*** కావలసినవి: మైదాపిండి: 2 కప్పులు, నెయ్యి: 4 టేబుల్‌స్పూన్లు, ఉప్పు: చిటికెడు, జీడిపప్పుపొడి: అరకప్పు, బాదంపప్పు పొడి:అరకప్పు, యాలకులపొడి: టీస్పూను, బెల్లం తురుము: అరకప్పు, అంజీర్ పేస్టు: పావుకప్పు, ఎండుకొబ్బరి తురుము: 2 టీస్పూన్లు
*** తయారుచేసే విధానం:
* ముందుగా మైదాపిండిని శుభ్రం చేసుకోవాలి. ఓ గిన్నెలో మైదా, ఉప్పు, టీస్పూను నెయ్యి వేసి సరిపడా నీళ్లతో చపాతీపిండిలా కలిపి ఓ గంటసేపు నాననివ్వాలి.
* వేరే గిన్నెలో జీడిపప్పుపొడి, బాదంపప్పుపొడి, అంజీర్‌ముద్ద, ఎండుకొబ్బరి తురుము, యాలకులపొడి వేసి బాగా కలిపి చిన్న చిన్న ముద్దల్లా చేసుకోవాలి.
* మైదాపిండిని పూరీల్లా చేసి దాని మధ్యలో కలిపిన జీడిపప్పు, బాదంపొడి మిశ్రమాన్ని ఉంచి అంచులు మూసేసి బొబ్బట్ల మాదిరిగా వత్తాలి. పెనంమీద నుంచి నెయ్యి వేస్తూ రెండువైపులా కాల్చి తీయాలి.