరికొండ మండలంలోని జెండగాం గ్రామం నుంచి కొనుగోలు చేసి హైదరాబాద్కు తరలిస్తున్నారని ఎస్సై తెలిపారు. ఇచ్చోడ నాయబ్ తహసీల్దార్ జాదవ్రామారావ్చే పంచనామా చేయించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పరారీ అయిన అర్క హరీష్ లొంగి పోవాలని కోరారు.
*రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రయాణిస్తున్న కాన్వాయ్లోని వాహనాలు ఢీకొని ఓ వ్యక్తి ఘటనాస్థలంలోనే మరణించారు. అసోం, గోలాఘాట్ జిల్లాలోని బోకాఖాట్ ప్రాంతంలో శనివారం జరిగిన ఈ ప్రమాదంలో మిలాన్పూర్కు చెందిన రామేశ్వర్ రబీదాస్ చనిపోయారు. అయితే, ఈ ఘటనపై పోలీసులు అధికారిక ప్రకటన చేయలేదు. కానీ, అసోం వ్యవసాయ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే అతుల్ బోరా ప్రమాదం జరిగిన మాట వాస్తవమేనని వెల్లడించారు. కాగా, రెండ్రోజుల పర్యటనలో భాగంగా కజిరంగ నేషనల్ పార్కు సందర్శనకు రాష్ట్రపతి అసోం విచ్చేశారు.
*సిమెంట్ ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రైల్వే ఎస్సై చనిపోయారు. ట్యాంకర్ డ్రైవర్ వేగంగా వెళుతూ అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో కారు నడుపుతున్న ఎస్సై వెనుక నుంచి ట్యాంకర్ను ఢీకొట్టారు. హైదరాబాద్లోని పహాడిషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ దుర్ఘటన జరిగింది. మహబూబ్నగర్ జిల్లా ధర్మాపూర్ పోస్ట్ అల్లిపూర్ గ్రామానికి చెందిన పల్లె రాఘవేందర్ గౌడ్ (37) డిప్యూటేషన్పై మహబూబ్నగర్ రైల్వే పోలీస్స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్నారు.
*మధుమేహంతో తీవ్ర అస్వస్థతకు గురై సర్కారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ యువతి మరో ఆస్పత్రికి తరలించే క్రమంలో ఆక్సిజన్ అందక చనిపోయింది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేటకు చెందిన ప్రజ్వల (22) ఆరు రోజుల క్రితం షుగర్ స్థాయి పడిపోవడంతో వేములవాడలోని ఏరియా ఆస్పత్రిలో చేర్చారు. శనివారం తెల్లవారుజామున పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో సిరిసిల్ల ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. 108 వాహనంలో అక్కడికి తరలించగా, అక్కడి వైద్యులు ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు.
*తన వివాహేతర సంబంధం గురించి మందలించిందన్న కోపంతో ప్రియుడితో కలిసి సొంత కూతురినే ఓ తల్లి అంతమొందించింది. గత ఏడాది అక్టోబర్ 16న జరిగిన ఈ ఘటన అప్పట్లో ఆత్మహత్యగా చిత్రీకరించినప్పటికీ పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు విచారణ జరిపి హత్య అని తేల్చారు. ఆదివారం ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.