* విలాస జీవనం కోసం అడ్డదారులను తొక్కటాన్ని అలవాటు చేసుకున్నాడు. అతని ప్రవర్తనకు విసిగి వేసారిన తల్లిదండ్రులు ఏళ్ల క్రితం ఇంటినుంచి గెంటేశారు. అయినా తీరు మార్చుకోలేదు. పరిచయాలు పెంచుకోవటం, నమ్మకం కలిగించటం, డబ్బులు లాగటం.. మెల్లగా ఆ చోటు నుంచి ఉడాయించి కొత్త చోటు, దారులను వెతుక్కోవటం.. ఇదీ అతని జీవన శైలి. అలా తెలుగు రాష్ట్రాల్లో ఎందరినో మోసగించిన అతగాడి బండారం తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన ఓ యువతి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.ఆన్‌లైన్ వివాహ పరిచయ వేదికలో పేరు నమోదు చేసుకున్న యువతులే అతని లక్ష్యం. పరిచయం చేసుకుని ముందుగా ఛాటింగ్ తో షురూ చేస్తాడు. తర్వాత మాటలతో మాయచేస్తాడు. అమెరికాలో నీకూ ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఆశపెట్టి అందినకాడికి దోచుకుని ముఖం చాటేస్తాడు. అలా తెలుగు రాష్ట్రాల్లో ఎందరినో మోసగించిన అతగాడి బండారం తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన ఓ యువతి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.
* ములుగులో ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు దుర్మరణం
ములుగు (Mulugu) జిల్లా కేంద్రానికి సమీపంలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ములుగు మండలం ఎర్రిగట్టమ్మ వద్ద జాతీయ రహదారిపై ఓ ఆటోను డీసీఎం ఢీకొట్టింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి ఆటో నుజ్జునుజ్జు అవగా, మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ, ఆటో డ్రైవర్ ఉన్నారు.
* డోర్నకల్ మండలంలోని రాముతండా పంచాయతీకి చెందిన బానోతు ప్రశాంత్ గురువారం రాత్రి ఓ వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటి సమీపంలో ఉంటున్న వివాహిత గురువారం రాత్రి స్నానం చేస్తుండగా ప్రశాంత్ బాత్‌రూమ్‌లోకి ప్రవేశించి అత్యాచారం చేశాడు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు డోర్నకల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.
* మణిపూర్ రెండో ఫేజ్ ఎన్నికల పోలింగ్ కూడా హింసాత్మక ఘటనల మధ్యే సాగుతున్నాయి. రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత ఏర్పాటు చేసినప్పటికీ.. ఈ ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం.
* భారీ చోరీలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్న మోస్ట్ వాంటెడ్ గజదొంగ సంతోష్‌నాయక్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. 22.409 తులాల బంగారు ఆభరణాలు, 23.7 తులాల వెండి ఆభరణాలు, 11 విదేశీ కరెన్సీలు, 251 విదేశీ కరెన్సీ కాయిన్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సెంట్రల్‌జోన్ డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. శుక్రవారం ఆయన కార్యాలయంలో సెంట్రల్ జోన్ డీసీపీ రమణరెడ్డి, అబిడ్స్ ఏసీపీ వెంకట్‌రెడ్డి, ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ బి.జానయ్య, నారాయణగూడ ఇన్‌స్పెక్టర్ గట్టుమల్లు, డీఐ రవికుమార్‌లతో కలసి వివరాలను వెల్లడించారు.
* హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేట్‌లో శనివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లారీలో ఇటుకలను తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరో లారీలోకి ఇటుకలను తరలించారు.
* కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్‌లో దంపతుల ఆత్మహత్య కలకలం రేపుతోంది. భాగ్యలక్ష్మి, వెంకటేష్ దంపతులు ఇంట్లో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కుటుంబకలహాలే అఘాయిత్యానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
* అన్నను చూసేందుకు తెలంగాణ నుంచి వచ్చిన ఓ సోదరి అన్న చేతిలోనే దారుణహత్యకు గురైంది. అన్న కోరిక మేరకు కోడి కూర వండకపోవడం వల్ల ఆగ్రహానికి గురైన అన్న చేతిలోని కత్తికి ఆమె బలవడం విషాదకరం. తన ఆరోగ్యం బాగోలేనందున వంట చేయలేనని చెప్పినా వినకుండా హత్య చేయడం పట్ల గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషాద ఘటన తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని కూనవరం మండలంలో చోటుచేసుకున్నది.
* మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్‌లో భాగంగా శనివారంనాడు హింస చెలరేగింది. తౌబల్ జిల్లాలో ఒక ఘటనసెనాపతి జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇద్దరు మృతి చెందారు.
* జమ్ముకశ్మీర్ సాంబ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్యూవీ వాహనం అదుపుతప్పి భారీ లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.ఎస్యూవీ వాహనం పంజాబ్ నుంచి శ్రీనగర్ వెళ్తుండగా మాన్సార్ సమీపంలోని జమోదా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఐదుగురి మృతదేహాలను వెలికితీసినట్లు చెప్పారు. క్షతగాత్రున్ని స్థానిక ఆసుపత్రికి తరలించామన్నారు.
* పాకిస్థాన్ పెషావర్లోని ఓ మసీదులో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సుమారు 56 మంది చనినిపోయారు. దాదాపు 194 మందికి గాయాలయ్యాయి. శుక్రవారం మసీదు చాలా రద్దీగా ఉండడం కారణంగా ఈ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
* శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరు కూడలి వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఆయిల్ లోడుతో వెళ్తున్న లారీ డ్రైవర్ ఓ దాబా దగ్గర ఆపాడు. అదే రోడ్డులో వెనక నుంచి చేపల లోడుతో కలకత్తా వెళ్తున్న మరో లారీ ఆగివున్న ఆయిల్ లారీని ఢీకొంది. అనంతరం కల్వర్టును ఢీకొట్టి… ఓ షాపులోకి దూసుకెళ్లడంతో ఒక్కసారిగా బ్యాటరీల్లో మంటలు వ్యాపించి లారీ ముందు భాగం పూర్తిగా కాలిపోయింది.
* కోడికూర వండలేదని సొంత అన్నే… చెల్లిని చంపిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలం కన్నాపురంలో చోటుచేసుకుంది.
* మిల్స్ కాలనీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శివనగర్‌లో వ్యభిచార గృహంపై దాడి చేసి నిర్వాహకులు, విటులను అరెస్టు చేసినట్లు టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. వ్యభిచారం చేస్తున్న లేబర్‌కాలనీకి చెందిన తడిగల అరుణ, కాశిబుగ్గకు చెందిన కాకర రజిత, పద్మనగర్ కాలనీకి చెందిన కాసాజోల రేవతి, రెడ్డిపాలెంకు చెందిన రేష్మా, నిర్వాహకుడు శివనగర్‌కు చెందిన దోమల సంపత్, విటులు శివనగర్‌కు చెందిన రంజిత్‌కుమార్, వర్ధన్నపేట ఇల్లందుకు చెందిన బానోతు రాజును అరెస్టు చేసి మిల్స్‌కాలనీ పోలీసులకు అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్లు ఆర్.సంతోశ్, శ్రీనివాస్ జీ, ఎస్సై వడ్డెబోయిన లవన్‌కుమార్ పాల్గొన్నారు.
* జమ్ముకశ్మీర్‌లోని సాంబా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని మన్సర్ సమీపంలో ఓ కారు అదుపుతప్పి లోయలో పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆరుగురితో కూడిన కారు.. పంజాబ్ నుంచి శ్రీనగర్ వెళ్తున్నది. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున సాంబా జిల్లాలోని జమోడా, మాన్సర్ మధ్య అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ఉన్నారని చెప్పారు.
* కూతురు ప్రేమ వివాహం చేసుకుందని తల్లిదండ్రులు ఆత్మహత్యాయత్నం చేశారు. వర్ధన్నపేట మండలం చెన్నారం గ్రామంలో కూతురు ప్రేమ వివాహం చేసుకుని పరువు తీసిందని తల్లిదండ్రులు మంద కుమారస్వామి, కవిత పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశారు. వారిద్దరినీ చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. తండ్రి కుమారస్వామి పరిస్థితి విషమంగా ఉంది.
* ములుగు జిల్లా ఇంచర్ల గ్రామ సమీపంలో ఎర్రి గట్టమ్మ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను డీసీఎం ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు మృతిచెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. వీరిని కోమటిపల్లికి చెందిన వారిగా గుర్తించారు.
