ప్రపంచీకరణ పెత్తనంతో తెలుగుతనం విలవిలలాడుతోంది. సెల్ఫోన్లు, కంప్యూటర్ల వినియోగంతో తెలుగు భాష నలిగిపోతోంది. ఇక ఆంగ్లమాధ్యమంతో మన తెలుగు భాష వెలవెలబోతోంది. అయితే ఈ మధ్యకాలంలో తెలుగు భాషను సంస్కరించాలని కొందరైతే, ఉద్ధరించాలని మరి కొందరు చేస్తున్న కృషిలో సాహిత్య పత్రికలు తమ వంతు భాషామ తల్లికి సేవ చేయడం అభినందనీయం.
ఇక ఈ తరం వారికి మన తెలుగు దినములు, నెలలు ఇంకా తెలుగు సంవత్సరాల పేర్లు, తిథులూ, నక్షత్రాలు, పండుగలు, పబ్బాలు, పర్వదినాల గురించి అవగాహన లేకపోవడం అందుకు తగిన సమాచారం తెలుసుకోకపోవడం ఒక కారణం.
**ఇటీవల కొన్ని పత్రికలు తెలుగు సంస్కృతిని పరిరక్షించాలని, తెలుగు భాషను నలుగురికీ పంచాలనే ఉద్దేశంతో తెలుగు భాషయందు అభిమానం పెంచుకునే వారికి తగినంత అధ్యయనం చేసుకోవడానికి నిష్ణాతులైన వారి రచనలు ప్రచురించడం హర్షణీయం. తెలుగు ప్రాంతం వారికి ఉపయుక్తంగా ఉండుటకై ‘కాలమానిని’ తిథులు, వారములు, మాసములు, ఆయా మాసాలలో వచ్చు పర్వదిన విశేషాలను సూక్ష్మంలో మోక్షంలా తెలియచేయాలనుకోవడం సత్ సంకల్పమనుకుంటా.కనురెప్పపాటు కాలమును సెకను, 60 సెకనులు, ఒక నిమిషం, 60 నిమిషాలు. ఒక గంట, 12 గంటలు పగలనియు పగలు తరువాత 12 గంటలు రాత్రియనియు. ఒక రోజు అనగా 24 గంటలు, ఏడు రోజులు ఒక వారమనియు, రెండు వారములు ఒక పక్షమనియు, నెలకు రెండు పక్షములు లేదా ముప్పది రోజులనియు. పనె్నండు నెలలు ఒక సంవత్సరమనియు లేదా 365 దినములు. అంటే సంవత్సరమునకు 365 లేదా 366 రోజులు. 3 కాలములు, ఆరు ఋతువులు 24 పక్షములు, 52 వారాలు, పక్షములు రెండు శుక్ల పక్షము 15 రోజులు, తిథులు శుద్ధ పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి. దీనిని శుక్ల పక్షము అని అంటారు. ఇక కృష్ణ పక్షము బహుళ పక్షము 15 రోజులు తిథులు బహుళ పాడ్యమి మొదలు బహుళ అమావాస్య. ఆ పిదప ఏడు రోజులయితే వారము.
తెలుగు పేరు సంస్కృతం నామం
1.ఆదివారం భానువారం
2.సోమవారం ఇందువారం
3.మంగళవారం భౌమవారం
4.బుధవారం సౌమ్యవారం
5.గురువారం బృహస్పతి వారం
6.శుక్రవారం మందవారం
7.శనివారం మందవారం
***ఆయా వారాలలో ఆయా గ్రహాధిపత్యం వహిస్తాడు.
రాసులు -12: 1.మేషము 2.వృషభం 3.మిథునం 4.కర్కాటకం 5.సింహము 6.కన్య 7.తుల 8.వృశ్చికం 9.్ధనస్సు 10.మకరం 11.కుంభం 12.మీనం
నక్షత్రాలు -27: అశ్విని, భరణి, కృత్తిక, రోహిణీ, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశే్లష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషము, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి.
