తానా 24వ మహాసభలకు సమాయత్తమవుతున్న డెట్రాయిట్

Featured Image

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 24వ ద్వైవార్షిక మహాసభలను జులై 3,4,5 తేదీల్లో డెట్రాయిట్‌లో నిర్వహిస్తున్నారు. ఈ సభల నినాదాన్ని తానా సభల కార్యవర్గం శుక్రవారం నాడు విడుదల చేసింది. “తరతరాల తెలుగుదనం – తరలివచ్చే యువతరం” అనే నినాదంతో ఈ సభలను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్లు సభల కన్వీనర్ ఉదయకుమార్ చాపలమడుగు, ఛైర్మన్ గంగాధర్ నాదెళ్లలు తెలిపారు. ఈ మహాసభలకు అమెరికా నలుమూలలా ఉన్న తెలుగువారితోపాటు అమెరికా-ఇండియాకు చెందిన రాజకీయ ప్రముఖులు, సాహితీవేత్తలు, సినీతారలు, క్రీడాకారులు తరలివస్తున్నారని నోవైలోని సబర్బన్‌ కలెక్షన్‌ షోప్లేస్‌ లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నట్లు వెల్లడించారు.

కాన్ఫరెన్స్‌ నిర్వహణ ఏర్పాట్ల కమిటీలో సహాయ సమన్వయకర్త కోనేరు శ్రీనివాస్, డైరెక్టర్‌ సునీల్‌ పాంట్ర, సెక్రటరీ కిరణ్‌ దుగ్గిరాల, ట్రెజరర్‌ జోగేశ్వరరావు పెద్దిబోయిన, తానా ఉత్తర ప్రాంతీయ ప్రతినిధి నీలిమ మన్నె, తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపులు ఉన్నారు. సభల ప్రచార కార్యక్రమాలను మార్చి నెల నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా వివిధ నగరాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. థీమ్‌ తానా, క్రీడా పోటీలు, నిధుల సేకరణ కార్యక్రమాలకు రూపకల్పను చేస్తున్నారు. ఈ మహాసభల్లో పదహారణాల తెలుగువైభవం కనిపించేలా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నట్లు మహాసభల కార్యవర్గం తెలిపింది. ప్రవాసులు ఈ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. చేసేందుకు కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు.

Tags-TANA 2025 Detroit

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles