న్యూజెర్సీలో 'నారీ శక్తి ' కార్యక్రమంలో పాల్గొన్న మాధవీలత

Featured Image

న్యూజెర్సీలోని శ్రీ శివ విష్ణు దేవాలయంలో గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సనాతన ధర్మ పరిరక్షకురాలు, తెలంగాణ భాజపా నాయకురాలు కొంపెల్ల మాధవీలత ప్రవాసులతో సమావేశమయ్యారు. 'నారీ శక్తి' కార్యక్రమం పేరిట నిర్వహించిన ఈ సమావేశంలో సనాతన ధర్మం యొక్క విశిష్టత, ధార్మిక విలువల ద్వారా యువతకు మార్గనిర్దేశం చేయడం, మహిళలను ఆధ్యాత్మిక-సాంస్కృతిక చైతన్యంతో శక్తివంతం చేయడం అనే అంశాలపై ఆమె ప్రసంగించారు.

సనాతన ధర్మం వ్యక్తులను, కుటుంబాలను, సమాజాన్ని బలోపేతం చేసే శాశ్వత సూత్రాలను అందిస్తుందని, మహిళలు ఆధ్యాత్మికంగా శక్తివంతమైతే, భవిష్యత్ తరాల కోసం ధర్మానికి స్తంభాలుగా నిలుస్తారని మాధవీలత పేర్కొన్నారు. అనంతరం దేవాలయ ఆలయ మర్యాదలతో మాధవీలతకి వేద ఆశీర్వచనం చేశారు. 'సనాతనం శ్వాసగా' పాటను ఈ కార్యక్రమంలో మాధవిలత విడుదల చేశారు. ఈ పాటను ఎడిసన్ లో నివసిస్తున్న ఎన్.టీ.ఆర్ జిల్లా తిరువూరు మండలం పుట్రేలకు చెందిన కంభమ్మెట్టు శేషగిరిరావు రచించగా, విలాస్ రెడ్డి జంబుల, కొల్లా శ్రీనివాసరావులు నిర్మించారు. ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ రఘుశర్మ శంకరమంచి, సత్య నేమన, కృష్ణ గుడిపాటి, విలాస్ జంబుల, చివుకుల ఉపేంద్ర, మేడిచెర్ల మురళీ, దాము గేదెల తదితరులు పాల్గొన్నారు. అమెరికావ్యాప్తంగా మాధవీలత 13 నగరాల్లో పర్యటిస్తారని, ఫిబ్రవరి 18,19,20 తేదీల్లో డాలస్ ప్రవాసులతో సమావేశమవుతారని ఆమె పర్యటనను సమన్వయపరుస్తున్న జీహెచ్ఎఫ్ఎఫ్ సంస్థ అధ్యక్షుడు డా. వెలగపూడి ప్రకాశరావు తెలిపారు.

Tags-Kompella Madhavi Latha Meets New Jersey NRIs via NaariSakthi Event

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles