రాజమౌళి వెండితెరపై సృష్టించిన విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్ (RRR). భారీ అంచనాల మధ్య రిలీజైన ఆర్ఆర్ఆర్ తొలి రోజు నుంచి ఇప్పటివరకు రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ గ్లోబల్ బాక్సాపీస్ (వరల్డ్ వైడ్‌గా) కలెక్షన్ల విషయం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. తాజాగా ఆర్ఆర్ఆర్ గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. సరిహద్దు దేశమైన నేపాల్‌లో తన హవా కొనసాగిస్తోంది ఈ ప్రాజెక్టు.మొదటి రోజు నుంచి ఆర్ఆర్ఆర్ కంటిన్యూగా కోటి రూపాయలు (నేపాల్ రూపీస్) కలెక్షన్లను వసూలు చేస్తుంది. ట్రేడ్ సర్కిల్ వెల్లడించిన డాటా ప్రకారం ఆర్ఆర్ఆర్ ఫస్ట్ వీక్ కలెక్షన్లు రూ.7 కోట్లు. ఇది నేపాల్ హిస్టరీలోనే హయ్యెస్ట్ అని టాక్. నార్తిండియాలో ఆర్ఆర్ఆర్ భారీ వసూళ్లను రాబడుతోంది. హిందీలో ఇప్పటివరకు 100 కోట్లు రాబట్టిన ఆర్ఆర్ఆర్..బాక్సాపీస్ వద్ద తన మేనియాను ప్రదర్శిస్తూ ముందుకెళ్తుంది.ఈ మూవీ ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లు తెస్తోంది. ఈ చిత్రంలో రాంచరణ్, ఎన్టీఆర్ మెయిన్ లీడ్ రోల్స్ లో నటించగా..వారి యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ సీతగా నటించగా..కోలీవుడ్ నటుడు సముద్రఖని, బాలీవుడ్ యాక్టర్లు అజయ్ దేవ్‌గన్, శ్రియా శరణ్ కీ రోల్స్ చేశారు.