*అక్రమంగా మద్యాన్ని నిల్వ ఉంచిన ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసినట్లు నాయుడుపేట సెబ్ ఎస్‌ఐ రేవతి తెలిపారు. నాయుడుపేట సెబ్ కార్యాలయంలో శుక్రవారం రాత్రి ఆమె వివరాలు తెలిపారు. పెళ్లకూరు మండలం రావులపాడు గ్రామంలో దాడులు నిర్వహించి వరలక్ష్మి అక్రమంగా నిల్వ ఉంచిన 10 మద్యం సీసాలను, అదే మండలంలో పెన్నేపల్లి క్రాస్‌రోడ్డు వద్ద యశోదమ్మ నిల్వ ఉంచిన 6 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కేసుల్లో ఆ ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసినటు తెలిపారు
*కర్నూలు మండలం పూలతోట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా బావిలోకి దూకి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు మృతి చెందగా… తల్లి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ అఘాయిత్యానికి కుటుంబ కలహాలే కారణంగా తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
* తనకు ఇంట్లో, బడిలో సరైన గుర్తింపు లభించడం లేదనే ఆవేదనతో ఓ విద్యార్థిని వాటార్ ట్యాంక్‌లోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద ఎక్లారా సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. మృతురాలు నిజాంసాగర్ మండలం మగ్దుంపూర్ గ్రామానికి చెందిన 16 ఏళ్ల శిరీష. ఆమె పెద్ద ఎక్లారా సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. తెల్లవారుజామునే లేచిన విద్యార్థినులంతా ఉదయం 6:30 గంటలకు స్నానానికి వెళ్లారు. అయితే శిరీష కనిపించకపోవడంతో తోటి విద్యార్థినులు విషయాన్ని ప్రిన్సిపల్ సవిత దృష్టికి తీసుకెళ్లారు. అందరూ కలిసి గాలించగా వాటర్ ట్యాంక్‌లో మృతదేహం కనిపించింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
*రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బీజేపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులతో మండల మహిళా మొర్చ నాయకురాలు దాసరి పూర్ణిమ వాగ్వివాదానికి దిగారు. మంత్రి కేటీఆర్ వచ్చిన ప్రతిసారి ఇలాగే చేస్తారా అంటూ మండిపడ్డారు.
*విజయనగరం జిల్లా కురుపాం మహాత్మాగాంధీ జ్యోతీబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో గురువారం రాత్రి పాముకాటుతో ఓ విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరు ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్నారు. భోజనం అనంతరం విద్యార్థులు నిద్రిస్తున్న ఓ గదిలోకి అర్ధరాత్రి సమయంలో పాము ప్రవేశించింది. కొమరాడ మండలం దళాయిపేటకు చెందిన మంతిని రంజిత్ (13), వంగపండు నవీన్, ఈదుబిల్లి వంశీలను కాటువేసింది. వారిని ప్రాథమిక వైద్యం అనంతరం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి విజయనగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, చికిత్సపొందుతూ రంజిత్ మృతిచెందాడు. నవీన్, వంశీలకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థులను డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి పరామర్శించారు.
*అక్రమంగా మద్యాన్ని నిల్వ ఉంచిన ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసినట్లు నాయుడుపేట సెబ్ ఎస్‌ఐ రేవతి తెలిపారు. నాయుడుపేట సెబ్ కార్యాలయంలో శుక్రవారం రాత్రి ఆమె వివరాలు తెలిపారు. పెళ్లకూరు మండలం రావులపాడు గ్రామంలో దాడులు నిర్వహించి వరలక్ష్మి అక్రమంగా నిల్వ ఉంచిన 10 మద్యం సీసాలను, అదే మండలంలో పెన్నేపల్లి క్రాస్‌రోడ్డు వద్ద యశోదమ్మ నిల్వ ఉంచిన 6 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కేసుల్లో ఆ ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసినటు తెలిపారు.
*విజయనగరం జిల్లా కురుపాం మహాత్మాగాంధీ జ్యోతీబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో గురువారం రాత్రి పాముకాటుతో ఓ విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరు ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్నారు. భోజనం అనంతరం విద్యార్థులు నిద్రిస్తున్న ఓ గదిలోకి అర్ధరాత్రి సమయంలో పాము ప్రవేశించింది. కొమరాడ మండలం దళాయిపేటకు చెందిన మంతిని రంజిత్ (13), వంగపండు నవీన్, ఈదుబిల్లి వంశీలను కాటువేసింది. వారిని ప్రాథమిక వైద్యం అనంతరం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి విజయనగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, చికిత్సపొందుతూ రంజిత్ మృతిచెందాడు. నవీన్, వంశీలకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థులను డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి పరామర్శించారు.
