సింగపూర్ స్వరలయ ఆర్ట్స్ 6వ వార్షికోత్సవం

Featured Image

స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ 6వ వార్షికోత్సవ వేడుకలను శనివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు హాజరై, సింగపూర్ లోని తెలుగువారు లలిత కళలను ప్రోత్సహిస్తున్న తీరును ప్రశంసించారు. ఆయన లలితకళల ప్రాధాన్యతను వివరించగా, కళల పట్ల ఆసక్తి యాంత్రిక జీవన శైలిలో మానవత్వాన్ని నిలబెట్టే మార్గమని చెప్పారు.

ఈ వేడుకలకు శ్ట్శ్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతీశ్వర్, సాంస్కృతిక కలసారథి అధ్యక్షుడు కవుటూరు రత్న కుమార్, ట్ఛ్శ్శ్ అధ్యక్షుడు గడప రమేష్, టాశ్ అనిత రెడ్డి, కమల క్లబ్ మాజీ అధ్యక్షులు పద్మజ నాయుడు, మగువ మనసు అడ్మిన్ ఉష, సింగపూర్ తెలుగు టీవీ రాధాకృష్ణ గణేశ్న, జయంతి రామ, భాగవత ప్రచార సమితి భాస్కర్ ఊలపల్లి, హ్&హ్ శ్యామల, విష్ణు ప్రియ, తెలుగు వనితలు అడ్మిన్స్ క్రాంతి, దేదీప్య, జయ, ప్రత్యూష, అమ్ములు గ్రూప్ నుంచి సునీత రామ్, ఖ్ఛాశ్ దివ్య తదితరులు హాజరయ్యారు. యడవల్లి శేషుకుమారి శిష్యులు ఆలాపించిన కీర్తనలు, వారి గాన ప్రతిభను ప్రశంసిస్తూ పలువురు అభినందనలు తెలిపారు. స్వరలయ విద్యార్థులకు సర్టిఫికేట్ బహుమతులు అందజేయగా, త్యాగరాజ ఆరాధన ఉత్సవాల్లో పాల్గొన్న గాయనీగణులకు మొమెంటోలు బహుకరించారు. శివకుమార్ మృదంగ వాయిద్య సహకారం అందించగా, చైతన్య వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-Singapore Swaralaya Arts 6th Anniversary

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles