ఆటా ఆధ్వర్యంలో విజయవంతంగా రంగారెడ్డి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీ

Featured Image

అమెరికా తెలుగు సంఘం(ఆటా), సేవ్ ఎన్విరాన్మెంట్-పబ్లిక్ స్కూల్స్ సహకారంతో రంగారెడ్డి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీ ఉత్సాహంగా నిర్వహించారు. తలకొండపల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఆటా ప్రతినిధులు పాల్గొని విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, తదుపరి అధ్యక్షుడు సతీష్ రామసహాయం రెడ్డి మాట్లాడుతూ... విద్యతో పాటు క్రీడలు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఎంతో అవసరమని, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీయడమే ఈ టోర్నమెంట్ ప్రధాన ఉద్దేశ్యం అని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలను రెండు రాష్ట్రాల్లో నిర్వహిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీ కో-చైర్ నరసింహ ద్యాసాని, సాయి సుధిని, ట్రెజరర్ శ్రీకాంత్ గుడిపాటి, క్రీడల సమన్వయకర్త విజయ్ గోలి, ఇతర ఆటా ప్రతినిధులు శ్రీధర్ బాణాల, కాశీ కొత్త, రామకృష్ణ అలా, సుధీర్ దామిడి, శ్రీధర్ తిరిపతి, పరమేష్ భీంరెడ్డి, రాజు కక్కెర్ల, రఘువీర్ మర్రిపెద్ది, వినోద్ కోడూరు, కిషోర్ గూడూరు, నర్సిరెడ్డి గడ్డికోపుల, విష్ణు మాధవరం, హరీష్ బత్తిని, సుమ ముప్పాల, వేణు నక్షత్రం, లక్ష్ చేపూరి, అనంత్ పజ్జూర్, అరవింద్ ముప్పిడి, తిరుమల్ మునుకుంట్ల, మీడియా సలహాదారు ఈశ్వర్ బండా తదితరులు పాల్గొన్నారు.

Tags-ATA Conducts Rangareddy District Level Volleyball Competition

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles