సీనియర్ నటి భానుప్రియ చెల్లెలు శాంతిప్రియ గుర్తుంది కదూ. దర్శకుడు వంశీ ‘మహర్షి’ చిత్రంతో ఆమెను హీరోయిన్గా పరిచయం చేశారు. శాంతిప్రియ, నిశాంతి పేర్లతో ఆమె కొన్ని తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటించారు. నాగార్జున హీరోగా రాఘవేంద్రరావు నిర్మించిన ‘అగ్ని’ చిత్రంలో ఆమే కథానాయిక. బాలీవుడ్లో మిథున్ చక్రవర్తి సరసన కూడా నటించారు. 1999లో బాలీవుడ్ దర్శకుడు వి.శాంతారామ్ మనవడు సిద్ధార్థ్ రాయ్‌ను శాంతిప్రియ పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక కూడా ఆమె కొన్ని టీవీ సీరియల్స్‌లో నటించారు. 2004లో సిద్ధార్థ్ రాయ్ గుండె పోటుతో కన్నుమూశారు. పదేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు శాంతిప్రియ నటిగా ఎంట్రీ ఇస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధురాలు, ‘నైటింగేల్ ఆఫ్ ఇండియా’గా పేరొందిన సరోజినీ నాయుడు జీవితకథ ఆధారంగా రూపుదిద్దుకొనే ‘సరోజిని’లో ఆమె టైటిల్ రోల్ పోషించనున్నారు. ఈ విషయాన్ని మంగళవారం శాంతిప్రియ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.
భానుప్రియ చెల్లెలు శాంతిప్రియ రీ ఎంట్రీ
