అతిలోక సుందరి లాంటి అందం, ఆకట్టుకునే అభినయంతో పాటు గొప్ప డ్యాన్సర్‌గానూ నిరూపించుకున్నారు పూజాహెగ్డే. మంచి బీట్ పడాలే కానీ డ్యాన్స్ మూమెంట్స్ ఇరగదీస్తారు అని పేరు తెచ్చుకున్నారు ఆమె. ప్రస్తుతం పూజ విజయ్ సరసన తమిళ చిత్రం ‘బీస్ట్’లో నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి శనివారం రెండో లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘జొల్లి వో జింఖానా’ అంటూ సాగే ఈ గీతానికి తన హుషారైన స్టెప్పులతో మంచి ఊపు తెచ్చారు పూజాహెగ్డే. విజయ్‌తో పోటీపడుతూ ఆమె వేసిన స్టెప్పులను ప్రేక్షకులు పెద్దఎత్తున ప్రశంసిస్తున్నారు. ఈ వీడియోను వైరల్ చేసి, పూజా పెర్‌ఫార్మెన్స్‌ను సామాజిక మాధ్యమాల్లో మెచ్చుకుంటున్నారు. అనిరుధ్ స్వరపరిచిన ఈ గీతాన్ని విజయ్ స్వయంగా ఆలపించడం విశేషం. ఈ చిత్రం నుంచి విడుదలైన తొలి గీతం ‘అరబిక్ కుత్తు’లోనూ విజయ్, పూజా జంట ప్రేక్షకులను మాస్ స్టెప్పులతో అలరించింది. ఇప్పటికే వ్యూస్ పరంగా యూట్యూబ్‌లో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఏప్రిల్‌లో ‘బీస్ట్’ ప్రేక్షకుల ముందుకురానుంది.