కాలములు: మూడు
వేసవి కాలము: చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసములు
వర్షాకాలము: శ్రావణ, భాద్రపద, ఆశ్వీయుజ, కార్తీ మాసాలు
చలికాలము: మార్గశి, పుష్య, మాఘ, ఫాల్గుణ మాసాలు
ప్రతి రెండు నెలలకు ఒక ఋతువు, వసంత, గ్రీష్మ, వర్ష, శరదృతువు, హేమంత, శిశిర ఋతువులు.
ఇక కాలమాన చక్రములు ప్రతి అరవది సంవత్సరములు వరుసగా 1.ప్రభవ 2.విభవ 3.శుక్ల 4.ప్రమోదూత 5.ప్రజాపతి 6.అంగీరస 7.శ్రీముఖ 8.్భవ 9.యువ 10.్ధతు 11.ఈశ్వర 12.బహుధాన్య 13.ప్రమాధి 14.విక్రమ 15.వృష 16.చిత్రభాను 17.స్వభాను 18.తారణ 19.పార్థివ 20.వ్యయ 21.సర్వజిత్ 22.సర్వధారి 23.విరోధి 24.వికృతి 25.కర్ణ 26.నందన 27.విజయ 28.జయ 29.మన్మథ 30.దుర్ముఖీ 31.హేవిళంబి 32.విళంబి 33.వికారి 34.శార్వరి 35.ప్లవ 36.శుభకృత్, 37.శోభకృత్ 38.క్రోధ 39.విశ్వావసు 40.పరాభవ 41.ప్లవంగ 42.కీలక 43.సౌమ్య 44.సాధారణ 45.విరోధికృత 46.పరీధావి 47.ప్రీమాదీచ 48.నంద 49.రాక్షస 50.నల 51.పింగళ 52.కాళయుక్తి 53.సిద్దార్థి 54.రౌద్రి 55.దుర్మతి 56.దుందుభి 57.రుధిరోద్గారి 58.రక్తాక్షి 59.క్రోధన 60.అక్షయ
మన దేశంలో ముఖ్యమైనవి 1.శాలివాహన శకం 2.విక్రమార్క శకము. శాలివాహన శకం దక్షిణ దేశంలోను, విక్రమార్క శకం ఉత్తర దేశం వాడుతున్నప్పటికీ, భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత విజ్ఞులు, శాస్తజ్ఞ్రులు ఒకే జాతీయ శకము యావద్భారతానికి ఉండాలని శాలివాహన శకమును నిర్ణయించారు.
తెలుగు ప్రాంతంలో భార్గవ పంచాంగంతోపాటు గౌరీ పంచాంగమునకు ప్రాధాన్యత ఇస్తుంటారు.
***చైత్రమాసం
తెలుగువారి తొలి పండుగ ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగ. ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం అందరికీ తెలిసినదే. ఇదే మాసంలో మరో పర్వదినం శ్రీరామ నవమి జరుపుకుంటాం. ఇదే రోజున శ్రీరామ జన్మము, సీతారాముల కళ్యాణం, రావణాసురుని వధ, శ్రీరామ పట్ట్భాషేకం. ఇది ప్రతి భారతీయులకు ముఖ్యంగా తమ అభిమాన అందాల రాముని గుణగణాలను కీర్తించుకుంటూ మరువరాని సంతోషకరమైన రోజు. భద్రాచల రాముని కళ్యాణం లోక ప్రసిద్ధి.
***వైశాఖ మాసంలో
శుద్ధ చతుర్దశి నాడు శ్రీ నారసింహ స్వామి జయంతి జరుపుకుంటాం. పిదప వైశాఖ బహుళ దశమి నాడు శ్రీరామ భక్తాగ్రేసరుడైన హనుమ జయంతిని జరుపుకుంటాం.
శ్రావణ మాసంలో:
ఈ మాసము మహిళలకు ఎంతో ప్రత్యేకమైన మాసం. మంగళగౌరి నోములు, లక్ష్మి వ్రతాలు, ఇంకను ద్వాపర యుగంలో రోహిణీ నక్షత్రయుక్త శ్రావణ బహుళ అష్టమినాడు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణునిగా జన్మించాడు. కావున శ్రీకృష్ణాష్టమి, ఉట్ల పండుగను జరుపుకుంటాం.
***భాద్రపద మాసంలో
భారతీయుల తొలి పండుగ వినాయక చవితి వస్తుంది. ఈ పండుగ తరువాత మిగతా పండుగలు వస్తాయి కనుక తొలి పండుగ, గణేష నవరాత్రి ఉత్సవాలను భాద్రపద శుక్ల చవితి రోజున ఆరంభించి నవరాత్రుల తదనంతర శోభాయాత్రలో ఘనంగా జరిపి భక్తిశ్రద్ధలతో జలంలో నిమజ్జనం చేస్తాం. మహారాష్టల్రో ముంబాయి పట్టణం ప్రసిద్ధి కెక్కినది.బహుళ తదియ నాడు వచ్చే పండుగ ఉండ్రాళ్ల తద్దెయనియు ఆశ్వీయుజ బహుళ తదియ నాడు వచ్చే పండుగను అట్ల తద్దె అంటారు. ఈ రెండు పండుగలు గౌరమ్మకు ప్రీతికరమైనవి.
***ఆశ్వీయుజ మాసంలో
శుద్ధ పాడ్యమిలో దేవీ నవరాత్రుల కలశ స్థాపన జరుగుతుంది. దీనిని శరన్నవరాత్రులు లేదా దసరా నవరాత్రులు ఇంకను అత్యంత వైభవం బతుకమ్మ పండుగ సంబరాలు కూడా జరుపుకుంటారు. యావద్భారతంలో ముఖ్యంగా మైసూర్ దసరా వేడుకలు చూసి తీరవలసిందే. ఆయుధ పూజ శమిపూజ ‘బంగారం’ జమ్మి ఆకు మిత్రులకు స్నేహితులకు హితులకు సన్నిహితులకు ఇచ్చి పుచ్చుకోవడంలో ఆనందపడతారు. ఇదే నెలలో వచ్చే అట్లతద్దె, ఉండ్రాళ తద్దె లేదా ఉయ్యాల పండుగ అని గోరింటాకు పండుగ అంటారు.
ఆశ్వీయుజ బహుళ చతుర్దశి అమావాస్య నాడు వస్తుంది. ఇది రెండు రోజుల పండుగ. త్రయోదశినాటి రాత్రి ‘అపమృత్యు’ నివారణ కోసం ప్రమిదలలో నువ్వుల నూనె గానీ, ఆముదంతో గానీ దీపాలు వెలిగించి ఇంటి ముందుంచాలి. నరక చతుర్దశి రోజున సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానం తలకు నూనె రాసుకొని తలస్నానం చేయాలి. మంగళ హారతులు పట్టించుకొని, ఆడపడుచులకు హారతి పళ్లెంలో డబ్బులు వేయాలి. ఇది కూడా స్ర్తిల పండుగే. సత్యభామ నరకాసురునిపై జయించిన కారణంగా విజయ మంగళ హారతులతో టపాసులు, చిచ్చుబుడ్లు, సీమ టపాకాయలతో పండుగ సంబరం జరుపుకొని లక్ష్మిపూజ చేయడం కొత్త ఖాతాపద్దు పుస్తకాలు తెరవడం మార్వాడీ, ఇతర వ్యాపారస్థులకు వస్తున్న సదాచారం నేటికీ కొనసాగుతూనే ఉంది.
***కార్తీకమాస విశిష్టత
కార్తీక దీపారంభం, నాగుల చవితి, నాగుల పంచమి, మతత్రయ ఏకాదశి, క్షీరాబ్ధి ద్వాదశి, కార్తీక పౌర్ణమి, జ్వాలాతోరణం, 33 పున్నముల నోము, సుబ్రహ్మణ్య షష్ఠి ఇత్యాదులు.
***మార్గశిర మాసం
అన్ని మాసములకన్న తలమానికం వంటిది. మార్గశిరీష మాసమంటారు. శ్రీదత్త జయంతి, కోరల పూర్ణిమ పిదప ధనుసంక్రమణంతో ధనుర్మాస మాసారంభం గోదాదేవి రచించిన పాశురములు దీనినే తిరుప్పావై అంటారు. వైష్ణావాలయాల్లో వేకువ జామునే లేచి ఆడ మగ కలిసి తిరుప్పావై ముక్తకంఠంతో రాగయుక్తంగా ఆలపించిన పిదప కట్టెపొంగలి, దద్ద్యోజనం ప్రసార వినియోగాలు జరుగుతాయి. ఇంకను రథసప్తమి రంగవల్లులు వేస్తారు.
***పుష్యమాసంలో
పూర్ణిమకు ముందు వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. దీనినే వైకుంఠ ఏకాదశి రోజు అంటారు. ఈ రోజు శ్రీవిష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టే తన భక్తుల కోసం ప్రత్యేకంగా ఉత్తరద్వారం తెరిపించుకొని గరుడాళ్వారు వాహనం కాగా గోదా (ఆండాళు) సంయుక్తంగా దర్శనమిస్తారు. కాబట్టి భక్తులు సూర్యోదయ పూర్వమే లేచి స్నాన సంధ్యావందానిదులు కార్యక్రమములు ముగించుకొని ఉత్తరద్వార ఆలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకుంటే ఆ పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది గాఢ విశ్వాసం. వివేకానంద జయంతి, తదుపరి భోగి, గోదా కళ్యాణం మకర సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలం, కనుమ, ముక్కనుము, బొమ్మల కొలువు. ఆ తరువాత వాగ్గేయకారుడైన త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం జరుగుతాయి.
***మాఘమాసంలో
మాఘమాసంలో వచ్చే పర్వదినాలు శ్రీపంచమి, సూర్యజయంతి, ధనిష్ఠకార్తె ప్రవేశం, భీష్మాష్టమి, భీష్మ ఏకాదశి, సమ్మక్క సారలమ్మ జాతర, కుంభసంక్రమణం, మహామాఘ మాస పూర్ణిమ స్నానాలు, రామకృష్ణ పరమహంస జయంతి ఈ మాసంలో బహుళపక్ష చతుర్దశి నాడు దీనినే కృష్ణ చతుర్దశి లేదా మహాశివరాత్రిగా శాస్తజ్ఞ్రులు నిర్ణయించినందున శైవ సంప్రదాయం ప్రకారం వేకువజామున లేచి తలస్నానం చేసి పూజా పునస్కారాలు చేసుకొనిన పిదప శివాలయానికి వెల్లి మారేడు దళాలతో శివార్చన, అభిషేకం చేయించి శివకల్యాణం, లింగోద్భవం కనులారగాంచి మొత్తం రాత్రంతా జాగరణం చేసి ఏమీ తినకుండా ఉపవాస దీక్షతో శివపురాణం విన్నచో శివానుగ్రహం కలిగి కైలాస ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు శివపురాణం వక్కాణిస్తున్నాయి.
***ఫాల్గుణ మాసం
ఈ సంవత్సరంలోని చివరి మాసం. ఈ మాసంలో శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు, హోళి పండుగ, వసంతోత్సవం, మతత్రయ ఏకాదశి దీనినే పాప విమోచన ఏకాదశి అంటారు. ఈ వ్రతం ఆచరించిన వారికి ఈ సంవత్సరంలో చేసిన పాపాలు పోతాయని నమ్మకం. చివరిది సర్వ అమావాస్యతో దుర్ముఖి నామ సంవత్సరానికి వీడ్కోలు.