నాట్స్ సంబరాల్లో థమన్-దేవిశ్రీల సంగీత ప్రవాహం

Featured Image

జూలై 4,5,6 తేదీల్లో టంపా వేదికగా జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో సంగీత దర్శకులు థమన్‌, దేవీశ్రీలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. వీరు ఇరువురు రెండు రోజుల పాటు అతిథులను తమ సంగీత విభావరితో అలరిస్తారని నిర్వాహకులు తెలిపారు. నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో ఆన్ లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందని నాట్స్ సంబరాల కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ అన్నారు. టంపాలో నిర్వహించే సంబరాల్లో ప్రవాసులు పెద్ద ఎత్తున పాల్గొనాలని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని కోరారు. ప్రతి రెండేళ్లకు ఒక్కసారి జరిగే అమెరికా తెలుగు సంబరాలను నాట్స్ ప్రతిసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తుందని అధ్యక్షుడు మదన్ పాములపాటి అన్నారు. సంబరాల్లో తెలుగు ఆట, పాటలతో పాటు ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు తెలుగువారిని అలరిస్తాయని ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి తెలిపారు. అమెరికా సంబరాలకు వచ్చే తెలుగువారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నామని నాట్స్ సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది పేర్కొన్నారు.

Tags-NATS 2025 Tampa Conference

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles