తన కుమార్తె సోనమ్ కపూర్ పట్ల ఎంత గర్వపడుతున్నానో మాటల్లో చెప్పలేనని బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ అన్నారు. ఆయన కుమార్తెగా వెండితెరకు పరిచయమైన సోనమ్ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విషయం ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఆమెది. ఆదివారం సోనమ్ 34వ పుట్టినరోజును జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆమె తండ్రి అనిల్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. ‘హ్యాపీ బర్త్‌డే సోనమ్ కపూర్. నీ పట్ల మేం ఎంత గర్వపడుతున్నామో మాటల్లో చెప్పలేను. నువ్వు ఓ గొప్ప వ్యక్తిగా ఎదిగావు. నిన్ను చూసి ఆశ్చర్యపోతూ, స్ఫూర్తి పొందుతున్నాం. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా నీకు గొప్పగా, విజయవంతంగా ఉండాలి. ఎప్పుడూ నీ స్వభావాన్ని మార్చుకోవద్దు. లవ్ యు’ అంటూ సోనమ్‌తో చిన్నతనంలో, ఇటీవల దిగిన ఫొటోల్ని షేర్ చేశారు.
తనయ గర్వం
Related tags :