NRI-NRT

ఘనంగా ‘ఆటా’ మహిళా దినోత్సవం

ఘనంగా  ‘ఆటా’ మహిళా దినోత్సవం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమెరికా తెలుగు సంఘం (ఆటా) వర్జీనియా రాష్ట్రం లో మార్చి 5 వ తేదీ శనివారం రోజున మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించింది. 17వ ఆటా కాన్ఫరెన్స్‌ ఉమెన్స్‌ ఫోరం టీమ్‌ నాయకులు దీపికా బుజాల, అపర్ణ కడారి ఆధ్వర్యంలో ప్రశాంతి ముత్యాల, రజనీ పాడూరు, డాక్టర్‌ శ్రీలేఖ పల్లె, విజయ దొండేటి, పద్మ పుట్రేవు తదితరుల సహకారంతో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దాదాపు 400మందికిపైగా మహిళలు పాల్గొన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకను ప్రారంభించిన మొదటి జాతీయ తెలుగు సంస్థ ఆటా, 10వ వార్షికోత్సవంను ఈ వేడుకల్లోనే జరుపుకుంది. అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో, తెలుగు పాఠ్యపుస్తకాలు రచించి తెలుగు భాషకి ఎన్నో సేవలు అందించిన రచయిత డాక్టర్‌ సరోజన బండా ను, వాషింగ్టన్‌ ఏరియాలోని తెలుగు సంఘాలకు అధ్యక్షులుగా సేవలు అందించిన టిడిఎఫ్‌ మాజీ అధ్యక్షురాలు కవిత చల్లా, క్యాట్స్‌ మాజీ అధ్యక్షురాలు సుధా రాణి కొండపు, జిడబ్ల్యుటీసిఎస్‌ అధ్యక్షురాలు సాయిసుధ పాలడుగు, పిలుపు టివి అధ్యక్షురాలు ఆవంతిక నక్షత్రం మరియు అనిత ముత్తోజు వంటి మహిళా నాయకులను సత్కరించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన రానాప్రతాప్‌ చెగు, డాక్టర్‌ రీనా బొమ్మసాని, లక్ష్మీ పురుషోత్తమన్‌, ప్రీతి మునగపాటి వారి వారి రంగాల్లో వారి అనుభవాలతో పాటు మహిళా సాధికారత, మహిళా ఆరోగ్యం, మహిళా అభ్యున్నతి, ఆర్థిక స్వాతంత్య్రం అంశాలపై వారి విలువైన అభిప్రాయాలను, సలహాలను, సూచనలను అందరితో పంచుకున్నారు.

ఈ కార్యక్రమానికి హాజరైన ఆటా కాన్ఫరెన్స్‌ నిర్వహకులు జయంత్‌ చల్లా, రవి చల్లా, శ్రవణ్‌ పాడూరు, రవి బొజ్జ, అమర్పాశ్య, హనిమి వేమిరెడ్డి, కౌశిక్‌ సామ, సతీష్‌ వద్ది, భాస్కర్‌ బొమ్మారెడ్డి, రమణా రెడ్డి హాజరై మాట్లాడుతూ జులై 1,2,3 తేదీల్లో వాషింగ్టన్‌డిసిలో జరగబోయే 17వ ఆటా కాన్ఫరెన్స్‌ మరియు యూత్‌ కన్వెన్షన్‌ కి ఇదే ఉత్సాహంతో పాల్గోని జయప్రదం చేయవలసిందిగా కోరారు.