చికాగోలో సందడిగా ఆటా మాతృదినోత్సవం

Featured Image

అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ATA) చికాగో విభాగం ఆధ్వర్యంలో శనివారం నాడు అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మాతృమూర్తులను ఈ వేడుకల్లో స్మరించుకున్నారు. పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళా సమన్వయకర్తలు శిరీష వీరపనేని, సాయిని నర్వాడే, సుచిత్ర రెడ్డి, సారిక రెడ్డి శెట్టి, సరిత చదలవాడ తదితరులు సమన్వయపరిచారు. సాయిని సర్వాడే మహిళలకు పౌష్టికాహారంపై ప్రసంగించారు. ఫిజియోథెరపిస్ట్‌ సరిత చదలవాడ మహిళల సమగ్ర ఆరోగ్యంపై సలహాలిచ్చారు. కారక్రమంలో భాగంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఆటా కార్యదర్శి సాయినాథ్‌ బోయపల్లి, పాలకమండలి సభ్యులు వెన్‌ రెడ్డిరావి, ఆర్వీరెడ్డి, మహీధర్‌ ముస్కుల, రీజినల్‌ కో ఆర్డినేటర్లు పురుషోత్తం రెడ్డి, రాజ్‌ అడ్డగట్ల, మహేష్‌ కుమార్‌ చదలవాడ, లక్ష్మణ్‌ రెడ్డి తదితరులు సహకరించారు.

Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-ATA Chicago 2025 Mothers Day Celebrations

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles