Movies

పరిచయమే అదృష్టం

పరిచయమే అదృష్టం

చిత్రకారుడు శంతను హజారికతో రెండేళ్లుగా ప్రేమాయణాన్ని సాగిస్తున్నది అగ్ర కథానాయిక శృతిహాసన్‌. వీరిద్దరు కలిసి ముంబయిలో సహజీవనం చేస్తున్నారని తెలిసింది. తన లవ్‌ఎఫైర్‌ విషయంలో గోప్యత పాటించే ఈ ముద్దుగుమ్మ తాజాగా ప్రియుడి గురించి స్పందించింది. ఇటీవల శంతనుహజారిక పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో అతన్ని పొగడ్తల్లో ముంచెత్తింది శృతిహాసన్‌. శంతను తనకు పరిచయం కావడమే అదృష్టమని సంబరపడిపోయింది. ‘ఈ ప్రపంచం నీలోని కళను, శక్తిసామర్థ్యాలను చూసి గర్విస్తున్నది. ప్రతి రోజు నిన్ను నేను కొత్తగా తెలుసుకుంటూనే ఉంటా. నీలాంటి వ్యక్తి సహచర్యం లభించినందుకు ఆనందంగా ఉంది’ అని శృతిహాసన్‌ ఆ పోస్ట్‌లో పేర్కొంది. ఈ సందర్భంగా ప్రియుడితో తీసుకున్న కొన్ని ఫొటోల్ని షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ప్రభాస్‌ సరసన ‘సలార్‌’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.