తనకు ఇల్లు అద్దెకి ఇవ్వడానికి ఎవరూ ఒప్పుకోలేదని కథానాయిక తాప్సి అన్నారు. టాలీవుడ్లో కెరీర్ ప్రారంభించిన ఆమె ప్రస్తుతం బాలీవుడ్లో రాణిస్తున్నారు. ‘పింక్’, ‘బేబీ’, ‘నామ్ షబానా’ సినిమాలతో హిందీలో హిట్లు అందుకుని వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. అయితే హైదరాబాద్ నుంచి ముంబయికి షిఫ్ట్ అయిన కొత్తలో అనేక సమస్యల్ని ఎదుర్కొన్నానని తాప్సి తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘ముంబయిలో నా కంటూ ఓ అద్దె ఇంటిని వెతుక్కోవడానికి చాలా కష్టపడ్డా. నేను ఒంటరిగా ఉండే నటిని కావడంతో ఎవరూ ఇల్లు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. నిజానికి ప్రజలకు నటన వృత్తిపై నమ్మకం లేదు. వారు నటీనటుల్ని చూడటానికి రూ.500 ఖర్చు చేసి థియేటర్‌కు వెళ్తారు. మమ్మల్ని నేరుగా చూడటానికి ఈవెంట్స్ కు వస్తారు. కానీ, వారున్న సమాజంలో మేం జీవించేందుకు మాత్రం ఒప్పుకోరు. తొలుత ఈ విషయం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది’.
ఎవరూ ఒప్పుకోలేదు
Related tags :