*ఉక్రెయిన్ లో మరో భారతీయుడు మృతిచెందాడు. గత వారం రోజులుగా రష్యా వర్సెస్ ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే ఈ యుద్ధం కారణంగా చదువుకునేందుకు అక్కడికి వెళ్లిన విద్యార్థులు తిరిగి భారత్ కు చేరుకుంటున్నారు. అయితే అక్కడ జరుగుతున్న యుద్ధంలో నిన్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన నవీన్ అనే విద్యార్థి క్షిపణిదాడిలో చనిపోయిన విషయం విదితమే. అయితే ఈరోజు మరో భారతీయుడు ఉక్రెయిన్ లో చనిపోయాడు. ఈరోజు చనిపోయిన విద్యార్థి పంజాబ్ కు చెందిన చందన్ జిందాల్ గా గుర్తించారు. అయితే ఈ యువకుడు అనారోగ్యంతో మృతిచెందాడని సమాచారం.
*అమెరికాలో కూతుర్లను చంపి తండ్రి ఆత్మహత్య
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఓ తండ్రి ఘోరానికి ఒడిగట్టాడు. శాక్రమెంటో చర్చికి తన ముగ్గురు కూతుర్లు, సహాయకురాలితో వెళ్లాడు. తుపాకీతో వారిపై కాల్పులు జరిపాడు. దీంతో వాళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. తర్వాత అతడూ కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.
* మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో టీఆర్ఎస్ నేత అరెస్ట్
సంచలనం సృష్టించిన మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో పోలీసుల చర్యలు తీసుకుంటున్నారు. టీఆర్ఎస్కు చెందిన నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సాజిద్‌ను ఈ కేసులో అరెస్టు చేశారు. అలాగే సాజిద్ డ్రైవర్ జాఫర్‌తో పాటు మధ్యవర్తిగా వ్యవహరించిన అన్నపూర్ణ అనే మహిళను కూడా అరెస్ట్ చేశారు. సాజిద్‌పై ఐపీసీ 363 376 (2) 109 సెక్షన్ కింద కేసు నమోదు చేశామని డీఎస్పీ ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు.
* ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా పరిచయం అయిన ఓ యువతిని ఐస్‌క్రీమ్ పార్లర్‌కు తీసుకువెళతానని చెప్పి స్నేహితుడి ఇంట్లోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడో యువకుడు. నమ్మి మోసపోయిన ఆ యువతి డయల్ 100కు ఫోన్ చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
* బాలికపై అత్యాచారం కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు నిర్మల్ జిల్లా డీఎస్పీ ఉపేందర్ రెడ్డి వెల్లడించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సాజిద్‌తో పాటు అతని కారు డ్రైవర్ జాఫర్, మధ్యవర్తి అనురాధను అదుపులోకి తీసుకున్నారు. గత నెల 26న బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు షేక్ సాజిద్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. షేక్ సాజిద్‌పై గతంలో పలు కేసులు ఉన్నాయి. అతనిపై రౌడీషీట్ తెరిచామని పేర్కొన్నారు
* నిలోఫర్ ఆస్పత్రిలో ఇద్దరు చిన్నారుల మృతి. ఉదయం ఇద్దరు చిన్నారులకు ఇంజక్షన్లు ఇచ్చిన నర్స్. ఇంజక్షన్లు ఇవ్వడం వల్లే పిల్లలు చనిపోయారంటున్న తల్లి దండ్రులు. ఆస్పత్రికి వచ్చేసరికే ఆరోగ్యం విషమించిందన్న నిలోఫర్ వైద్యులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
* హైదరాబాద్ కృష్ణానగర్‌లో దారుణం చోటుచేసుకుంది. విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. స్థానిక సాయికృప పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థుల మధ్య వివాదం జరిగి ఘర్షణ పడ్డారు. తరగతి గదిలో పేపర్‌తో క్రికెట్ ఆడుతూ నలుగురు విద్యార్థులు ఘర్షణ పడి ఒకిరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో మన్సూర్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
* వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సీకే దిన్నె మండలం మద్దిమడుగులో వ్యాన్ బీభత్సం సృష్టించింది. రోడ్డు పనులు చేస్తున్నవారిపై వ్యాన్ దూసుకెళ్లింది. ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని కడప రిమ్స్‌కు తరలించారు.