*పద్మనాభం మండలంలోని కృష్ణాపురంలో ఉరి వేసుకుని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్టు గురువారం పోలీసులు తెలిపారు. కృష్ణాపురానికి చెందిన ములపర్తి గౌరినాయుడుకు విజయనగరం జిల్లా ఎస్.కోట మునసబువీధికి చెందిన ఎలమంచిలి నాగలక్ష్మితో 2016లో కులాంతర ప్రేమ వివాహం జరిగింది. దంపతులిద్దరూ అన్యోన్యంగానే ఉండేవారు. కాగా బుధవారం రాత్రి భర్త, అత్తమామలు నిద్రించాక అర్ధరత్రి ఒంటిగంటన్నరప్పుడు ఇంట్లోని హుక్‌కు చీరతో ఉరి వేసుకుని నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి అప్పలనరసమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ అప్పలరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.
*బేతంచెర్ల మండలంలోని గూటిపల్లె గ్రామానికి చెందిన ఉన్నం ఆదినారాయణ (24) అనే యువకుడు మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో చలిమంట వేసుకుంటూ ఆ మంటలో పడి మృతి చెందాడు. హెడ్ కానిస్టేబుల్ బీవీ రమణ గురువారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి కుమారుడు ఆదివానారయణ శివరాత్రి జాగరణ రోజు శివాలయం వద్ద చలిమంట కాపాడుకుంటూ ఆ మంటలో పడ్డాడు. చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ గత రాత్రి మృతి చెందాడు. ఆదినారాయణ తల్లి చంద్రకళ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.
*కురుపాం మండలంలో విషాదం చోటు చేసుకుంది. బీసీ హాస్టల్లోకి కట్లపాము చొరబడింది. అర్థరాత్రి నిద్రిస్తున్న ముగ్గురు విద్యార్థుల ముఖంపై కట్లపాము కాటేసింది. పాము కాటుతో విద్యార్థులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో తోటి విద్యార్థులు హాస్టల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన హాస్టల్ సిబ్బంది పాముకాటుకు గురైన విద్యార్థులను 108 అంబులెన్స్ సహాయంతో విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. పాముకాటు వల్ల విద్యార్థుల పరిస్థితి విషమించడంతో మిగతా విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.
*నూజివీడు ట్రిపుల్‌ఐటీ విద్యార్థి మండల రామూనాయుడు (16) గురువారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విజయనగరం జిల్లా గుర్ల మండలం దమరసింగికి చెందిన రామానాయుడు పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. క్యాంపస్‌లోని ఐ2 హాస్టల్‌లో ఉంటున్నాడు. గురువారం ఉదయం తరగతులకు వెళ్లడంతో పాటు మధ్యాహ్నం మెస్‌కు వెళ్లి భోజనం చేశాడు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో సెక్యూరిటీ సిబ్బంది ఈనెల 4న ట్రిపుల్‌ఐటీకి రానున్న ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల కోసం మూడో ఫ్లోర్‌లోని గదుల్ని సిద్ధం చేస్తున్నారు.
* షహరాన్‌పూర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ప్యాసింజర్ ట్రైనులో శనివారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని దౌరాల రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బోగీలు దగ్దం కాగాతక్కిన బోగీలకు మంటలు విస్తరించకుండా ఇంజన్ నుంచివాటిని సెపరేట్ చేయడంతో భారీ ప్రమాదం తప్పింది. షహరాన్‌పూర్ ఢిల్లీ జంక్షన్ ఎంఇఎంయూ స్పెషల్‌లోని ఒక కోచ్‌లో మంటలు చెలరేగినట్టు ప్రాథమిక సమాచారం. మంటలను ఆర్పివేశామనిఎలాంటి ప్రాణనష్టం జరగలేదనిఎవరూ గాయపడలేదని ఇండియన్ రైల్వేస్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వైకే ఝా తెలిపారు.
* కుల్కచర్ల మండలం అనంతసాగర్‌లో చిరుత కలకలం సృష్టించింది. చిరుతపులి దాడిలో రెండు బర్రె దూడలు మృతి చెందాయి. దీంతో అనంత సాగర్ గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. చిరుత సంచారంపై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరుత సంచారంతో ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలంటే భయమేస్తోందని గ్రామస్తులు వాపోయారు.