Movies

ప్ర‌పంచ‌వ్యాప్తంగా 30దేశాల్లో రిలీజ్ కానున్న – ఆర్ ఆర్ ఆర్

ప్ర‌పంచ‌వ్యాప్తంగా 30దేశాల్లో రిలీజ్ కానున్న – ఆర్ ఆర్ ఆర్

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్. ఈ చిత్రంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ న‌టించారు. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. బాక్సాఫీస్ ను ఈ చిత్రం కొల్లగొడుతోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 570 కోట్లకు పైగా షేర్, రూ. 1,045 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని రామ్ చరణ్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా మరో 30 దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చెప్పారు. అక్టోబర్ లో ఈ సినిమా జపాన్ లో విడుదల అవుతుందని తెలిపారు. జపాన్ ప్రమోషన్స్ కోసం తాను, తారక్, చిత్ర యూనిట్ రెండు రోజుల పాటు ఆ దేశంలో పర్యటిస్తామని చెప్పారు. చైనాలో కూడా ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉందని అన్నారు.