WorldWonders

8 మంది ఐఏఎస్ లకు జైలుశిక్ష – TNI తాజా వార్తలు

8 మంది ఐఏఎస్ లకు జైలుశిక్ష  – TNI తాజా వార్తలు

* కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్లకకు జైలు శిక్ష – ఐఏస్లు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్, రాజశేఖర్, చినవీరభద్రుడు, జె.శ్యామలరావు, శ్రీలక్ష్మి, ఎంఎం నాయక్‍, విజయ్కు్మార్లాకు రెండు వారాల జైలుశిక్ష, జరిమానా విధించిన ఏపీ హైకోర్టు – కోర్టును క్షమాపణ కోరిన ఐఏఎస్లుజ – జైలుశిక్షకు బదులుగా ఏడాదిపాటు ప్రతినెలలో ఒకరోజు సంక్షేమ హాస్టల్కుజ వెళ్లి సేవ చేయాలని హైకోర్టు ఆదేశం – ఏడాదిపాటు సంక్షేమ హాస్టల్లో ఒక్కపూట భోజనం పెట్టాలన్న హైకోర్టు – ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయొద్దంటూ గతంలో హైకోర్టు ఆదేశాలను పాటించని ఐఏఎస్ అధికారులు

*నేర చరితులకు టీటీడీ పదవులు ఇవ్వడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
నేర చరితులకు టీటీడీ పదవులు ఇవ్వడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నేరచరిత్ర ఉన్న వారిని బోర్డు సభ్యులుగా నియమించడంపై హైకోర్టులో బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. వాయిదాపై పిటిషనర్‌ తరపు లాయర్‌ అశ్వనీకుమార్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసు వివరాలను ధర్మాసనానికి అశ్వనీకుమార్‌ వివరించారు. నేరచరితుల్ని ఎలా నియమిస్తారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. మీకేదో లబ్ధి జరగడం వల్లే ఇలా చేస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. అశ్వనీకుమార్‌ వాదనల్లో ప్రాథమిక సాక్ష్యాలున్నాయని భావిస్తున్నామని, కనీసం కొంత మందినైనా తొలగించాల్సిందేనని హైకోర్టు పేర్కొంది. టీటీడీ భవనం కలెక్టరేట్‌ అవసరాలకు వాడుకుంటే..విధానపరమైన నిర్ణయం కాబట్టి సమర్థించామని కోర్టు తెలిపింది. కానీ నేరచరిత్ర ఉన్న సభ్యులు పాలకవర్గంలో ఉండొద్దని సూచించింది. ఏప్రిల్‌ 19న వాదనలు వింటాం.. అదే రోజు నిర్ణయం కూడ తీసుకుంటామని హైకోర్టు తెలిపింది. ఇక ఎట్టి పరిస్థితుల్లో మినహాయింపులు ఉండబోవని కోర్టు స్పష్టం చేసింది

*రేపు సాయంత్రం గవర్నర్ విశ్వభూషన్‌తో సీఎం జగన్ సమావేశం కానున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి గవర్నర్‌కు వివరించనున్నారు. సీఎం జగన్ కేబినెట్ విస్తరణపై కూడా చర్చించనున్నారు. గవర్నర్‌కు సీఎం జగన్ ఉగాది శుభాకాంక్షలు తెలపనున్నారు

*రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ శాఖ గౌరవ చైర్మన్ గా విశ్రాంత ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రాను తెలంగాణ రాష్ట గవర్నర్ అండ్ రెడ్క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ నియమించారు. ఉమ్మడి రాష్ట్రంలో పలు కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన రెండున్నరేళ్ల క్రితం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాతో పదవి విరమణ చేశారు. ఈ సందర్బంగా గురువారం రోజున రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ శాఖ ప్రధాన కార్యాలయం లో పదవి బాధ్యతలు తీసుకున్నారు.ఈ కార్యక్రమం లో వరంగల్ అర్బన్ జిల్లా నుండి రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పి. విజయచందర్ రెడ్డిరాష్ట్ర పాలకవర్గ సభ్యులు శ్రీనివాస్ రావు పాల్గొని భద్రకాళి అమ్మవారి చిత్రపటం. ప్రసాదం అందచేసి శుభాకాంక్షలు తెలిపారు.

*భానుడి భగభగలకు భక్తులు తల్లడిల్లుతున్నారు. మాడ వీధుల్లో పాదరక్షలు లేకుండా నడవాలని నిబంధనతో ఇబ్బందులు పడుతున్నారు. ఎండ వేడిమికి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంత తీవ్రతతో మాడ వీధుల్లో సన్‌ప్రూఫ్ పెయింట్‌తో పాటు స్ప్రింక్లర్లు, ట్యాంకర్ల ద్వారా నీటితో రోడ్డును తడిపేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఎండ తీవ్రత పెరిగినా తిరువీధుల్లో టీటీడీ ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

* పదవీ కాలం ముగిసిన 72 మంది సభ్యులకు రాజ్యసభ గురువారం ఆత్మీయ వీడ్కోలు పలికింది.రిటైర్‌ అవుతున్న సభ్యులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు, డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఫొటో సెషన్‌లో పాల్గొన్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఫొటో సెషన్‌లో ఉన్నారు.

*ఈశాన్య రాష్ట్రాలలో ఏఎఫ్ఎస్‌పీఏ పరిధిని కుదిస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏఎఫ్ఎస్‌పీఏ చట్టం పరిధిలోని ప్రాంతాలను కుదిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా గురువారం ప్రకటించారు. ఈ చట్టాన్నిఈశాన్య రాష్ట్రాలలో తిరుగుబాటు దారుల అణిచివేత కోసం తీసుకొచ్చారు. అయితే భద్రతా దళాలు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చట్టం పరిధిలోని ప్రాంతాలను కుదిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఏఎఫ్ఎస్ పీఏ కింద నాగాలాండ్, అసోం, మణిపూర్‌లకు పరిధి తగ్గింపు వర్తించనుంది.

*తమిళనాడులోని వన్నియార్ సామాజిక వర్గానికి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో కల్పించిన 10.5 శాతం రిజర్వేషన్‌ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది.రిజర్వేషన్‌ను రద్దు చేసిన మద్రాస్ హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది.”వన్నీకుల క్షత్రియులను ఒకే గ్రూపుగా వర్గీకరించడానికి గణనీయమైన ఆధారం లేదని, మిగిలిన వారి నుంచి భిన్నంగా పరిగణించాలని మేం భావిస్తున్నాం” అని సుప్రీంకోర్టు జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ బిఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.సుప్రీంకోర్టు గురువారం వెలువరించిన తీర్పు తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది.

*చిత్తూరు జిల్లాలోని మదనపల్లి మున్సిపల్ సమావేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ మహిళా కౌన్సిలర్లపైకి వైస్ చైర్మన్ వెంకట వెంకట చలపతి దూసుకెళ్లారు. మహిళా దినోత్సవం రోజు మహిళా కౌన్సిలర్లను పిలువకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని టీడీపీ కౌన్సిలర్లు ప్రశ్నించారు. సమాధానం చెప్పాల్సిన చైర్మన్ స్థానంలో ఉన్న మనూజ నిశ్శబ్దం వహించారు. ఆమెకు వత్తాసు పలుకుతూ టీడీపీ కౌన్సిలర్ వైపు వైస్ చైర్మన్ దూసుకొచ్చారు. దీంతో సమావేశంలో గందరగోళం నెలకొంది.

*ఏపీలో ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములకు రక్షణలేదని మాజీమంత్రి చినరాజప్ప ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అర్బన్ ల్యాండ్ సీలింగ్ తెరపైకి తెచ్చి దోపిడీకి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. విద్యుత్‌ ఛార్జీల పెంపుతో ప్రజలపై భారం మోపాడం దారుణమన్నారు. సీఎం జగన్‌ అసమర్ధ నిర్ణయాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చినరాజప్ప తెలిపారు.

*ఆలయాల్లో టికెట్లు, ప్రసాదాలపై అధిక ధరలతో భక్తులను దోచుకుంటున్న దందాలకు సంబంధించి పలు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్‌ సర్కార్‌ సీరియస్‌ అయ్యింది. అధిక ధరలకు కళ్లెం వేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. టీటీడీలో అనుసరిస్తున్న పద్ధతులే ఇకపై అన్ని ఆలయాల్లోనూ పాటించాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు.. అన్ని ఆలయాల్లో విజిలెన్స్‌ తరహా స్క్వాడ్‌లు ఏర్పాటు చేయడంతో పాటు వీలైనంత మేర ఎలక్ట్రానిక్‌ డిస్పెన్సరీలు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయింది.

*తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీం కోర్టు గట్టి షాకిచ్చింది. వన్నియార్‌ కమ్యూనిటీకి కేటాయించిన 10.5 శాతం అంతర్గత రిజర్వేషన్‌ చెల్లదని, ఇందుకోసం రూపొందిచిన చట్టాన్ని రద్దు చేస్తూ గురువారం ఆదేశాలు ఇచ్చింది. ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందంటూ తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది బెంచ్‌.ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో వన్నియార్‌ కమ్యూనిటీకి 10.5 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది ప్రభుత్వం. ఇందుకోసం స్టాలిన్‌ ప్రభుత్వం 2021లో ప్రత్యేక చట్టం కూడా తీసుకొచ్చింది. అయితే ఓబీసీ కోటాలో ఈ రిజర్వేషన్‌ రాజ్యాంగబద్ధం కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అత్యంత వెనుకబడిన తరగతుల(MBC) కోసం 20 శాతం కోటా ఉండగా.. అందులో 10.5 శాతం వన్నియార్‌ కమ్యూనిటీకి వర్తింపజేస్తూ 2021 తమిళనాడు యాక్ట్‌ను తీసుకొచ్చింది అక్కడి ప్రభుత్వం. ఈ క్రమంలో అభ్యంతరాలు వ్యక్తంకాగా.. తమిళనాడు యాక్ట్‌ 2021ను కొట్టేస్తూ ఇంతకు ముందు మద్రాస్‌ హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. తాజాగా చట్టాన్ని రద్దు చేయాలంటూ మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులనే సమర్థించింది సుప్రీం కోర్టు. జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వరావు, బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెల్లడించింది. MBCలలో వన్నియార్‌లను ప్రత్యేక సమూహంగా పరిగణించాల్సిన డేటాను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, తద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 14, 16లకు ఈ చట్టం వ్యతిరేకంగా ఉంది, అందుకే ఈ చట్టాన్ని రద్దు చేస్తున్నామని ఈ సందర్భంగా బెంచ్‌ వ్యాఖ్యానించింది. చట్టాలు చేసుకునే హక్కు చట్ట సభలకు ఉన్నా.. కుల ఉప తరగతులను ప్రభావితం చేసే విధంగా రాష్ట్రాలకు ఉండబోదని బెంచ్‌ పేర్కొంది.

*గోవా ప్రజలకు ఏడాదికి మూడు ఎల్పీజీ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ శాసనసభలో చెప్పారు. దీనికోసం 2022-23 గోవా బడ్జెట్ లో రూ.40కోట్లను కేటాయిస్తున్నట్లు సీఎం చెప్పారు. రెండోసారి సీఎంగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన ప్రమోద్ సావంత్ 2022-23 బడ్జెట్ ను అసెంబ్లీకి సమర్పించారు. గోవా ప్రజల శ్రేయస్సు కోసం తాను సంక్షేమ, అభివృద్ధి బడ్జెట్ ను ప్రవేశపెట్టానని సీఎం సావంత్ ట్వీట్ చేశారు.

*తిరుమలలో ఏనుగుల (Elephants) మంద కలకలం సృష్టిస్తున్నది. ఏనుగుల మంద గత నాలుగురోజులుగా పాపవినాశనం రహదారి వెంట సంచరిస్తున్నాయి. పాపవినాశనంలోని పార్వేట మండపం వద్ద తిరుగుతున్నాయి. ఆకాశగంగ ప్రాంతంలో రోడ్లపైకి వచ్చిన ఏనుగులు వాహనదారులను వెంబడించాయి. దీంతో భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు. అయితే ఏనుగులను అడవిలోకి మళ్లించేందుకు టీటీడీ సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలు చేస్తున్నారు. తిరుమల వైపునకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. తిరుపతిలో ఇటీవల ఏనుగుల తరచూ సంచరిస్తున్నాయి

*గుంటూరు జిల్లా వినుకొండ ఎసిబి వలలో మేళ్ళవాగు విఆర్ఓ వినుకొండనియోజకవర్గం బొల్లాపల్లి మండలం మేళ్ళవాగు లో లింగాల నాగభూషణం కు చెందిన 35 ఎకరాల పోలానికి పాసు పుస్తకాల నిమిత్తం 3,50,000/- లక్షలు డిమాండ్ చేసిన విఆర్ఓ అమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, లక్ష రూపాయలు ఇస్తూ ఎసిబి అధికారులకు పట్టించిన నాగభూషణం.

*అమెరికాలో నేవీ విమానం (Naval aircraft) కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు క్షేమంగా బయటపడగా, మరొకరు గల్లంతయ్యారు. యూఎస్‌ నేవికి చెందిన ఓస్ప్రే అని భారీ విమానం బుధవారం రాత్రి 7.45 గంటల సమయంలో వర్జీనియాలోని అకొమాక్‌ కౌంటీలో ఉన్న చింకోటీగులోని ఓ నదిలో కుప్పకూలింది. దీంతో ఇద్దరు కిందికి దూకేయగా, మరొకరు తప్పిపోయారని అధికారులు తెలిపారు. వారిద్దరికి కాళ్లు విరిగిపోయాయని చెప్పారు. తప్పిపోయిన సైనికుడి కోసం కోస్ట్‌గార్డు సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారని వెల్లడించారు. అయితే ప్రమాద సమయంలో విమానంలో ఎంత మంది ఉన్నారనే విషయంలో స్పష్టతలేదని పేర్కొన్నారు.

*కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు విదేశాలకు వెళ్ళేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతులు ఇచ్చింది. డీకే శివకుమార్‌పై మనీలాండరింగ్‌ కేసులు ఉన్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఇప్పటికే అతడిని అరెస్టు చేసి తిహార్‌ జైలుకు పంపింది. 2019 అక్టోబర్‌లో బెయిలు మంజూరు చేసింది, కానీ విదేశాలకు వెళ్ళరాదనే నిబంధనలతో పాటు మరిన్ని ఆంక్షలు కొనసాగుతుండేవి. కాగా విదేశాలకు వెళ్ళేందుకు అనుమతులు కోరుతూ డీకే శివకుమార్‌ తరుపు న్యాయవాది మాయాంక్‌ జైన్‌ ఇటీవల దాఖలు చేసిన పిటీషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణలు సాగాయి. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు వెళ్ళేందుకు అనుమతులు ఇస్తూ న్యాయమూర్తి ఆశామెనన్‌ బుధవారం తీర్పునిచ్చారు. మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 6వ తేదీ దాకా దుబై, అబుదాబీ వెళ్ళేందుకు వీలు కల్పించినట్లు అయ్యింది. డీకే శివకుమార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ ఎమ్మెల్యే. ఏడుసార్లు ఎమ్మెల్యేగాను పలుశాఖల మంత్రులుగాను వ్యవహరించారు. ప్రస్తుతం కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగాను, శాసనసభ్యుడిగాను వ్యవహరిస్తున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మూడేళ్ళ కిందట బెంగళూరుతో పాటు ఢిల్లీలోని ప్లాట్‌లోను దాడులు చేసింది. ఢిల్లీలోనే అధికారులు అప్పట్లో అరెస్టు చూపారు. ఇప్పుడు బెయిల్‌ కూడా ఢిల్లీ హైకోర్టు ద్వారానే పొందారు. కీలకమైన ఈడీ కేసులో విదేశీ పర్యటనకు అనుమతివ్వడంపై కాంగ్రెస్‌ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన కేసులో కాస్త ఊరట లభించిం దని చెప్పవచ్చు.

*తెలంగాణలోని మత్స్యకార సొసైటీ సభ్యులకు ప్రభుత్వం ఉగాది కానుక ఇచ్చింది. చేపల చెరువు లీజును ప్రస్తుతం ఉన్న ధరలకే కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు చేసిందని రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో మంత్రి తలసాని ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. భేటీలో ప్రస్తుతం ఉన్న లీజు ధరలను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జీవో 268 ద్వారా పంచాయతీరాజ్ శాఖకు చెందిన చెరువుల్లో చేపల పెంపకం, వేటపై యాజమాన్య హక్కులను మత్స్యశాఖకు బదలాయిస్తూ ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. గతంలో శాశ్వతంగా నీరు నిల్వ ఉండే ఒక హెక్టార్‌కు రూ.400, ఎక్కువ కాలం నీరు నిల్వ ఉంటే హెక్టార్ రూ.200, తక్కువ కాలం పాటు నీరు నిల్వ ఉంటే హెక్టార్‌కు రూ.60 చొప్పున లీజు వసూలు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం అదే లీజు మొత్తాన్ని వసూలు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, మత్స్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యాను మంత్రి ఆదేశించారు.మత్స్యకారుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూతను అందిస్తూ ప్రోత్సహిస్తుందని అన్నారు. మత్స్యకారుల ఆర్థిక పరిస్థితిని పరిగణలో ఉంచుకొని, ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారిని ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం అందించేందుకు ప్రస్తుతం ఉన్న ధరలనే కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంతో 4,793 మత్స్య సొసైటీల్లోని 3.54 లక్షల మంది మత్స్యకారులు లబ్ధి చేకూరుతుందని మంత్రి వివరించారు.

*పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని సీతమ్మ ధార విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద వామపక్షాలు నిరసనకు దిగాయి. పెంచిన ధరలు తగ్గించాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచి ఆర్థిక భారం మోపుతున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి తోడు కరెంటు చార్జీలతో సామాన్యుడిని దోచుకుంటున్నారంటూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

*ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 98 కిలోల చేప ఇది.. బెంగళూరులోని కాక్స్‌టౌన్‌ మార్కెట్‌లో బుధవారం 8 అడుగుల పొడవు, 98 కిలోల స్క్వౌర్డ్‌ ఫిష్‌ అమ్మకానికి రావడంతో స్థానికులు ఆసక్తిగా వీక్షించారు.

*దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సీఎం కేసీఆర్‌ కులవృత్తులను ప్రోత్సహిస్తున్నారని ఆబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మరుగున పడుతున్న కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకురావాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో రూ.25 కోట్లతో నిర్మిస్తున్న నీరా కేఫ్‌ పనులను శ్రీనివాస్‌ గౌడ్‌ పరిశీలించారు.

*వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరం (2022–23) తొలి విడత పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మే నెలలో అందించే ఏర్పాటు చేస్తోంది. వరుసగా నాలుగో ఏడాది రైతులకు ప్రభుత్వం ఈ పథకాన్ని అందిస్తోంది. ఈసారి మరింత మందికి లబ్ధి చేకూర్చేలా కార్యాచరణ సిద్ధం చేసింది.

*కారు అద్దం పై పోలీస్‌ అని స్టికర్‌ ఉన్నందుకు మహంకాళి ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా విధించారు. బుధవారం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ రోడ్డులో తనిఖీలు చేస్తున్న పోలీసులు కారుకు బ్లాక్‌ ఫిలింతోపాటు పోలీస్‌ స్టికర్‌ ఉండటంతో రూ. 1,400 చలాన్‌ వేశారు. హన్మకొండలోని సుబేదారి పోలీస్‌ స్టేషన్‌లో తన తండ్రి పనిచేస్తున్నట్టు వాహనదారుడు తెలిపాడు.

*రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ శాఖ గౌరవ చైర్మన్ గా విశ్రాంత ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రాను తెలంగాణ రాష్ట గవర్నర్ అండ్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ నియమించారు. ఉమ్మడి రాష్ట్రంలో పలు కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన రెండున్నరేళ్ల క్రితం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాతో పదవి విరమణ చేశారు. ఈ సందర్బంగా గురువారం రోజున రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ శాఖ ప్రధాన కార్యాలయం లో పదవి బాధ్యతలు తీసుకున్నారు.ఈ కార్యక్రమం లో వరంగల్ అర్బన్ జిల్లా నుండి రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పి. విజయచందర్ రెడ్డి, రాష్ట్ర పాలకవర్గ సభ్యులు శ్రీనివాస్ రావు పాల్గొని భద్రకాళి అమ్మవారి చిత్రపటం. ప్రసాదం అందచేసి శుభాకాంక్షలు తెలిపారు.

*వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల బృందంపై చెప్పుల దాడి జరిగింది. వైఎస్సార్టీపీ రూపొందించిన మాట ముచ్చట కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి పరిధిలోని నాగారానికి షర్మిల వెళ్లారు.ఈ పందర్భంగా షర్మిలను చూసిన టీఆర్ఎస్ కార్యకర్తలు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేవారు. అలాగే పలువురు షర్మిల బృందంపై చెప్పులు విసిరేశారు.

*పెట్రోలు, డీజిల్ ధరలు గురువారం మరోసారి పెరిగాయి. బుధవారం నాటి ధరల కంటే ఈరోజు పెట్రోల్, డీజిల్‌లపై లీటరుకు 80 పైసలు పెరిగింది. ఇంధన ధరల్లో గురువారం మార్పుతో ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.101.81కి అమ్ముడవుతోంది. మరోవైపు దేశ రాజధానిలో డీజిల్ 80 పైసలు పెరిగి లీటరుకు రూ. 93.07గా ఉంది.37 రోజుల విరామం తర్వాత చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇంధన ధరల రోజువారీ సవరణను ప్రారంభించింది. 2022 మార్చి 22వతేదీ నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుపై రూ. 6.40 చొప్పున పెంచారు. పెట్రోల్, డీజిల్ ధరలు చివరి సవరణ గత ఏడాది నవంబర్ 4వతేదీన జరిగింది.

*ఉగాదికి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 4వ వరకు వీటిని నడపనుంది. కాకినాడ-సికింద్రాబాద్‌(07593) 31న రాత్రి 8.45కి, సికింద్రాబాద్‌-కాకినాడ (07594) 1న రాత్రి 8.45గంటలకు, కాకినాడ-తిరుపతి(07595) 2న రాత్రి 9.00గంటలకు, తిరుపతి-సికింద్రాబాద్‌(07596) 3న రాత్రి 7.50కి బయలుదేరుతాయి. గుంటూరు-హుబ్లీ(07591)3న సాయంత్రం 4.30గంటలకు, హుబ్లీ-గుంటూరు(07592)4న ఉదయం 9.25కి, సికింద్రాబాద్‌-తిరుపతి(07597) 1న రాత్రి 8.15కి, తిరుపతి-కాకినాడ(07598) 2న రాత్రి 9.55గంటలకు, కాకినాడ టౌన్‌-వికారాబాద్‌(07599) 3న రాత్రి 8.45కు, మచిలీపట్నం-తిరుపతి(07095) 1న సాయంత్రం 6.25గంటలకు, తిరుపతి -మచిలీపట్నం(07096) 2న రాత్రి 10.15గంటలకు బయలు దేరతాయని అధికారులు తెలిపారు. కాగా.. సికింద్రాబాద్‌-మహబూబ్‌నగర్‌ల మధ్య రైల్వే డబ్లింగ్‌, విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఉందానగర్‌-గొల్లపల్లి నడుమ విద్యుదీకరించిన లైన్లు కూడా వినియోగంలోకి వచ్చాయన్నారు. డబ్లింగ్‌ పూర్తితో హైదరాబాద్‌ నుంచి మహబూబ్‌నగర్‌, కర్నూలు, అనంతపురం, కడప, బెంగుళూరు, తిరుపతి తదితర ప్రాంతాలకు రైళ్ల రాకపోకలు మెరుగుపడతాయన్నారు.

*మచిలీపట్నం పెదయాదర గ్రామంలో జనసేన పార్టీ బ్యానర్ల గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. జనసేన పార్టీ బ్యానర్లు చించడంపై జనసేన నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పెదయాదర గ్రామ సర్పంచ్ గల్లా తిమొతి మాట్లాడారు. జనసేన పార్టీని రాజకీయంగా ఎదుర్కొవాలి తప్ప ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి నిస్వార్ధ ప్రజా నాయకుడి బ్యానర్లు చించచడం ఏంటి? అని ప్రశ్నించారు. ప్రజలకు మంచి చేయడంలో పోటీ పడాలి కానీ ఇలా చిల్లర రాజకీయాలు చేయడం సరికాదన్నారు. జనసేన పార్టీ బ్యానర్లు చించుతూ ఉంటే తమ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని ఆయన హెచ్చరించారు. ఈ ఘనటనపై తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.

