ప్రముఖ కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. జాకీ భగ్నానీతో తను ప్రేమలో ఉన్నానని రకుల్ ఇది వరకే చెప్పారు. వీలు కుదిరినప్పుడల్లా ఈ ప్రేమ పక్షులు విహార యాత్రల్లో మునిగి తేలుతున్నారు. ఇటీవలే మాల్దీవులు చుట్టొచ్చింది ఈ జంట. తాజాగా ఆగ్రాలో ప్రత్యక్షమయ్యారు. రకుల్, జాకీ.. ఇద్దరూ తాజ్‌మహల్ అందాల్ని ఆస్వాదిస్తూ, ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రముఖ దర్శకుడు లూ రాంజాన్స్ వివాహానికి రకుల్ తన ప్రియుడితో కలిసి హాజరయ్యారు. ఆ తరవాత… ఇలా ఆగ్రా అంతా చుట్టొచ్చారు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలో బిజీగా ఉన్నారు రకుల్. మరి పెళ్లి కబురు ఎప్పుడు పంచుకుంటారో?