* మహాశివరాత్రి పండుగరోజే జిల్లాకేంద్రంలో విషాదం, ఆందోళన చోటు చేసుకున్నాయి. అనుమానాస్పదస్థితిలో వివాహిత చనిపోవడం ఉద్రిక్తతకు దారితీసింది. తనను అత్తింటివారే చంపారంటూ బాధిత కుటుంబసభ్యులు స్థానిక రూరల్ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక మంజులాపూర్‌కు చెందిన అరుగుల సాయికృష్ణకు ఎనిమిదేళ్ల క్రితం కుంటాల మండల కేంద్రానికి చెందిన ప్రణీత(24)తో వివాహమైంది
* ఇబ్రహీంపట్నం కాల్పుల కేసు కీలక మలుపు తిరిగింది. కాల్పుల ఘటనను కిరాయి హంతకుల సుపారి హత్యగా పోలీసులు ప్రాధమికంగా నిర్ధారణ చేశారు. పాతకక్షల నేపథ్యంలో జరిగిన హత్యలుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక హత్య కేసులో రాఘవేందర్‌రెడ్డి నిందితుడని, శ్రీనివాస్‌రెడ్డిపై సైతం పలు కేసుల్లో ఉన్నట్లు తెలిపారు. వీరిద్దరూ కలిసి కొంతకాలంగా పలు లాండ్ అగ్రిమెంట్స్, డెవలప్మెంట్లు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
* ప్రముఖ నృత్య కళాకారిణి, ఆంధ్ర నాట్య గురువు, పరిశోధకురాలు డాక్టర్ కే సువర్చలాదేవి(53) బుధవారం హఠాన్మరణం చెందారు. ఆకస్మాత్తుగా అనారోగ్యానికి గురికావడంతో ఆమెను బుధవారం ఉదయం హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్న క్రమంలో ఆమె గుండెపోటుకు గురై మరణించారు. సువర్చలాదేవి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించి, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
* వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తకోట మండలం రాణి పేట స్టేజీ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో డీసీఎం డ్రైవర్ మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. బెంగళూరు నుంచి కీరదోసకాయ లోడుతో హైదరాబాద్ వస్తున్న డీసీఎం ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది.
* కడప జిల్లా సీకే దిన్నె మండలం మద్దిమడుగు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు
గ్రామస్తులు దుర్మరణం చెందారు. కడప-బెంగళూరు జాతీయ రహదారిలో ఈ ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారి పక్కనే ఉన్న మద్దిమడుగు గ్రామస్తులు ఇంటిముందు మంచంపై కూర్చొని ఉండగా.. కడప నుంచి రాయచోటికి వెళ్లే జిప్సీ వ్యాను వేగంగా వారిపైకి దూసుకెళ్లింది.
*బెలుగుప్ప మండలం జీడిపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. జీడిపల్లి రిజర్వాయర్‌లో ప్రమాదవశాత్తు నీటిలో పడి లావణ్య అనే బాలిక మృతి చెందింది. తరచుగా రిజర్వాయర్‌లో పడి ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
*మితిమీరిన వేగంతో వెళ్తున్న వాహనదారుడు అదుపుతప్పి ఫ్లై ఓవర్ పైనుంచి కిందపడి మృతి చెందిన సంఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి జరిగింది. సాలార్జంగ్ కాలనీలో నివాసముంటున్న మహమ్మద్ సర్పరాజ్ హుస్సేన్(18) అదే కాలనీలో ఓ మెడికల్ షాప్‌లో పని చేస్తున్నాడు. మంగళవారం రాత్రి బుల్లెట్‌పై టోలీచౌకి వంతెన మీదుగా షేక్‌పేట వెళ్తున్నాడు. మితిమీరిన వేగంతో వెళ్తూ అదుపుతప్పి ఫ్లై ఓవర్ పైనుంచి కింద పడ్డాడు. హెల్మెట్ లేకపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. బుల్లెట్ బైక్ నుజ్జునుజ్జయ్యింది. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులు హుటాహుటిన స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గోల్కొండ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
*ప్రైవేటు ఫైనాన్స్ వ్యాపారుల వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. శంషాబాద్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మునిసిపల్ కేంద్రంలోని జెండా చౌరస్తాకు చెందిన గంటా సాయికృష్ణ(27) ఓ ఫైౖనాన్స్ సంస్థలో అప్పు తీసుకొని ద్విచక్రవాహనం కొనుగోలు చేశాడు. కరోనా సమయంలో రెండు వాయిదాలు కట్టలేకపోయాడు. దీంతో సదరు సంస్థ నిర్వాహకులు అందరూ చూస్తుండగా వాహనాన్ని తీసుకెళ్లారు. దీంతో మనస్తాపం చెందిన సాయికృష్ణ మంగళవారం ఇంట్లో ఉరివేసుకున్నాడు. ఫైనాన్స్ వ్యాపారుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో పోలీసులు ఫైనాన్స్ సంస్థ సూపర్వైజర్ను అదుపులోకి తీసుకున్నారు.
*హైదరాబాద్ నగరంలోని హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిగా వరుసగా మూడు చోరీలు కలకలం రేపుతున్నాయి. శివమ్ హిల్స్ కాలనీ, బృందవన్ కాలనీ, రంగ నాయకుల గుట్ట వద్ద దుండగులు చోరీలకు పాల్పడ్డారు. భారీగా బంగారు, వెండి, నగదుతో పాటు పార్కింగ్ చేసిన బైక్‌ను ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
* కడప జిల్లాలోని చింతకొమ్మదిన్నె మండలం మధ్దిమడుగు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ వాహనం… ఇంటి ముందు కూర్చున్న వారిపైకి దూసువెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా… మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలిసిన పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని క్షతగాత్రులను కడప రిమ్స్ కు తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
* తిరునల్వేలి జిల్లా వళ్ళియూరు పాత బస్టాండు సమీపంలోని ప్రముఖ జ్యూవ లరీ షాపులో రూ. 15 లక్షల విలు వైన నగలను చోరీ చేసిన ఆ షాపులో ఉద్యోగిని, ఆమె తల్లిని పోలీసులు అరెస్టు చేశా రు.
* కోర్టు విధుల నుంచి బదిలీ చేశారనే ఆగ్రహంతో ఓ ఆఫీస్ అసిస్టెంట్ న్యాయమూర్తిపై ఏకంగా హత్యకు యత్నించిన ఘటన తమిళనాడులో మంగళవారం చోటు చేసుకుంది. సేలం జిల్లా అస్థంపట్టిలో 24 కోర్టుల సముదాయం ఉంది. నాలుగో నేరవిభాగం కోర్టులో పొన్ పాండి న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కేసుల విచారణ నిమిత్తం మంగళవారం ఉదయం 11 గంటలకు కోర్టుకు చేరుకోగా అక్కడే పొంచి ఉన్న ప్రకాష్ అనే ఆఫీస్ అసిస్టెంట్ అకస్మాత్తుగా ఆయన్ను కత్తితో పొడవబోయాడు.అప్రమత్తమైన న్యాయమూర్తి కత్తిని అడ్డుకోగా చేతికి బలమైన గాయమైంది. అక్కడే ఉన్న వారు ప్రకాష్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఓమలూరు అనే ప్రాంతంలోని కోర్టుకు ప్రకాష్ ఇటీవల బదిలీ అయ్యాడు. దీనిపై అతడు జడ్జితో గొడవపడినట్లు సమాచారం. ఈ కక్షతోనే దాడికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
* తూర్పు గోదావరి జిల్లాలో కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకోట్టింది. ఈ ప్రమాదంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే కుమారుడికి స్వల్ప గాయాలు కాగా.. అతని మేనల్లుడు తీవ్రంగా గాయపడ్డాడు.తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం ఎదుర్లంక వద్ద.. జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. కాకినాడ నుంచి అమలాపురం వైపు వస్తున్న కారు… రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
* ప్రకాశం జిల్లాలోని అద్దంకి బ్రాంచ్ కాలువ వద్ద విషాదఘటన చోటుచేసుకుంది. కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చిన్నారులు కృష్ణ, సాయిసౌమ్యతో కలిసి చిరంజీవి కాలువలోకి దూకాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమచారం మేరకు సంఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. అద్దంకి బ్రాంచ్ కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
*డాక్టర్ కావాలనేది ఆమె కల. కానీ పే దరికం ఆటంకంగా నిలిచింది. ఎంబీబీఎస్ కోర్సు అర్హత పరీక్ష అయిన నీట్‌కు అవసరమైన కోచింగ్ తీసుకునేందుకు డబ్బు లేక ఆత్మాహత్యాయత్నం చేసిం ది. 20 రోజుల పాటు ప్రాణాల కోసం పోరాడి సోమవారం ఈ లోకాన్ని విడిచింది. భూ పాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాకలో ఈ ఘట న జరిగింది.
*హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సులో భారీగా బంగారు నగలు, వజ్రాలు పట్టుబడ్డాయి. కర్నూలు మండలం పంచలింగాల చెక్‌పోస్టు వద్ద ఎస్ఈబీ సీఐ మంజుల, ఎస్ఐ ప్రవీణ్‌కుమార్‌నాయక్ నేతృత్వంలో సిబ్బంది సోమవారం వాహన తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సులోని ప్రయాణికులను తనిఖీ చేయగా.. రాజస్తాన్‌లోని జున్జును పట్టణానికి చెందిన కపిల్ అనే యువకుడి బ్యాగులో 840 గ్రాముల బంగారు ఆభరణాలు, 57 వజ్రాలు బయటపడ్డాయి. వీటి విలువ సుమారు రూ.39.28 లక్షలుంటుందని అధికారులు అంచనా వేశారు. బిల్లులు, జీఎస్టీ ట్యాగ్లు లేకపోవడంతో.. కపిల్‌ను విచారణ నిమిత్తం కర్నూలు అర్బన్ తాలూకా లీసులకు అప్పగించారు.