
నాట్స్ న్యూజెర్సీ విభాగం ఆధ్వర్యంలో ఇమ్మిగ్రేషన్ సెమినార్

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) న్యూజెర్సీ విభాగం ఆధ్వర్యంలో ఇమ్మిగ్రేషన్ సెమినార్ నిర్వహించారు. ట్రంప్ సర్కార్ నూతన సంస్కరణ నేపథ్యంలో ఈ సెమినార్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇమ్మిగ్రేషన్ లాయర్లు భాను బి. ఇల్లింద్ర, శ్రీనివాస్ జొన్నలగడ్డలు ముఖ్య అతిథులుగా పాల్గొని పలు విషయాలపై స్పష్టనిచ్చారు. జన్మత:పౌరసత్వం, H1B నుంచి గ్రీన్ కార్డు మార్గాలు, ఉద్యోగాలు చేస్తున్న భారతీయులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, H4 వీసా తదితరాదులపై విశ్లేషించారు. ప్రవాసుల సందేహాలను నివృత్తి చేశారు.
ప్రవాసులకు ఇమ్మిగ్రేషన్ ఆందోళన తగ్గించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ సెమీనార్ నిర్వహించామని నాట్స్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు శ్రీహరి మందాడి తెలిపారు. అమెరికాలో తెలుగువారికి ఏ కష్టం వచ్చినా నాట్స్ అండగా ఉంటుందని శ్రీహరి భరోసా ఇచ్చారు. నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ టీపీరావు, నేషనల్ మార్కెటింగ్ కో ఆర్డినేటర్ కిరణ్ మందాడి, న్యూజెర్సీ చాప్టర్ కో ఆర్డినేటర్ మోహన్ కుమార్ వెనిగళ్లలు సమన్వయపరిచారు. శ్రీకాంత్ పొనకల, వెంకటేష్ కోడూరి, రాకేష్ వేలూరు, వెంకట్ గోనుగుంట్ల, కృష్ణ సాగర్ రాపర్ల, రామకృష్ణ బోను, వర ప్రసాద్ చట్టు, జతిన్ కొల్లా, బ్రహ్మానందం పుసులూరి, ధర్మ ముమ్మడి, అపర్ణ గండవల్ల, రమేష్ నూతలపాటి, రాజేష్ బేతపూడి, సూర్య గుత్తికొండ, కృష్ణ గోపాల్ నెక్కింటి, శ్రీనివాస్ చెన్నూరు, సాయిలీల మగులూరిలు సహకరించారు. నాట్స్ న్యూజెర్సీ టీంను చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, అధ్యక్షుడు మదన్ పాములపాటిలు అభినందించారు.
Tags-NATS NJ
Gallery


