సినీప్రముఖులకు నాట్స్ సంబరాల ఆహ్వానాలు

Featured Image

ఫ్లోరిడా రాష్ట్రం టంపాలో జులై 4,5,6 తేదీల్లో నిర్వహిస్తున్న నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు ఆ సంస్థ ప్రతినిధులు భారత్‌లో పర్యటిస్తూ అతిథులను ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో సినీప్రముఖులను సంబరాలకు ఆహ్వానించామని సమన్వయకర్త గుత్తికొండ శ్రీనివాస్ తెలిపారు.

కె. రాఘవేంద్రరావు, వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్‌, తనికెళ్ల భరణి, సంగీత దర్శకుడు థమన్‌, దర్శకులు హరీశ్ శంకర్, మోహర్ రమేశ్‌ తదితరులను ఆహ్వానించారు. నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి, సంబరాల కమీటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది, బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి, బోర్డ్ డైరెక్టర్ సుమిత్ అరికపూడి, మెంబర్ షిప్ నేషనల్ కోఆర్డినేటర్ ఆర్.కె. బాలినేని, న్యూజెర్సీ చాప్టర్ మాజీ కోఆర్డినేటర్ సురేశ్ బొల్లు తదితరులు పాల్గొన్నారు.

Tags-NATS TollyWood

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles