🕑 Published: May 24, 2026 at 11:09 AM CST
వర్జినియాలో మినీ మహానాడును ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రవాసాంధ్రుల తల్లిదండ్రులు ఇందులో ఉత్సాహంగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన, మా తెలుగు తల్లికి గీతాలాపనలతో కార్యక్రమం ప్రారంభమైంది. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కేకు కోసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి భానుప్రకాష్ మాగులూరి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ తెలుగు నేలపై చెరగని చిరునామా ఎన్టీఆర్ అని ఆయన ఏ నిర్ణయం తీసుకున్న అది ప్రజాహితమని అన్నారు.
భాను మాగులూరి మాట్లాడుతూ ఎన్టీఆర్ పాలనలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొని వచ్చి తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేశారని కొనియాడారు. యశస్వి బొద్దులూరి, సాయి బొల్లినేని, చంద్రమోహన్ బేవర, రామ్ ప్రసాద్ మైనేని, మన్నే సత్యనారాయణ, జానకిరామ్ భోగినేని, రమేష్ అవిర్నేని, కిషోర్ కంచెర్ల, పయ్యావుల చక్రవర్తి, సుశాంత్ మన్నే, ఫణి యలమంచిలి, అరుణ్ నాగ,రాజేష్ అడివి, మురళి బచ్చు, బాబు వేమన, సామినేని వెంకటేశ్వరరావు, సీతారామారావు, గోవర్ధన్, సుబ్బారావు, వెంకట రెడ్డి, చంద్రనాధ్ తదితరులు పాల్గొన్నారు.
మినీ మహానాడులో తీర్మానాలు:
1. A.P లో ప్రవాసాంధ్రుల ఆస్తుల పరిరక్షణకొరకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరుతూ తీర్మానించటమైంది.
2. ఆంధ్ర ప్రదేశ్ లో యువతకు సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు ఎన్నారై సేవలను వినియోగించుకోవాలని సూచిస్తూ తీర్మానించటమైంది.
3. ఆంధ్ర ప్రదేశ్ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల కొరకు ఎన్నారైలు పంపించే నిధులకు రాష్ట్ర ప్రభుత్వం మాచింగ్ గ్రాంట్ కింద గతంలో జన్మభూమి పేరిట నిధులు సమకూర్చేవారు. తిరిగి దాన్ని పునరుద్దరించవలసిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కోరుతూ తీర్మానించటమైంది.