*ఏప్రిల్‌ 2న కాల సర్పదోషం ఉందని ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం జగన్‌కు అధికారులు సూచించారు. దీంతో కొత్త జిల్లాల ప్రారంభోత్సవం వాయిదా పడింది. దీంతో కొత్త జిల్లాల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఏప్రిల్‌ 4కి మార్చారు. ఏప్రిల్‌ 7న కేబినెట్‌ సమావేశం ఉంటుందని జగన్‌ తెలిపారు. అలాగే వివిధ అంశాలపై ప్రతిపాదనలను పంపాలని అధికారులను సీఎం ఆదేశించారు.

*విశాఖపట్నం జిల్లా పరవాడ మండలం సింహాద్రి సూపర్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం (ఎన్టీపీసీ)లో 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మొదటి యూనిట్‌లో విద్యుత్‌ ఉత్పత్తికి బుధవారం అంతరాయం ఏర్పడింది. ఈ యూనిట్‌కు సంబంధించి బాయిలర్‌ ట్యూబ్‌లకు రంధ్రాలు ఏర్పడడంతో ఉత్పత్తి అర్ధంతరంగా నిలిచిపోయింది. అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. మూడు రోజుల్లోగా ఉత్పత్తిని ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. మిగతా 2, 3, 4 యూనిట్లలో ఉత్పత్తి పూర్తిస్థాయిలో జరుగుతుందని అధికారులు తెలిపారు.

*జాతీయ స్థాయి సాంస్కృతిక ఉత్సవాలకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. రాష్ట్రీయ సాంస్కృతిక మహోత్సవం పేరుతో కేంద్ర సాంస్కృతిక శాఖ ఏప్రిల్‌ 1 నుంచి 3 వరకు సాంస్కృతిక సంబురాలను నిర్వహించనుంది. అందుకు దోమల్‌గూడలోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదిక కానుంది. ఇందులో భాగంగా.. మూడు రోజుల పాటు రోజూ సాయంత్రం 5.30 నుంచి రాత్రి 10.30 గంటల వరకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సంబురాలను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఏప్రిల్‌ 1న ప్రారంభించనున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, సినీనటుడు చిరంజీవి, గవర్నరు తమిళిసై సౌందర్‌ రాజన్‌, హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, తమిళనాడు గవర్నరు ఆర్‌ఎన్‌ రవి తదితరప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ సాంస్కృతిక ఉత్సవాలకు సీఎం కేసీఆర్‌ను కూడా ఆహ్వానించినట్లు సమాచారం.

*రాష్ట్రంలోని బార్ల లైసెన్స్‌ ఫీజు ద్వారా ప్రభుత్వానికి రూ.490 కోట్ల ఆదాయం వచ్చింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.528 కోట్ల ఆదాయం రావలసి ఉంది. అయితే, కరోనా నేపథ్యంలో బార్లకు ఒక నెల లైసెన్స్‌ ఫీజును ప్రభుత్వం మాఫీ చేసింది. దాంతో రూ.38 కోట్ల రాబడి తగ్గింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1172 బార్లు ఉన్నాయి. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 587 బార్లు ఉండటంతో, ఇక్కడ రూ.251 కోట్లు జమైంది. ఈ నెల 31 గురువారంతో బార్ల లైసెన్స్‌ ఫీజు చెల్లించే గడువు ముగుస్తుందని ఎక్సైజ్‌ శాఖ తెలిపింది.

*పాకిస్థాన్ దేశ ప్రధాని అభ్యర్థిగా ఆ దేశ ప్రతిపక్ష నేత షెహబాజ్ షరీఫ్ బరిలోకి దిగుతున్నారు. ప్రస్థుత పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాసం ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆయన పదవి నుంచి వైదొలగాలని ఒత్తిడి పెరిగింది.పాక్ నేషనల్ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ మెజారిటీ కోల్పోయారు కాబట్టి షెహబాజ్ షరీఫ్ త్వరలో ప్రధానమంత్రి అవుతారని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ చెప్పారు.మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడైన షెహబాజ్ 2018 ఆగస్టు నెల నుంచి నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్నారు. ఇతను 1988లో పంజాబ్ ప్రావిన్షియల్ అసెంబ్లీకి, 1990లో నేషనల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

*ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఇంటర్‌ లేదా 12వ తరగతిలో మ్యాథ్స్‌ను తప్పనిసరిగా చదివుండాలనే నిబంధనను అఖిల భార త సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) సరళత రం చేసింది. ఇంజనీరింగ్‌, టెక్నాలజీకి సంబంధించి న మొత్తం 29 డిప్లొమా/యూజీ కోర్సుల్లో 10 కోర్సులను మ్యాథ్స్‌ అర్హత నుంచి మినహాయించిం ది. ఈ మేరకు 2022-23 విద్యాసంవత్సరానికి నూ తన మార్గదర్శకాలను ప్రకటించింది. వీటిని అనుసరించి.. డిగ్రీలో ఆర్కిటెక్చర్‌, బయోటెక్నాలజీ, ఫ్యాష న్‌ టెక్నాలజీ వంటి కోర్సులు చేయడానికి మ్యాథ్స్‌ తప్పనిసరి కాదు. అలాగే పలు కోర్సులకు కెమిస్ట్రీని మినహాయించింది. కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌, ఎలకా్ట్రనిక్స్‌ ఇంజనీరింగ్‌ కోర్సులు చే యాలంటే ఇంటర్‌లో కెమిస్ట్రీ తప్పనిసరిగా చదివుండాల్సిన అవసరం లేదు. అంతేగాక.. మరిన్ని సబ్జెక్టులను ఇంజనీరింగ్‌ అర్హతల పరిధిలోకి ఏఐసీటీఈ తీసుకొచ్చింది

*జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎ్‌ఫడీసీ) లోకి నాలుగు సినీ మీడియా యూనిట్లను కేంద్ర ప్రభుత్వం విలీనం చేసింది. డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ (డీఎ్‌ఫఎఫ్‌), నేషనల్‌ ఫిల్మ్‌ ఆర్కైవ్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఎ్‌ఫఏఐ), భారతీయ బాలల చలనచిత్ర సంఘం (సీఎ్‌ఫఎ్‌సఐ), ఫిల్మ్స్‌ డివిజన్‌లను ఎన్‌ఎ్‌ఫడీసీలోకి విలీనం చేశామని కేంద్రం ప్రకటించింది. ఎన్‌ఎ్‌ఫడీసీని బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.

*లఖింపూర్‌ ఖేరి కేసులో యూపీ సర్కారు తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్ర కుమారుడు ఆశిష్‌ మిశ్రకు ఇచ్చిన బెయిల్‌ను రద్దుచేయాలన్న సిట్‌ నివేదిక, లేఖలను ఏం చేశారని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సర్కారును నిలదీసింది. దీనిపై ఏప్రిల్‌ నాలుగో తేదీ లోపు స్పందించాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ ఆదేశించింది. యూపీలోని లఖింపూర్‌ ఖేరిలో వాహనం కిందపడి 8 మంది మరణించిన ఘటనలో అరెస్టు అయిన ఆశిష్‌ మిశ్రకు అలహాబాద్‌ హైకోర్టు ఇటీవల బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఈ ఘటనపై దర్యాప్తునకు సిట్‌ను నియమించి కేసును పర్యవేక్షణ చేస్తోంది

*కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రొటోకాల్ వార్‌ ముదురుతోంది. జిల్లాలో జరిగిన జాతీయ సాంస్కృతిక మహోత్సవాలలో ప్రోటోకాల్ గ్యాప్ బయటపడింది. మహోత్సవాలకు విచ్చేసిన గవర్నర్‌, కేంద్రమంత్రికి స్థానికనేతలు స్వాగతం పలకని పరిస్థితి. దీంతో ప్రొటోకాల్‌ పాటించడంలేదని, వివిధ రాష్ట్రాల కలయిక జరిగిన చోట అవమానపర్చారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున జరిగిన ఈ వేడుకలకు టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు గైర్హాజరయ్యారు. ఇటీవల మేడారం ఉత్సవాల్లోనూ ప్రొటోకాల్‌ వివాదం తలెత్తిన విషయం తెలిసిందే.

*తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం చిన్నశేష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆల‌య నాలుగు మాడ వీధుల్లో వాహనసేవను వైభవంగా నిర్వహించారు. అనంతరం కల్యాణ మండపంలో శ్రీసీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామివారి ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంల‌తో అభిషేకం చేశారు.