విజయనగర జిల్లా కోవెలమూడి రామాలయంలో శ్రీరామనవమి వేడుకలపై వివాదం రాజుకుంది. హోంమంత్రి సుచరిత సొంత నియోజకవర్గంలో వైసీపీ నేతలు, గ్రామస్తుల మధ్య ఈ వివాదం నెలకొంది. కోవెలమూడి రామాలయానికి వైసీపీ నేతలు తాళాలు వేశారు. ఇదేంటనీ ప్రశ్నించిన గ్రామస్తులపైకి వైసీపీ నేతలు దాడికి దిగారు. దాంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల మధ్య వివాదంతో పోలీసులు గుడికి తాళాలు వేశారు. ఆలయంలో పూజలు చేయాలని తాళాలు అడిగినా పోలీసులు ఇవ్వడం లేదని గ్రామస్తులు అంటున్నారు.నవమి రోజు తామే తలంబ్రాలు పోయాలంటూ వైసీపీ నేతలు పట్టు బట్టారు.అందరం కలిసి పోసుకుందామన్న వైసీపీ నేతలు నిరాకరిస్తున్నారని గ్రామస్తులు చెప్పారు.