మన వార్డురోబ్‌లో ఎన్ని చీరలున్నా… పట్టుచీరల ప్రత్యేకతే వేరు. వెండి, బంగారు జరీతో నేసిన కంచిపట్టు అయితే… ఇక చెప్పక్కర్లేదు. పండగలు, పర్వదినాలు, శుభకార్యాలు.. ఇలా అన్ని సంప్రదాయ సందర్భాలకు నప్పేస్తాయివి.
1.గులాబీ రంగు కంచిపట్టు టిష్యూ బ్రొకెడ్ చీరపై డైమండ్ గళ్లు, ఖాదీ అంచు… చూపు తిప్పనివ్వడంలేదు కదూ!
2.శ్రేష్ఠమైన బంగారు-వెండి వర్ణాల కంచిపట్టు టిష్యూ బ్రొకెడ్ చీరపై… సెల్ప్ డిజైను, మీనాకారి పూలు-ఆకుల మోటిఫ్‌ల అంచు… చీర అందాన్ని పెంచేశాయి.
3.చీర మొత్తం డైమండ్-పూల డిజైను… జతగా రుద్రాక్ష మోటిఫ్‌లు… సెల్ఫ్ జకార్డ్ సిల్వర్ టిష్యూ అంచు, కొంగు… లేత నీలం రంగు కంచిపట్టు టిష్యూ బ్రొకెడ్ చీరకు కళ తెచ్చాయి.
4.ఆకుపచ్చ కంచిపట్టు చీరపై జాందానీ పనితనం… వెండిపూల డిజైను… గులాబీ-బంగారు రంగుల మేళవింపుతో అంచు… దానికి ఆకుపచ్చటి పైప్‌లైన్… చీరకు కొత్త సొబగులు అద్దాయి.
5.బంగారు-పసుపు వర్ణం కంచిపట్టు టిష్యూ బ్రొకెడ్ చీరపై వెండి రంగులో డైమండ్-పైస్లీ మోటిఫ్‌లు… చూడగానే వావ్ అనిపిస్తాయి.
పట్టు పట్టు…కంచిపట్టు కట్టు
Related tags :